రవితేజ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'. అయ్యప్పస్వామి నేపథ్యం కూడా ఇందులో కొంతమేర ఉంది. ఇప్పటికే పాటలు, ట్రైలర్ రిలీజయ్యాయి. ఈ శుక్రవారమే (ఆగస్టు 21) మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించారు. ఇందులోనే 'మల్లెపూల పల్లకి' అంటూ సాగే అయ్యప్ప పాటని విడుదల చేశారు.
శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ ఓ మధ్య తరగతి తండ్రిగా నటించాడు. ప్రియా భవానీ శంకర్ ఇతడికి జంటగా కనిపించనుంది. నక్షత్ర అనే బాలనటి, రవితేజ కూతురిగా చేసింది. జీవీ ప్రకాశ్ సంగీతమందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. గత కొన్నేళ్లుగా హిట్ అనేది లేని రవితేజకు ఇది కమ్ బ్యాక్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు. మరి ఇదెంత వరకు నెరవేరుస్తుందో చూడాలి?


