breaking news
LGBT A Legal Battle Movie
-
'ఎల్జీబీటీ' సినిమా.. 50 డేస్ సెలబ్రేషన్
'ఎల్జీబీటీ-ఏ లీగల్ బ్యాటిల్' సినిమా విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్ చేసుకుంది. ఈ కార్యక్రమానికి చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు పలువురు ప్రముఖులు హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు.కార్యక్రమానికి హాజరైన తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ... ఈ సమాజంలో ట్రాన్స్‌జెండర్స్‌కు కూడా గౌరవప్రదమైన జీవితం ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ట్రాన్స్‌జెండర్స్‌కు ప్రాధాన్యం కల్పిస్తోంది. సమాజంలో అందరితో పాటు సమాన హక్కులు, అవకాశాలతో వారు ముందుకు సాగాలి. 'ఎల్జీబీటీ – ఏ లీగల్ బ్యాటిల్ పార్ట్-2' నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఈయన ప్రకటించారు.ఈ మూవీలో నటించిన సోనా రాథోడ్, విష్ణు తేజ రమణ, టీవీ రామన్, వంశీ తదితరులు చిత్ర బృందాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. చివరగా దీనికి కారణమైన ప్రేక్షకులకు, మీడియాకు, ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. -
LGBT: A Legal Battle మూవీ 50 రోజులు వేడుక (ఫొటోలు)
-
ట్రాన్స్ జెండర్స్‌పై వివక్ష తొలగిపోవాలి, అందుకే మూవీ తీశా
‘‘ట్రాన్స్ జెండర్స్ విషయంలో ఉన్న వివక్ష తొలగిపోవాలని, వారికీ సమానత్వం ఉండాలని చెప్పేందుకు ‘ఎల్జీబీటీ– ఎ లీగల్ బాటిల్’ మూవీ తీశాను. మా సినిమా ప్రదర్శితమవుతున్న అన్ని థియేటర్స్‌లో మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం ద్వారా సమాజంలో ఒక మంచి మార్పునకు అడుగుపడాలని కోరుకుంటున్నా’’ అని డైరెక్టర్ పి.సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎల్బీ శ్రీరామ్, ఎస్తేర్, ఆనంద చక్రపాణి, హిమ రాథోడ్, చంద్రముఖి, లైలా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఎల్జీబీటీ– ఎ లీగల్ బాటిల్’. శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్‌పై పి.సునీల్ కుమార్ రెడ్డి రచన, దర్శకత్వం, నిర్మాణంలో రూపొందిన ఈ మూవీ ఈ నెల 19న విడుదల అయింది. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించిన సక్సెస్ మీట్లో నటుడు ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ–‘‘నా కెరీర్లో ‘అమ్మో ఒకటో తారీఖు’ చిత్రం ఎలా గుర్తుండిపోయిందో ఈ ‘ఎల్జీబీటీ– ఎ లీగల్ బాటిల్’ సినిమా కూడా అలాగే గుర్తుండిపోతుంది’’ అని చెప్పారు. కాగా గే, ట్రాన్స్ జెండర్స్‌కు అండగా నిలుస్తున్న సేవా సంస్థల నిర్వాహకులను ఈ సందర్భంగా సత్కరించారు. తెలంగాణ స్టేట్ ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లైలా, నటుడు ఆనంద చక్రపాణి, గే కమ్యూనిస్ట్ యాక్టివిస్ట్ విష్ణు, ట్రాన్స్ జెండర్స్ ఇన్స్టాగ్రామ్ యాక్టివిస్ట్ హిమ రాథోడ్ మాట్లాడారు. -
మా సినిమాలో ‘ట్రాన్స్ జెండర్స్’ కష్టాలను చూపించాం: సునీల్ కుమార్ రెడ్డి
‘సమానత్వం ఉందని చెప్పుకునే మన దేశంలో ట్రాన్స్ జెండర్స్ విషయంలో తీవ్రమైన వివక్ష ఎదురవుతోంది. ట్రాన్స్ జెండర్స్ మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కానీ అవి పోలీస్ స్టేషన్స్ లో కేసులుగా నమోదు కావడం లేదు. కోర్టుల దాకా వెళ్లి జడ్జిమెంట్ పొంది శిక్షలు పడటం లేదు. ఇప్పటిదాకా ఒక్క ట్రాన్స్ జెండర్ కేసు కూడా ఏ కోర్టులోనూ తుది తీర్పు వచ్చి శిక్ష పడలేదు. ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదు. ఫస్ట్ టైమ్ ఎల్ జి బీ టీ ఏ లీగల్ బ్యాటిల్ సినిమాలోనే ఒక ట్రాన్స్ జెండర్ కేసులో పూర్తి న్యాయం జరిగినట్లు చూపిస్తున్నాం’ అన్నారు ప్రముఖ దర్శకనిర్మాత పి.సునీల్ కుమార్ రెడ్డి. రెడ్డి శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ఎల్ జి బీ టీ ఏ లీగల్ బ్యాటిల్. ఈ చిత్రంలో ఎల్ బి శ్రీరామ్, ఎస్తర్ నార్నోన్హ, రాజు ఖేర్, ఆనంద చక్రపాణి , ప్రీతీ నిగమ్ తో పాటు రియల్ ట్రాన్స్‌జెండర్ యాక్టర్స్ ప్రధాన పాత్రలు పోషించారు. హిమ రాథోడ్ హీరోయిన్ గా , చంద్రముఖి , లైలా వంటి ప్రముఖ యాక్టివిస్టులు , గే యాక్టివిస్ట్ విష్ణు తేజ నటించారు. ఈ నెల 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించారు.సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఒక కొత్త తరహా కంటెంట్ చూడాలనుకునే ప్రేక్షకులు మా సినిమాకు రావొచ్చు. పుణెలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో మా సినిమాకు బెస్ట్ ఫిలిం అవార్డ్ దక్కింది. ఫిలిం ఫెస్టివల్స్ కు మాత్రమే ఇలాంటి సినిమాలు పరిమితం కావొద్దు. జనాల మధ్యలో డిస్కషన్ కు రావాలి అనేది మా ఉద్దేశం. గే అండ్ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ గురించి నేను చేసిన చిత్రమిది. సెన్సార్ విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాం’ అన్నారుతెలంగాణ స్టేట్ ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లైలా మాట్లాడుతూ - మా హక్కుల కోసం ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నాం కానీ మాకు సరైన వేదిక ఎక్కడా లభించలేదు. డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు మా సమస్యల ఇతివృత్తంతో ఈ సినిమాను రూపొందించడం హ్యాపీగా ఉంది. మేము నటులము కాము. కానీ మా జీవితంలో మేము ఎలా ఉంటామో అలాంటి పాత్రలనే డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు ఈ చిత్రంలో తెరకెక్కించారు. మేము ఈ సినిమాలో మా నిజ జీవిత పాత్రలనే పోషించాం. ఈ సినిమా ద్వారా మేము సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వస్తాయని ఆశిస్తున్నాం’ అన్నారు.గే కమ్యూనిస్ట్ యాక్టివిస్ట్ విష్ణు మాట్లాడుతూ.. గే కమ్యూనిటీ కోసం దాదాపు 12 ఏళ్లుగా పోరాడుతున్నాను. మన సినిమాల్లో గే క్యారెక్టర్స్ ను కామెడీ కోసం ఉపయోగించడం చూశాం. కానీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కు వచ్చే అనేక చిత్రాల్లో ఎంతో డెప్త్ గా గే కమ్యూనిటీ సమస్యలను తెరకెక్కించడం నేను గమనించాను. ఇతర రాష్ట్రాల్లో గే లైఫ్ మీద ఇన్ డెప్త్ మూవీస్ సీరియస్ అప్రోచ్ తో వచ్చాయి. ఆ సినిమాల వల్ల అక్కడి సమాజం గే కమ్యూనిటీని చూసే విధానం మారిపోయింది. తెలుగులో ఫస్ట్ టైమ్ అలాంటి ప్రయత్నం డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయన మాతో ట్రావెల్ చేసి మా జీవితాన్ని దగ్గరగా గమనించారు. ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాకు మీ సపోర్ట్ దక్కాలి. ఈ చిత్రంతో మా జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశిస్తున్నాము. అన్నారు.ట్రాన్స్ జెండర్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సనా ఖాన్ మాట్లాడుతూ..మా జీవితాలు ఎలా ఉంటాయి అనేది చాలా మందికి తెలియదు. బయట ప్రపంచం చూడని మా జీవిత ప్రయాణాన్ని, మా సమస్యలు, భావోద్వేగాలను ఈ చిత్రంలో దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డిగారు చూపించారు. మేము ఏంటి అనేది కాకుండా మా ప్రతిభ అందరికీ తెలియాలి. ఇంకా మాకు మరిన్ని అవకాశాలు దక్కాలని కోరుకుంటున్నాం. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.


