ప్రముఖ టిక్‌టాక్‌స్టార్‌ను కాల్చి చంపిన దుండగులు | Pakistani TikToker Shamsu Bibi Shot Dead Outside Her Home | Sakshi
Sakshi News home page

ప్రముఖ టిక్‌టాక్‌స్టార్‌ను కాల్చి చంపిన దుండగులు

Aug 17 2026 3:05 PM | Updated on Aug 17 2026 3:07 PM

Pakistani TikToker Shamsu Bibi Shot Dead Outside Her Home

పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ టిక్‌టాక్‌, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ షంసు బీబీ(28) అలియస్‌ అయేషా గిలామనా దారుణ హత్యకు గురయ్యారు. ఆగస్టు 14న టాక్సిలా నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై కాల్పులు జరిపారు. మెడపై బులెట్‌ తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు కొద్దిసేపటి ముందు కాశి అనే వ్యక్తి ఫోన్‌చేసి బయటకు రమ్మన్నాడు. దీంతో ఆమె తన 15 ఏళ్ల సోదరితో పాటు సోదరుడు నైమతుల్లాతో కలిసి కారులో బయటకు వెళ్లారు. ఈ సమయంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. అదే సమయంలో కారు అదుపు తప్పి ప్రమాదానికి గురికావడంతో ఆమె సోదరి తీవ్రంగా గాయపడింది.

డబ్బు లావాదేవీల విషయంలో కౌసర్‌, జావేద్‌ అలియాస్‌  షాహీన్‌ అనే ఇద్దరితో తన కుమార్తుకి విభేదాలు ఉన్నాయని అయేషా తండ్రి ఫజల్‌ సాహిబ్ జాదా ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా.. టిక్‌టాక్‌లో సుమారు 13లక్షల మంది అనుచరులను సంపాదించుకున్న అయేషా అంత్యక్రియలకు చాలా తక్కువ సంఖ్యలో హాజరయ్యారని వార్తలు వెలువడ్డాయి. దీంతో సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement