జానకి రెడ్డి మృతి పట్ల వైఎస్ జగన్‌ తీవ్ర సంతాపం | YS Jagan Condoles Death of YSRCP Leader Jaghavarapu Janaki Reddy | Sakshi
Sakshi News home page

జానకి రెడ్డి మృతి పట్ల వైఎస్ జగన్‌ తీవ్ర సంతాపం

Aug 10 2026 10:37 PM | Updated on Aug 10 2026 10:37 PM

YS Jagan Condoles Death of YSRCP Leader Jaghavarapu Janaki Reddy

సాక్షి,తాడేపల్లి: ఏలూరు జిల్లా వైఎస్సార్‌సీపీ ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకి రెడ్డి మృతి పట్ల పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

జానకి రెడ్డి హఠాన్మరణం చెందడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆమె కుమార్తె అజితా రెడ్డితో వైఎస్ జగన్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని ఆమెను ఓదార్చారు. జానకి రెడ్డి మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. 

పార్టీ ఆవిర్భావం నుండి ఆమె అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. వైఎస్సార్‌సీపీ కుటుంబం ఎల్లప్పుడూ జానకి రెడ్డి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement