కెమెరా వెనుక ఉండాలని కలలు కన్న అమ్మాయి.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. గ్లామర్‌తో పాటు స్ట్రా్టంగ్ ఒపీనియన్స్ ఉన్న నటి మాళవికా మోహనన్ , చిల్ వైబ్స్‌తో మనతో పంచుకున్న ఎన్నో ఆసక్తికరమైన విషయాలన్నీ ఆమె మాటల్లోనే!
యాక్టింగ్ ప్లాన్ లోనే లేదు!
చిన్నప్పటి నుంచి కెమెరా వెనకే ఉండాలని అనుకునేదాన్ని. నాన్న కె.యూ.మోహనన్ సినిమాటోగ్రాఫర్. ఆయన తీసే షాట్స్ చూస్తూ పెరిగా. అందుకే మాస్ మీడియా చదివి డైరెక్షన్ లోకి వెళ్లాలనుకున్నా. కానీ ఒక రోజు మమ్ముట్టి సర్ నన్ను చూసి ‘యాక్టింగ్ చేస్తావా?’ అని అడిగారు. అలా ‘పట్టం పోలే’ సినిమాతో హీరోయిన్ గా మారిపోయా!
ఫైటింగ్‌లో ఉండే ఎనర్జీ వేరు!
చిన్నప్పుడే ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. ఒక సినిమా కోసం ‘సిలంబం’లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత అది నాకు చాలా ఇష్టమైపోయింది. ఆ స్టిక్ ఫైటింగ్‌లో ఉండే ఎనర్జీ, మూవ్‌మెంట్స్ చాలా మెడిటేటివ్‌గా అనిపిస్తాయి. ఇప్పుడు నా జిమ్ వర్కౌట్స్‌లో కూడా అది ఓ భాగమే.
రజనీకాంత్ కాల్ అంటే షాక్!
ఒకసారి రజనీకాంత్ సర్ నా పని చూసి స్వయంగా ఫోన్ చేశారు. ఆ క్షణం నిజంగా నమ్మలేకపోయా. ఇక హీరోయిన్స్‌లో నాకు నయనతార అంటే చాలా ఇష్టం.
భారీ కార్లు, బైక్స్ అంటే పిచ్చి!
నాకు కార్లు, బైక్స్ అంటే చాలా ఇష్టం. సినిమా సెట్స్‌లో కెమెరాలు, టెక్నికల్ ఎక్విప్‌మెంట్ చూస్తూ పెరగడం వల్ల మెకానికల్ విషయాల మీద కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. నేను కొంచెం ‘మోటర్ హెడ్’ టైప్!
అలాంటి అబ్బాయిలంటే ఇష్టం!
ఒకసారి సోషల్ మీడియాలో ఓ ఫ్యాన్ ‘బ్లాక్, వీటిష్, వైట్.. ఎలాంటి అబ్బాయిలు ఇష్టం?’ అని అడిగాడు. దానికి నేను ఒక్క లైన్ లో ‘నాన్ సెక్సిస్ట్ వన్స్!’ అని చెప్పా. అంటే నా ఉద్దేశంలో గౌరవం, సమానత్వం రంగు కంటే చాలా ముఖ్యం.
విక్కీ కౌశల్ నా చిన్నప్పటి ఫ్రెండ్!
విక్కీ కౌశల్, నేను ముంబైలో ఒకే హౌసింగ్ సొసైటీలో పెరిగాం. చిన్నప్పుడు బర్త్‌డే పార్టీల్లో ‘పాసింగ్ ది పార్సెల్’ ఆడుకునే వాళ్లం! ఇప్పటికీ మా ఇంటికి వచ్చి అమ్మ చేసిన ఫుడ్ తింటుంటాడు. అలాగే ఆయుష్మాన్ ఖురానా కూడా మా కాంప్లెక్స్‌లోనే ఉంటాడు. లిఫ్ట్‌లో, జిమ్‌లో తరచూ కలుస్తుంటాం.
కేరళ ఫుడ్ అంటే ప్రాణం!
బ్రౌన్ రైస్, ఫిష్ కర్రీ, క్రిస్పీ ఫ్రైడ్ ఫిష్, పాపడ్ ఉంటే చాలు.. అదీ చేత్తో తింటేనే అసలు టేస్ట్! ముంబైలో అయితే రాజ్మా చావల్ లేదా పెద్ద టిరామిసు డెజర్ట్ నా చీట్‌డే ఫేవరెట్స్.
తప్పు అనిపిస్తే స్ట్రెయిట్‌గా చెప్పేస్తా!
ఫ్లైట్ డిలే అయ్యి గంటలకొద్దీ ఎలాంటి అప్‌డేట్ లేకుండా కూర్చోబెడితే ఎవరికైనా కోపం వస్తుంది. అందుకే ఒకసారి ఎయిర్‌లైన్ సర్వీస్‌పై సోషల్ మీడియాలో ఓపెన్ గా మాట్లాడాను. అలాగే మీడియా ఇంటరాక్షన్స్‌లో కూడా ఒక లిమిట్ ఉంటుంది. గౌరవంగా మాట్లాడితే నేనూ గౌరవంగానే ఉంటాను.
టోకెన్ రోల్స్ వద్దు!
‘బియాండ్ ది క్లౌడ్స్’ తర్వాత చాలామంది బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేస్తాననుకున్నారు. కానీ కేవలం కనిపించడానికే వచ్చే పాత్రలు, టోకెన్ రోల్స్ నాకు వద్దు. క్యారెక్టర్‌లో డెప్త్, పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉంటేనే ఓకే చెబుతా.


