సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు నమోదు! | Case Registered Against Singer Rahul Sipligunj in Visakhapatnam | Sakshi
Sakshi News home page

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు నమోదు!

Aug 10 2026 11:39 PM | Updated on Aug 10 2026 11:41 PM

Case Registered Against Singer Rahul Sipligunj in Visakhapatnam

సాక్షి,విశాఖ: ప్రముఖ సింగర్‌ రాహుల్ సిప్లిగంజ్‌పై విశాఖపట్నంలో కేసు నమోదైంది. తనపై బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖలోని ఎంవీపీ కాలనీ పోలీసులు రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు మరో 11 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సదరు యువతి తన ఫిర్యాదులో రాహుల్‌పై పలు తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు సమాచారం. యువతి సమర్పించిన వివరాలు, ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రస్తుతం కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement