'ఇరుముడి' కోసం థియేటర్ బయట ప్రజలు ధర్నా | Makthal Village People Dharna At Irumudi Screening Theatre | Sakshi
Sakshi News home page

Irumudi Movie: తెలంగాణలోని ఓ గ్రామంలో చిత్రమైన అనుభవం

Aug 26 2026 2:21 PM | Updated on Aug 26 2026 2:21 PM

Makthal Village People Dharna At Irumudi Screening Theatre

ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. అయినా సరే గత కొన్ని నెలల నుంచి జనాలు కొత్త సినిమాలు చూసేందుకు థియేటర్లకు వెళ్తున్నారు. రవితేజ 'ఇరుముడి' కూడా నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతిచోట ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి నోట తెగ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా ఆడుతున్న థియేటర్ ముందు ప్రజలు ధర్నా చేసిన విచిత్ర సంఘటన మాత్రం తెలంగాణలోని మక్తల్ అనే ఊరిలో కనిపించింది.

(ఇదీ చదవండి: రవితేజకు కూడా తెలుసు.. వ్యాపారం వ్యాపారమే అని)

నారాయణపేట జిల్లాలోని మక్తల్‌లో ఉన్న వెంకటరమణ థియేటర్‌లో గత ఐదు రోజుల నుంచి 'ఇరుముడి' సినిమాని ప్రదర్శించారు. అయితే బుధవారం ఉదయం వచ్చి చూసేసరికి దీనిని తీసేసి 'టాక్సిక్' వేశారు. థియేటర్‌కి దగ్గరకు వచ్చిన పలువురు ప్రజలు.. ఎలాగైనా 'ఇరుముడి' సినిమానే ప్రదర్శించాలని ధర్నాకు దిగారట. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గత మూడు, నాలుగు రోజులుగా చాలామంది టికెట్లు దొరక్క వెనుదిరిగామని, మంగళవారం రాత్రి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు థియేటర్‌కు వెళ్లినా టికెట్లు దొరకలేదని... అవసరమైతే కింద కూర్చొని అయినా సినిమా చూస్తామని సదరు ప్రేక్షకులు/ప్రజలు అంటున్నారు. ఎవరి ఒత్తిడితో లేదా ఎవరి సూచనతో మూవీని తీసివేశారో? వెంకటరమణ థియేటర్ యాజమాన్యం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది.

(ఇదీ చదవండి: స్వామి శరణం.. 'ఇరుముడి'పై రామ్ చరణ్ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement