రాజేష్ నాయుడు దర్శకత్వలో బిచ్చు నాయక్ నిర్మిస్తున్న '2కె లవర్స్' సినిమా పూజా కార్యక్రమాలతో ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. మోహిత్ పెడాడ, శృతి శంకర్, సాయి కుమార్, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి మణిశర్మ, తనికెళ్ల భరణి, వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
(ఇదీ చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. 27 ఏళ్లకే చనిపోయిన నటి)
దర్శకుడు రాజేష్ నాయుడు మాట్లాడుతూ .. 'తెలంగాణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథతో పాటు, ఎమోషన్స్‌తో సినిమాని రూపొందిస్తున్నాం. ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది' అని చెప్పాడు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ రూ.35 లక్షలు.. కానీ మోసం చేశారు: పల్లవి ప్రశాంత్)


