శివ కందుకూరి, ద్రిషికా చందర్ హీరో హీరోయిన్లుగా రాజ్ కందుకూరి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘టాల్కమ్ పౌడర్’. సాయినాథ్ పొన్నా రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబరు 13న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు.
‘‘బంటీ అనే డ్రగ్ పెడ్లర్ చుట్టూ ‘టాల్కమ్ పౌడర్’ కథ సాగుతుంది. తెలియక చేసిన ఓ తప్పు కారణంగా బంటీ అనూహ్యమైన పరిస్థితుల్లో చిక్కుకుంటాడు. ఆ చిక్కుల నుంచి అతను ఎలా బయటపడతాడు? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు మేకర్స్.


