మృతి చెందిన రైతు కుటుంబానికి వైఎస్‌ జగన్‌ ఆర్థిక సాయం | YSRCP Chief YS Jagan Financial Assistance to Deceased Farmers Family | Sakshi
Sakshi News home page

మృతి చెందిన రైతు కుటుంబానికి వైఎస్‌ జగన్‌ ఆర్థిక సాయం

Aug 10 2026 9:43 PM | Updated on Aug 10 2026 9:44 PM

YSRCP Chief YS Jagan Financial Assistance to Deceased Farmers Family

ఏలూరు: గుండె పోటుతో మృతిచెందిన పొగాకు రైతు కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్థిక సాయం అందించారు. గత నెలలో బుట్టాయిగూడెం మండలం ముప్పినవారిగూడెంలో పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో మనస్థాపం చెంది గుండెపోటుకు గురై పాల వెంకటేశ్వర్లు అనే రైతు మృతి చెందారు.  

ఇటీవల తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పర్యటనలో మృతి చెందిన రైతు కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ పరామర్శించి భరోసా ఇచ్చారు. దీనిలో భాగంగా రైతు కుటుంబానికి ఆర్థిక సాయం కింద రూ.2  లక్షల చేక్కును పంపించారు వైఎస్‌ జగన్‌. ఈ చెక్కును పోలవరం నియోజవర్గం వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌ తెల్లం బాలరాజు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాధరావుల చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement