‘సాV3’లో కొత్తగా కనిపిస్తా : హీరో సామ్రాట్‌ | SaV3 Movie Teaser | Sakshi
Sakshi News home page

‘సాV3’లో కొత్తగా కనిపిస్తా : హీరో సామ్రాట్‌

Aug 17 2026 4:28 PM | Updated on Aug 17 2026 4:57 PM

SaV3 Movie Teaser

సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'సాV3'. లక్ష్మీకృష్ణ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై వి. విజయ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణమాయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన టీజర్‌ విడుదల కార్యక్రమానికి పలువురు బిగ్‌బాస్‌ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ.. 'సాV3' నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతోందని తెలిపింది.

ఈ చిత్రంలో తాను ఇప్పటివరకు చేయని పాత్రలో కనిపించనున్నానని హీరో సామ్రాట్‌ అన్నారు. టీజర్‌కు వస్తున్న స్పందన ఆనందంగా ఉందని హీరో డీమోన్ పవన్‌ పేర్కొన్నారు. దర్శకుడు కృష్ణమాయ మాట్లాడుతూ.. సినిమాలో టీజర్‌లో చూపించిన దానికంటే మరింత బలమైన కథాంశం ఉంటుందని, త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement