ట్రాన్స్‌ జెండర్స్‌పై వివక్ష తొలగిపోవాలి, అందుకే మూవీ తీశా | LGBTQ A Legal Battle Movie Success Meet Highlights | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ ట్రాన్స్‌ జెండర్స్‌పై వివక్ష తొలగిపోవాలి, అందుకే మూవీ తీశా : పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి

Jun 23 2026 11:52 AM | Updated on Jun 23 2026 11:58 AM

LGBTQ A Legal Battle Movie Success Meet Highlights

‘‘ట్రాన్స్‌ జెండర్స్‌ విషయంలో ఉన్న వివక్ష తొలగిపోవాలని, వారికీ సమానత్వం ఉండాలని చెప్పేందుకు ‘ఎల్‌జీబీటీ– ఎ లీగల్‌ బాటిల్‌’ మూవీ తీశాను. మా సినిమా ప్రదర్శితమవుతున్న అన్ని థియేటర్స్‌లో మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం ద్వారా సమాజంలో ఒక మంచి మార్పునకు అడుగుపడాలని కోరుకుంటున్నా’’ అని డైరెక్టర్‌ పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. 

ఎల్‌బీ శ్రీరామ్, ఎస్తేర్, ఆనంద చక్రపాణి, హిమ రాథోడ్, చంద్రముఖి, లైలా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఎల్‌జీబీటీ– ఎ లీగల్‌ బాటిల్‌’. శ్రావ్య ఫిల్మ్స్‌ బ్యానర్‌పై పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి రచన, దర్శకత్వం, నిర్మాణంలో రూపొందిన ఈ మూవీ ఈ నెల 19న విడుదల అయింది. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించిన  సక్సెస్‌ మీట్‌లో నటుడు ఎల్‌బీ శ్రీరామ్‌ మాట్లాడుతూ–‘‘నా కెరీర్‌లో ‘అమ్మో ఒకటో తారీఖు’ చిత్రం ఎలా గుర్తుండిపోయిందో ఈ ‘ఎల్‌జీబీటీ–   ఎ లీగల్‌ బాటిల్‌’ సినిమా కూడా అలాగే గుర్తుండిపోతుంది’’ అని చెప్పారు. 

కాగా గే, ట్రాన్స్‌ జెండర్స్‌కు అండగా నిలుస్తున్న సేవా సంస్థల నిర్వాహకులను ఈ సందర్భంగా సత్కరించారు. తెలంగాణ స్టేట్‌ ట్రాన్స్‌ జెండర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ లైలా, నటుడు ఆనంద చక్రపాణి, గే కమ్యూనిస్ట్‌ యాక్టివిస్ట్‌ విష్ణు, ట్రాన్స్‌ జెండర్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ యాక్టివిస్ట్‌ హిమ రాథోడ్‌ మాట్లాడారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement