‘మీకు బీఫ్‌ నచ్చిందా?’ హీరోయిన్‌కి షాకింగ్‌ ప్రశ్న.. రియాక్షన్‌ ఇదే! | Actress Malvika Sharma Asked About Having Beef In Kerala | Sakshi
Sakshi News home page

‘మీకు బీఫ్‌ నచ్చిందా?’ హీరోయిన్‌కి షాకింగ్‌ ప్రశ్న.. రియాక్షన్‌ ఇదే!

Aug 17 2026 2:14 PM | Updated on Aug 17 2026 2:17 PM

Actress Malvika Sharma Asked About Having Beef In Kerala

మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్న హీరోయిన్‌ మాళవిక శర్మకు కేరళ మీడియాతో తొలి ఇంటరాక్షన్‌లో వింత అనుభవం ఎదురైంది. తన తాజా చిత్రం ‘ఖలీఫా: ది ఇంట్రో’ ప్రమోషన్‌లో భాగంగా కేరళ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఓ రిపోర్టర్‌ ఆమెను బీఫ్‌ గురించి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మాళవిక కొంత అసహనంగా స్పందించినట్లు వీడియోలో కనిపించింది. అయితే ఆమె ప్రశాంతంగానే సమాధానం ఇస్తూ.. తాను వెజిటేరియన్‌ అని స్పష్టం చేశారు.

మహారాష్ట్రకు చెందిన మాళవిక శర్మ తెలుగు సినిమాల ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ‘నేల టికెట్‌’, ‘రెడ్‌’, ‘హరోమ్‌ హరా’, ‘భీమా’ వంటి చిత్రాల్లో ఆమె నటించారు. ప్రస్తుతం మలయాళ చిత్రంతో మరో సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ఖలీఫా: ది ఇంట్రో’ చిత్ర బృందంతో కలిసి కేరళలో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఇందులో భాగంగా కేరళ మీడియా ప్రతినిధులతో మాళవిక తొలిసారి మాట్లాడారు. మీడియా సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ఓ రిపోర్టర్‌.. ‘మీకు బీఫ్‌ నచ్చిందా?’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో మాళవిక కొంత ఇబ్బందికి గురైనట్లు వీడియోలో కనిపించింది. అనంతరం ఆమె.. ‘నేను వెజిటేరియన్‌ను. కాబట్టి బీఫ్‌ ట్రై చేయలేదు’ అని సమాధానం ఇచ్చారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మాళవికను అడిగిన ప్రశ్నపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. సినిమా ప్రమోషన్‌కు సంబంధించిన విషయాలపై ప్రశ్నలు అడగకుండా, ఆమె వ్యక్తిగత ఆహారపు అలవాట్ల గురించి ఇలాంటి ప్రశ్న అడగడం ఎందుకంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం మీడియా ఇంటరాక్షన్‌లో ఇలాంటి ప్రశ్నలు ఎదురుకావడం సాధారణమేనని అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే, ‘ఖలీఫా: ది ఇంట్రో’తో మాళవిక శర్మ మలయాళ ప్రేక్షకులను పలకరించనున్నారు. మరోవైపు కన్నడలో ‘బృందావిహారి’ అనే చిత్రంలోనూ ఆమె నటిస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో తెలుగు దాటుకుని ఇతర భాషల పరిశ్రమల్లోనూ తన మార్కెట్‌ను విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement