శ్రీకాకుళం: ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు సాయి గణేశ్ కారు ప్రమాదం వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏడాది క్రితం ర్యాష్‌గా కారు నడుపుతూ ఆటోను ఢీకొట్టారు సాయి గణేశ్. ఈ ప్రమాదంలో చేపల భోగయ్య అనే వ్యక్తి మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన సమయంలో సాయి గణేశ్‌ను తప్పించి మరో వ్యక్తిని డ్రైవర్‌గా చూపించారు ఎమ్మెల్యే గోవిందరావు. మృతి చెందిన బాధితుడి కుటుంబానికి రూ.5 లక్షలు, ఉద్యోగం, పెన్షన్ ఇస్తానని చెప్పారు. ఏడాది గడిచినా బాధితులకు గోవిందరావు సాయం చేయలేదు. తనకు చెప్ప లాయర్లు తెలుసంటూ బాధితులను బెదిరించారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. బాధితులతో చర్చల సమయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బెదిరింపు వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.


