breaking news
P. Sunil Kumar Reddy
-
ట్రాన్స్ జెండర్స్‌పై వివక్ష తొలగిపోవాలి, అందుకే మూవీ తీశా
‘‘ట్రాన్స్ జెండర్స్ విషయంలో ఉన్న వివక్ష తొలగిపోవాలని, వారికీ సమానత్వం ఉండాలని చెప్పేందుకు ‘ఎల్జీబీటీ– ఎ లీగల్ బాటిల్’ మూవీ తీశాను. మా సినిమా ప్రదర్శితమవుతున్న అన్ని థియేటర్స్‌లో మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం ద్వారా సమాజంలో ఒక మంచి మార్పునకు అడుగుపడాలని కోరుకుంటున్నా’’ అని డైరెక్టర్ పి.సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎల్బీ శ్రీరామ్, ఎస్తేర్, ఆనంద చక్రపాణి, హిమ రాథోడ్, చంద్రముఖి, లైలా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఎల్జీబీటీ– ఎ లీగల్ బాటిల్’. శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్‌పై పి.సునీల్ కుమార్ రెడ్డి రచన, దర్శకత్వం, నిర్మాణంలో రూపొందిన ఈ మూవీ ఈ నెల 19న విడుదల అయింది. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించిన సక్సెస్ మీట్లో నటుడు ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ–‘‘నా కెరీర్లో ‘అమ్మో ఒకటో తారీఖు’ చిత్రం ఎలా గుర్తుండిపోయిందో ఈ ‘ఎల్జీబీటీ– ఎ లీగల్ బాటిల్’ సినిమా కూడా అలాగే గుర్తుండిపోతుంది’’ అని చెప్పారు. కాగా గే, ట్రాన్స్ జెండర్స్‌కు అండగా నిలుస్తున్న సేవా సంస్థల నిర్వాహకులను ఈ సందర్భంగా సత్కరించారు. తెలంగాణ స్టేట్ ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లైలా, నటుడు ఆనంద చక్రపాణి, గే కమ్యూనిస్ట్ యాక్టివిస్ట్ విష్ణు, ట్రాన్స్ జెండర్స్ ఇన్స్టాగ్రామ్ యాక్టివిస్ట్ హిమ రాథోడ్ మాట్లాడారు. -
త్వరలో అల్లూరి బయోపిక్
ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. మహానటి ఘనవిజయం సాధించటంతో సౌత్‌లోనూ ఈ హవా కనిపిస్తోంది. ఇదే బాటలో మరో చారిత్రక వీరుడి కథను వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు. మన్యం వీరుడిగా బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు జీవితకథను మరోసారి వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు. గంగపుత్రులు లాంటి అవార్డ్విన్నింగ్ సినిమాతో పాటు రొమాంటిక్ క్రైమ్ కథ లాంటి కమర్షియల్ సక్సెస్‌ను అందించిన పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో అల్లూరి బయోపిక్ తెరకెక్కనుంది. సీతారామరాజు అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను రిసాలి ఫిల్మ్ అకాడమీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ అద్భుతమైన నటనతో అల్లూరి పాత్రకు ప్రాణం పోసిన తరువాత ఎవరు ఆ పాత్రలో కనిపించే సాహసం చేయలేదు. మరి ఇప్పుడు సునీల్ కుమార్ రెడ్డి సీతారామరాజులో అల్లూరి గా ఎవరు కనిపిస్తారో చూడాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. సినిమాను మార్చిలో ప్రారంభించి ఆగస్టులో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. -
‘నేనేం చిన్నపిల్లనా?’
రాహుల్, తన్వి వ్యాస్ జంటగా పి. సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో డా. డి.రామానాయుడు నిర్మించిన చిత్రం ‘నేనేం చిన్నపిల్లనా?’. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న వెంకటేష్ సీడీని ఆవిష్కరించి, రామానాయుడు, రానాకి ఇచ్చారు.


