breaking news
Jagannath rath yatra
-
నిజమందిరానికి చేరిన జగన్నాథుడు : అద్వితీయంగా అంతిమ ఘట్టం
భువనేశ్వర్: పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష త్రయోదశి తిథి పురస్కరించుకుని శ్రీ జగన్నాథుని రథ యాత్ర అంతిమ ఘట్టం నీలాద్రి విజే మంగళవారం జరిగింది. దీంతో శ్రీ జగన్నాథుని వార్షిక రథ యాత్ర ముగిసింది. సంధ్యా ధూపం తర్వాత రథంపై ఉన్న మూల విరాటులతో ఉత్సవ మూర్తులను వరుస క్రమంలో గొట్టి పొహండి నిర్వహించి సురక్షితంగా శ్రీ మందిరం రత్న వేదికకు చేర్చడంతో నీలాద్రి విజే విజయవంతమై రథ యాత్రకు తెర పడింది. రథ యాత్ర క్రమంలో ఉత్సవ సేవాదులు నిర్వహించారు. రథాలపై మూల విరాటుల పూజలు ముగియడంతో రథాల పైనుంచి విగ్రహాల్ని దించేందుకు చారుమళ్లు ఏర్పాటు చేశారు. వీటి గుండా వరుస క్రమంలో మూల విరాటులతో ఉత్సవ మూర్తుల్ని శ్రీ మందిరం రత్న వేదిక పైకి తరలించారు. బుధ వారం నుంచి శ్రీ మందిరం రత్న వేదికపై భక్తులకు యథాతథంగా ఏడాది పొడవునా చతుర్థా మూర్తుల దర్శనం ప్రాప్తిస్తుంది. మహాలక్ష్మికి స్వామి బుజ్జగింపురథయాత్ర అంతిమ ఘట్టం నీలాద్రి విజే మహోత్సవంలో శ్రీ మహాలక్ష్మి దేవిని జగన్నాథ స్వామి బుజ్జగించే వైనం భక్త జనాన్ని ముచ్చట గొలిపించే అపురూప ఘట్టం. నీలాద్రి విజే సమయంలో సుదర్శనుడు, దేవీ సుభద్ర, బలభద్ర స్వామిని శ్రీ మందిరంలోనికి ఆహ్వానించిన శ్రీ మహా లక్ష్మి ప్రియ నాథుడు శ్రీ జగన్నాథుని ప్రవేశం అడ్డుకుని శ్రీ మందిరం సింహ ద్వారం తలుపులు మూసి వేస్తుంది. తనను విస్మరించి తోబుట్టువులతో యాత్రకు ఏగి విరహ వేదన తాళలేక స్వయంగా దర్శనం కోసం వెళ్లిన నిరుత్సాహ పరచడంతో శ్రీ మహా లక్ష్మి అలక ప్రదర్శించడం ఈ ముచ్చట గొలిపే ఘట్టం జానపద ఇతివృత్తం. దేవేరి అలక తీర్చేందుకు యాత్ర కానుకగా శ్రీ జగన్నాథుడు రసగుల్లాను దేవేరికి సమరి్పంచడంతో మురిసిపోయి సాదరంగా శ్రీ మందిరం లోనికి ఆహ్వానిస్తుంది. ఇది రథ యాత్రలో చిట్ట చివరి ముచ్చట గొలిపే ఘట్టం.అద్వితీయంగా అంతిమ ఘట్టంపర్లాకిమిడి: పదిరోజులపాటు గుండిచా రథయాత్రకు బయలుదేరిన జగన్నాథ, సుభద్ర, బలభద్రులు మంగళవారం ఉదయం మూడు రథాలతో నిజ మందిరానికి క్షేమంగా విచ్చేశారు. జిల్లా ఎస్పీ జ్యోతింద్రపండా, సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, తహసీల్దారు, ఐఐసీ ప్రశాంత్ భూపతి, ఇతర భక్తుల సహాయంతో రాజవీధి నుంచి శ్రీమందిరం వరకూ రథాన్ని లాగారు. గురువారం గురుపౌర్ణమి సందర్భంగా శ్రీలక్ష్మీదేవితో కలిసి శ్రీలక్ష్మీనారాయణ అవతారంతో రథాయాత్ర ముగుస్తుంది. ఆఖరిరోజున పెద్ద యాత్ర జరుగనున్నది. -
పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష నవమి భక్తులకు నిరుత్సాహం
భువనేశ్వర్: పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష నవమి రోజున గుండిచా ఆలయంలో నవమి సంధ్యా దర్శనం ప్రాప్తిస్తుంది. అడపా మండపంపై ఒక రోజు దర్శనం శ్రీ మందిరం నీలాద్రి మండపంపై జగతినాథుడు శ్రీ జగన్నాథ స్వామి ( Lord Jagannath ) పది సంవత్సరాల దర్శనం పుణ్యఫలం ప్రసాదిస్తుందని పౌరాణిక కథనాలు సూచిస్తున్నాయి. స్వామి జన్మస్థలం అడపా మండపంపై పగటి పూట దర్శనం కంటే సంధ్య వేళ దర్శనం పుణ్యం పది రెట్లు అధికంగా లభిస్తుంది. అందుచేత నవమి సంధ్యా దర్శనం ప్రాధాన్యత సంతరించుకుంది. అడపా మండపంపై శ్రీ నవమి సంధ్యా దర్శనం సాయంత్రం 6 గంటల వరకే పరిమితం చేశారు. స్వామి మారు రథ యాత్ర బహుడా యాత్రకు ముందస్తు సన్నాహాలు, బహుళ సేవల ఆచరణ ఒత్తిళ్ల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీ మందిరం పాలక వర్గం ప్రకటించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శ్రీ గుండిచా ఆలయ సింహ ద్వారం గుండా ప్రవేశం నివారించారు. దీంతో భక్తులకు నవమి నాడు సంధ్య వేళలో దర్శనం ప్రాప్తి లేకుండా పోయింది. సర్వత్రా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇదీ చదవండి: జగన్నాథుడి కల్కి అవతారం : మారు రథయాత్రశ్రీ గుండిచా ఆలయ శుద్ధి తర్వాత తర్వాత అడప మండపంపై అనేక ముఖ్యమైన సేవలను నిర్వహించాల్సి ఉంటుంది. బహుడా యాత్ర రోజున రథంపై మూల విరాటులను దర్శించుకునే అవకాశం భక్తులు పొందుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు భక్తజన వర్గం జగతి నాథుని పట్ల భక్తి పూర్వక సేవ, అంకితభావంతో సహకరించాలని అభ్యర్థించారు.. అనుబంధ వర్గాల సేవకుల సహకారం, సమన్వయంతో బహుడా సంబంధిత సేవల్ని సకాలంలో పూర్తి చేయాలని అభ్యర్థించారు. -
Jagannath Rath Yatra: కల్కి అవతారం : నేడు మారు రథయాత్ర
భువనేశ్వర్: శ్రీ గుండిచా ఆలయంలో భక్తులు శ్రీ జగన్నాథుని సంధ్యా దర్శనం కోసం తండోపతండాలుగా తరలి వచ్చారు. సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు పరిమితం చేశారు. అడప మండపంపై ఇది చివరి దర్శనం. ఈ సందర్భంగా శారదా బాలి జనసముద్రంగా మారింది. మహా ప్రభువు దర్శనం కోసం బొడొశొంఖొ వరకు బారులు తీరారు. రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ వైబీ ఖురానియా శుక్రవారం శ్రీ గుండిచా ఆలయం ప్రత్యక్షంగా సందర్శించారు. ఈ సందర్భంగా శారదా బాలి ప్రాంగణంలో భక్తుల రద్దీ నియంత్రణ, మారు రథ యాత్ర భద్రతా సన్నాహాల్ని ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఇదీ చదవండి: Antidepressants మహిళల మెదడు సేఫే, బట్ పురుషులకే!బహుడా యాత్ర పురస్కరించుకుని పోలీసులు వాహనాల రవాణా వ్యవస్థ కట్టుదిట్టం చేశారు. అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ దయాళ్ గంగ్వార్ ప్రత్యక్షంగా ఈ బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి ప్రజలకు బల్క్ సందేశాలు పంపిస్తారు. జన సందోహం ఉన్న చోట డ్రోన్, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అన్ని ఫోన్లకు సందేశాలు పంపిస్తారు. అదనంగా జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఎల్ఈడీల ద్వారా కూడా వాహన చోదకులకు సమాచారం ప్రసారం చేస్తారు. నవమి సంధ్యా దర్శనం, మారు రథ యాత్ర బహుడా భద్రత, రక్షణల సమగ్ర వ్యవస్థని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ వైబీ ఖురానియా పర్యవేక్షించారు. జన్మ వేదికపై శ్రీ జగన్నాథుని చివరి దర్శనం క్రమబదీ్ధకరణ కార్యాచరణని పరిశీలించారు. శాంతిభద్రతల ఏర్పాట్లపై ఆయన దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఇతర సీనియర్ అధికారులతో పోలీస్ డైరెక్టర్ జనరల్ సమావేశమయ్యారు. కల్కి అవతారంలో జగన్నాథుడు పర్లాకిమిడి: స్థానిక గుండిచా మందిరంలో జగన్నాథ స్వామి శుక్రవారం కల్కి అవతారంలో భక్తులకు దర్శనం కల్పించారు ఈ రోజుతో దశవతారాలు పూర్తయ్యాయి. శనివారం బహుడా యాత్ర సందర్భంగా శ్రీజగన్నాథరథాలు తిరుగుముఖం పెట్టారు. గుండిచా మందిరం వెలుపల ఆనందబజార్‌లో శుక్రవారం భక్తులకు ఉచితంగా ఓబ్బడా (అన్న ప్రసాదం) రథాయాత్ర కమిటీ అందజేసింది -
Rath Yatra Tragedy: ‘ఏ ఒక్కరూ పట్టించుకోలేదు’: మృతురాలి భర్త
పూరి: ఒడిశాలోని పూరిలో జరుగుతున్న రథయాత్రలో తొక్కిసలాట చోటుచేసుకుని ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటనలో భార్యను కోల్పోయిన ఒక యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తూ, జరిగిన ఘటన వివరాలను మీడియా ముందు వెళ్లగక్కాడు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులెవరూ స్పందించలేదని ఆయన ఆరోపించారు.తొక్కిసలాట ఘటనపై పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ ఎస్ స్వైన్ మాట్లాడుతూ ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జరిగిందని. జగన్నాథుడు, అతని తోబుట్టువుల వార్షిక రథోత్సవాన్ని వీక్షించడానికి వందలాది మంది భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారని తెలిపారు. ఆచారాల నిర్వహణకు సంబంధించిన సామగ్రిని తీసుకెళ్తున్న రెండు ట్రక్కులు.. రథాల సమీపంలోని రద్దీగా ఉండే ప్రాంతంలోకి ప్రవేశించడంతో, గందరగోళం నెలకొంది. ఈ నేపధ్యంలోనే తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. #WATCH | Puri, Odisha: Swadhin Kumar Panda, a resident of Puri, says, "I was there near the temple till 2-3 am last night, but the management was not good. A new way was made for VIPs, and common people were asked to exit from a distance. People started exiting from the entrance… https://t.co/jFE36gLDfu pic.twitter.com/6Ln6348Eoy— ANI (@ANI) June 29, 2025ఈ తొక్కిసలాటలో మరణించిన ముగ్గురిని బోలాఘర్కు చెందిన బసంతి సాహు, బలిపట్నానికి చెందిన ప్రేమకాంత్ మొహంతి, ప్రవతి దాస్‌గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాగా మృతి చెందిన ఒక మహిళ భర్త మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన జరిగినప్పుడు అధికారులెవరూ స్పందించలేదని, అగ్నిమాపక అధికారులు, రెస్క్యూ బృందం, వైద్య సిబ్బంది సమయానికి చేరుకోలేదని ఆరోపించారు.పురి నివాసి స్వాధిన్ కుమార్ పాండా మాట్లాడుతూ జనసమూహ నియంత్రణలో అనేక లోపాలు ఉన్నాయని ఆరోపించారు. ట్రాఫిక్ ఏర్పాట్లు సరిగా లేవన్నారు. ఈ ఘటనకు ఒడిశా ప్రభుత్వమే బాధ్యత వహించాలని పాండా డిమాండ్ చేశారు. ఈ ఘటన దరిమిలా ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యిందని ఒడిశా న్యాయ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. ఘటనా స్థలంలో డీజీపీ ఉండి, పరిస్థితులను చక్కదిద్దుతున్నారని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: Jagannath Rath Yatra: తొక్కిసలాటలో ముగ్గురు మృతి.. 50 మందికి గాయాలు -
Jagannath Rath Yatra: తొక్కిసలాటలో ముగ్గురు మృతి.. 50 మందికి గాయాలు
పూరీ: ఒడిశాలోని పూరీలో అత్యంత వైభవంగా జరుగుతున్న రథయాత్రలో అపశృతి చోటచేసుకుంది. గుండిచా ఆలయం సమీపంలో ఈరోజు (ఆదివారం) ఉదయం జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందగా, 50 మందికిపైగా జనం గాయపడ్డారు. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో గుండిచా ఆలయం ముందు భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. 🚨 BREAKING:Tragedy strikes at #JagannathRathYatra in Puri, Odisha — 3 people have died and at least 10 injured in a stampede near Gundicha Temple.What was meant to be a sacred celebration turned into chaos.💔 Heartfelt prayers for the families of the victims. pic.twitter.com/nNC43uSw35— Sarcasm Scoop (@sarcasm_scoop) June 29, 2025ఆలయం వెలుపల జనసమూహం ఒక్కసారిగా పెరగడంతో భయాందోళనలు నెలకొని, ఫలితంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. మృతులను, గాయపడిన వారిని వెంటనే పూరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. గుండిచా ఆలయం ముందు శారదబాలి సమీపంలో ఈ విషాదరక ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో రథంపై కూర్చున్న జగన్నాథుడిని చూసేందుకు భారీగా జనసమూహం అక్కడికి చేరుకుంది. దీంతో భక్తులను నియంత్రించడం పోలీసులుకు కష్టతరంగా మారింది.Distressing visuals from Jagannath Puri Rathyatra in Odisha where 3 reportedly killed in a stampede, multiple injured. pic.twitter.com/DoEZrXjM3p— Piyush Rai (@Benarasiyaa) June 29, 2025అదే సమయంలో తోపులాట జరగడంతో, కొందరు కింద పడిపోయారు. ఈ గందరగోళంలో ముగ్గురు ఇతరుల కాళ్లకింద నలిగిపోయి మృతిచెందారు. వారు ఖుర్దా జిల్లాకు చెందిన ప్రేమకాంత మొహంతి (80), బసంతి సాహూ (36), ప్రభాతి దాస్ (42)గా గుర్తించినట్లు పూరి జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రి అధికారులు ధృవీకరించారు. బాధితులను వెంటనే 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల బృందం వారికి చికిత్స అందిస్తోంది. బాధితులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. #WATCH | Odisha: A stampede has been reported during the Rath Yatra in Puri. Further details are awaited. (Visuals from outside the post-mortem centre in Puri) pic.twitter.com/4mOTnE6QTe— ANI (@ANI) June 29, 2025#PuriRathYatraMishap | On Puri Gundicha Temple stampede that led to death & injury of several devotees, Puri Collector Siddharth Shankar Swain says, “As soon as the Pahuda was opened, there was a sudden surge in the crowd. Nine devotees complained of breathlessness and were… pic.twitter.com/Z1TTlE7rPV— OTV (@otvnews) June 29, 2025 -
Jagannath Rath Yatra సర్వం జగన్నాథం
పర్లాకిమిడి: గజపతి జిల్లా పర్లాకిమిడిలో రథయాత్ర సందర్భంగా ఘోష యాత్ర మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రారంభమైంది. ఉదయం జిల్లా కలెక్టర్ బిజయ కుమార్దాస్, ఎస్పీ జ్యోతింద్ర నాథ్ పండా, సబ్ కలెక్టర్ అనుప్ పండాలు విచ్చేసి జగన్నాథ, బలభద్ర, సుభద్ర రథయాత్రకు పహాండిని ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటలకు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేసి జగన్నాథ, బలభద్ర, సుభద్రలను రథాలపైకి తీసుకెళ్లారు. అనంతరం గజపతి వంశీయురాలు కల్యాణీ దేవి గజపతి మేళతాళాలతో రాజ మందిరం నుంచి విచ్చేసి జగన్నాథుని రథంపై శా్రస్తోత్తరంగా పూజలు చేసి బంగారు చీపురుతో ఊడ్చి శుభ్రం చేశారు. దీనిని చెరాపహారా అంటారు. స్థానిక కళాకారులు రథాల ముందు ఒడిస్సీ నృత్యాలతో ప్రజలను అలరించారు. మూడు రథాలను గుండిచా మందిరం వైపు సాయంత్రం 5.00 గంటలకు తీసుకెళ్లడం మొదలుపెట్టారు. పోలీసులు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేయడం వలన ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. మల్కన్‌గిరిలో... జిల్లా కేంద్రంలో జగన్నాథ స్వామివారి రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ముందుగా కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పటేల్‌తో ఆలయ అర్చకులు పూజ నిర్వహించి రథం లాగడం ప్రారంభించారు. యాత్రలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రథం కదిలే సమయంలో కళాకారులు నృత్య ప్రదర్శనలు చేశారు. స్వామివారి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. రాయగడలో... రాయగడలో రథయాత్ర వైభవంగా జరిగింది. జగన్నాథ మందిరం నుంచి దేవతామూర్తులకు సాంప్రదాయబద్ధంగా పొహండి నిర్వహించి ప్రత్యేకంగా రూపొందించిన రథంలో నిలిపారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు రథంలాగే కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ ఫరూల్ పటా్వరీ, తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి, కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక తదితరులు రథంలాగే కార్యక్రమంలో పాల్గొన్నారు. అడుగడుగునా భక్తుల సౌకర్యార్థం స్వచ్ఛంద సేవా సంస్థలు మజ్జిగ, చల్లని పానీయాలు వితరణ చేశారు. ఇదిలా ఉండగా స్థానిక రైతుల కాలనీలోని జిమ్స్ పాఠశాల విద్యార్థులు రూపొందించిన రథం అందరినీ ఆకట్టుకుంది. రథయాత్రను తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు స్థానిక మజ్జిగౌరి మందిరం ట్రస్టు తరుపున మందిరం ప్రాంగణంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జయపురంలో... పట్టణంలో అంగరంగ వైభవంగా రథయాత్ర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని మిగిలిన ప్రాంతాల్లో శుక్రవారం యాత్ర జరగగా, ఒక్కరోజు తర్వాత అనగా శనివారం నుంచి జయపురంలో రథయాత్ర జరుగుతుంది. దీనిలో భాగంగా శుక్రవారం జగన్నాథ స్వామి ఆలయం నుంచి దేవతామూర్తులను మంగళ వాయిద్యాలతో తోడ్కొని వచ్చి రథాలపై ఆశీనులు చేశారు. అనంతరం శనివారం మధ్యాహ్నం వరకు దేవతామూర్తులకు భక్తులు పూజలు చేస్తారు. శనివారం మధ్యాహ్నం 4 గంటలకు రథాన్ని గుండిచా మందిరానికి తీసుకొని వెళ్తారు. కొరాపుట్‌లో... కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో రథయత్ర తొలి ఘట్టంలో భాగంగా రథాలు గుండిచా మందిరాలకు చేరుకున్నాయి. కొరాపుట్ జిల్లా కేంద్రంలో జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి దంపతులు, కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చోలు పాల్గొన్నారు. నబరంగ్‌పూర్‌లో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి రథం లాగారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో సీఆర్పీఎఫ్ 12వ బెటాలియన్‌లో నేతృత్వంలో కమాండెంట్ ఎన్కేకే ప్రసాద్ నేతృత్వంలో రథయాత్ర జరిగింది. మరోవైపు విశ్వవ్యాప్త రథయాత్రకు విభిన్నంగా జయపూర్, ఆంధ్రా–ఒడిశా వివాదస్పద ప్రాంతం కొఠియాలో ఒక రోజు ఆలస్యంగా శనివారం రథయాత్ర జరగనుంది. శుక్రవారం మాత్రం పొహండి నిర్వహించి విగ్రహాలను రథం మీదకి చేర్చారు. ఆకట్టుకునే పుష్ప మకుటంస్వామివారి అలంకరణలో ఆకట్టుకునే అపురూప పుష్ప మకుటం. దీనిని యాత్ర వ్యవహారిక భాషలో ఠయ్యా అంటారు. సుగంధిత పుష్పాలతో దేవతా త్రయం బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీజగన్నాథుని కోసం వేర్వేరుగా 3 ఠయ్యాలు తయారు చేస్తారు. స్థానిక రాఘవ దాసు మఠం క్రమం తప్పకుండా వీటిని పంపిణీ చేస్తుంది. వీటి తయారీలో వెదురు బద్దలు, జీలుగు, జరీ కాగితాలు వంటి ఆకర్షణీయమైన వస్తువులతో పాటు సుగంధిత పుష్పాలను వినియోగిస్తారు. కదంబ పుష్పాలు ప్రముఖ స్థానం ఆక్రమించి ఆబాలగోపాల భక్త జనాన్ని ఆకట్టుకుంటాయి. -
విశాఖ : కనుల పండువగా జగన్నాథ రథయాత్ర (ఫొటోలు)
-
హైదరాబాద్ : నేత్రపర్వంగా జగన్నాథ రథయాత్ర (ఫొటోలు)
-
గుజరాత్ లోని గోల్ వాడ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి
-
రథయాత్రలో అపశృతి.. భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగులు
గాంధీనగర్: గుజరాత్లో జగన్నాథ రథయాత్ర సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. జగన్నాథ యాత్రలో పాల్గొన్న ఒక ఏనుగు ఆగ్రహంతో భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో భయాందోళనకు గురైన భక్తులు ఆలయం నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో, ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట కారణంగా పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. కన్నుల పండుగగా జరిగే ఈ యాత్రను చూడడానికి దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ రథయాత్ర సందర్భంగా పలు రాష్ట్రాల్లో కూడా జగన్నాథ ఆలయాల్లో వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్‌లోని గోల్‌వాడలో కూడా భక్తులు రథయాత్రను నిర్వహించారు. అయితే, నిర్వాహకులు యాత్రలో ప్రత్యేక ఆకర్షణకు 18 ఏనుగులను అక్కడికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా యాత్ర ప్రారంభమైన 10 నిమిషాలకు అందులో ఉన్న ఓ ఏనుగు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆగ్రహంతో జనం పైకి దూసుకెళ్లింది.Breaking!🚨Three elephants went out of control during the Jagannath Rath Yatra in Ahmedabad, GujaratHorrifying visuals. #RathaJatra2025pic.twitter.com/W2b7CwHpVw— 𝗩eena Jain (@DrJain21) June 27, 2025 ఇక, సదరు ఏనుగును చూసి పక్కనే ఉన్న ఏనుగులు సైతం ఆగ్రహానికి లోనయ్యాయి. ఒక్కసారిగా అక్కడున్న భక్తులపైకి ఏనుగులు దూసుకెళ్లాయి. దీంతో, ఏనుగులను చూసి అక్కడ ఉన్న వారు భయపడి పరుగులు తీశారు. ఏనుగులు గట్టిగా అరుస్తూ.. అటూ ఇటూ తిరగాయి. ఈ క్రమంలో రథ యాత్ర వద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఆ ఏనుగులను కంట్రోల్ చేయడానికి మావటివాళ్లు కూడా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపు కాలేదు. ఎట్టకేలకు పరిస్థితిని అదుపు చేసి రథ యాత్రకు సిద్ధం చేశారు. ఈ ఘటనలో మొత్తం తొమ్మిది గాయపడినట్టు తెలుస్తోంది. చికిత్స కోసం వారిని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. Ahmedabad Rath Yatra ….All people are safe … pic.twitter.com/0rw979Mfxa— €hetu $oN¥ (@chetusony) June 27, 2025🔵During the Rath Yatra in Ahmedabad, an elephant ran out of control. A mishap was narrowly avoided...Jai Jagannath Ji 🙏🙏🙏 pic.twitter.com/fr6Cyx2qSi— THE UNKNOWN MAN (@Theunk13) June 27, 2025 -
పవిత్ర తులసి మాలలతో బుల్లి రథం
భువనేశ్వర్/పూరీ: పవిత్రమైన తులసి మాలలతో బుల్లి రథం రూపుదిద్దుకుంది. స్వామివారి భక్తులకు ఈ కళాఖండం అంకితం చేసినట్లు సృజనాత్మక కళాకారుడు బిశ్వజిత్ నాయక్ తెలిపారు. ఆరు రోజుల పాటు నిర్విరామంగా శ్రమించి 8 అంగుళాల ఎత్తు, 7 అంగుళాల వెడల్పుతో తయారు చేసిన ఈ రథంలో 551 తులసి మాలలు, 175 ఐస్‌క్రీం పుడకల్ని వినియోగించారు. రథయాత్రకు పోలీసు యంత్రాంగం సన్నద్ధంరథయాత్రకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. రథాలు లాగడం మొదలుకొని యాత్ర పూర్తయ్యే వరకు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా రథాలు లాగడంపై బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. పూరీ రిజర్వు పోలీసు గ్రౌండులో చేపట్టిన ఈ కార్యక్రమం రథయాత్రను తలపింపజేసింది. బలభద్రుని తాళ ధ్వజం, జగన్నాథుని నందిఘోష్, సుభద్ర దర్ప దళనంకు ప్రతీకగా మూడు జీపుల్ని మూడు రథాల మాదిరిగా వినియోగించారు. క్లియరెన్స్, కార్డన్ ఏర్పాటు దశల్లో అనుబంధ బలగాలకు మెలకువలను నేర్పించారు. అదనపు పోలీసు డైరెక్టరు జనరల్, జిల్లా న్యాయాధికారులు, సీనియర్ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో మాక్ డ్రిల్ నిర్వహించారు. -
Puri Rath Yatra 2025 ప్రత్యేక రైళ్లు
పర్లాకిమిడి: పూరీ రథయాత్ర సందర్భంగా ఈస్టు కోస్టు రైల్వే గుణుపురం–పూరీ–గుణుపురానికి ఈనెల 26, జూలై 4, జూలై 5న ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఈనెల 26న ట్రైన్ నంబర్ 08443 సాయంత్రం 6.30కు గుణుపురం నుంచి బయల్దేరి మరుసటి రోజు వేకువన 2.15కు పూరీ చేరుకుంటుంది. అన్ని స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది. అలాగే తిరుగు ప్రయాణం ట్రైన్ నంబరు 08428 పూరీ నుంచి 2.45లకు వేకువజామున బయలుదేరి గుణుపురానికి మధ్యాహ్నం 12.30లకు చేరుకుంటుందని ఈస్టుకోస్టు రైల్వే సీనియర్ డివిజనల్ మేనేజరు కె.సందీప్ తెలియజేశారు. రిటర్న్ ట్రైను పూరీ నుంచి జూన్ 27 నుంచి జూలై 6, జూలై 7 వరకూ నడుస్తుంది. అలాగే పలాస, పూరీ, పలాసకు అన్‌రిజర్వుడ్ స్పెషల్ ట్రైన్సు కూడా జూన్ 26 నుంచి జూలై 7 వరకూ రాత్రి 9.30కు పలాసలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కు పూరీ చేరుకుంటుంది. రిటర్న్ ట్రైన్లు కూడా పూరీ నుంచి పలాసకు జూన్ 27 నుంచి జూలై 8 వరకూ నడుస్తాయి. మధ్యాహ్నం 2.30కు బయల్దేరి అదే రోజు రాత్రి 9.15కు పలాస చేరుకుంటుంది. అన్ని స్టేషన్లలో ఈ ప్యాసింజరు ట్రైను నిలుపుదల చేస్తారని ఒక ప్రకటనలో తెలియజేశారు. చదవండి: శ్రీ జగన్నాథునికి ఖొల్లి లగ్గి సేవ .. ఎలా చేస్తారు? -
Jagannath Rath Yatra శ్రీ జగన్నాథునికి ఖొల్లి లగ్గి సేవ
భువనేశ్వర్: జగన్నాథుడిని యాత్రకు సిద్ధం చేసేందుకు గోప్య సేవకుల వర్గం తలమునకలై ఉంది. గత 13 రోజులుగా స్వామి సోదరీ సోదరులతో కలిసి తెర చాటున గోప్య సేవలు పొందుతున్నాడు. ఆషాఢ కృష్ణ పక్ష త్రయోదశి తిథి పురస్కరించుకుని స్వామి వారికి ఖొల్లి లగ్గి సేవ నిర్వహించారు. రాత్రి పూట ఈ సేవని చేపట్టారు. జ్వరం నుంచి ఉపశమనం పొందడంతో శారీరక దారుఢ్యం కోసం పలు లేపన సామగ్రి గోప్య మండపానికి తరలించడం ఖొల్లి లగ్గి సేవలో భాగం. శుద్ధ సువార్ సేవకుల ఇంటి నుంచి ఈ సామగ్రిని తీసుకుని వెళ్లడం ఆచారం. ముందు రోజు ద్వాదశి నాడు చీకటి పడిన తర్వాత శ్రీ మందిర సముదాయం విమలా దేవి పీఠం ఆవరణలో ఉన్న బావి నుంచి నీరు తోడుకుని పోయి స్వామి చికిత్స కోసం అవసరమైన లేపనాలు తయారు చేశారు. బాజా, తురాయి, ఘంటానాదంతో శుద్ధ సువార్ ఇంటి నుంచి శ్రీ మందిరానికి ఊరేగింపుగా ఔషధ సామగ్రిని సోమవారం తరలించారు. ఈ లేపన సామగ్రిని బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుని శ్రీ అంగాలకు పూర్తిగా అద్దుతారు. దీనితో శరీరం వజ్ర దారుఢ్యంతో మెరుస్తుంది. రూపుదిద్దుకుంటున్న జగన్నాథుని రథం ఈ నెల 27 నుంచి తొమ్మిది రోజుల పాటు జరగనున్న రథాయాత్ర కోసం రథం నిర్మాణం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. రథం తయారీలో భాగంగా రంగులు అద్దే పనుల్లొ కళాకారులు నిమగ్నమయ్యారు. ఈ ఏడాది సుమారు 15 లక్షల రుపాయలను వెచ్చించి రథాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నహాలు చేస్తుంది. స్థానిక పాతబస్టాండు సమీపంలోని గుండిచా మందిరంలో పరిశుభ్రత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటుగా జగన్నాథ, బలభద్ర, శుభద్ర దేవతా మూర్తులు గుండిచా మందిరంలో ఉండి భక్తులకు దర్శంన ఇస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి తెలిపారు. ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. తొమ్మిది రోజుల యాత్రలో భాగంగా గుండిచా మందిరానికి ఆనుకుని ఏర్పాటైన స్టాల్స్ వద్ద భక్తుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు పూర్తిగా ఉంటుందని వివరించారు. -
సేంద్రియ బియ్యంతో జగన్నాథునికి అమృతాన్న భోగం
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని దైనందిన భోగాల నివేదనలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది రథ యాత్ర మొదలుకొని స్వామి వారికి అమృత అన్న భోగం నివేదన ప్రారంభించనున్నారు. ఈ కార్యాచరణలో భాగంగా రథ యాత్ర నుంచి గుండిచా మందిరం అడపా మండపంలో కొఠొ భోగ సమయంలో మహా ప్రభువుకు అమృత అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. సోమవారం మందిరం ప్రధాన నిర్వాహకుడు (సీఏఓ) డాక్టర్ అరవింద కుమార్ పాడీ అధ్యక్షతన జరిగిన అధికారిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బొడు సువార్, సువార్ మహాసువార్ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. సువార్ మహాసువార్ భోగ మండపంలో అమృత అన్నం ఉపయోగించాలని ప్రతిపాదించారు. మహా ప్రభువు భోగం తయారీలో అమత అన్నాన్ని ఉపయోగించడం గురించి గతంలో చర్చించి ప్రయోగాత్మకంగా ఈ చర్యని అమలు చేశారు. కొరాపుట్ ప్రగతి ఇనిస్టిట్యూట్ అమృత అన్నం బియ్యం సరఫరాకు మద్దతు ప్రకటించిందని సీఏఓ తెలిపారు. ఈ సంస్థ ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. సేంద్రియ బియ్యంతో ప్రసాదం తయారీ.. మందిరంలో జగన్నాథుని అన్న ప్రసాదాలు మహా ప్రసాదంగా ప్రతీతి. ఈ ప్రసాదం సేంద్రియ బియ్యాన్ని ఉపయోగించి తయారు చేయాలని పాలక వర్గం నిర్ణయించడం ప్రత్యేకత సంతరించుకుంది. స్వామి నిత్య అన్న ప్రసాదాల తయారీలో సేంద్రియ బియ్యం వినియోగిస్తారు. ఈ బియ్యంతో వండిన ప్రసాదాల్ని అమృత్ అన్నం అనే ప్రత్యేక పేరుతో వ్యవహరిస్తారు. ఎటువంటి రసాయన ఎరువులు ఉపయోగించకుండా సహజమైన ఎరువులను ఉపయోగించి సాగు చేసిన బియ్యం మాత్రమే వినియోగిస్తారు. తొలి దశలో స్వామికి నివేదించే కొఠొ భోగ సేవలో మాత్రమే వినియోగిస్తారు. తదుపరి దశలో ఇతర అన్ని వంటకాల్లో ఈ బియ్యం వినియోగం బలపరుస్తారు. రాష్ట్రంలో రైతులు పండిస్తున్న కొళాజీర, పింపుడిబాసొ, యువరాజ్ మొదలైన సేంద్రియ బియ్యాన్ని అమృత అన్న మహా ప్రసాదంలో ఉపయోగిస్తారు. మందిరంలో రోజుకు 50 నుండి 55 క్వింటాళ్ల బియ్యంతో స్వామి మహా ప్రసాదం వంటకం అవుతుంది. ప్రత్యేక ఉత్సవాలు, పండగపబ్బాల సందర్భంగా రోజుకు 100 నుండి 200 క్వింటాళ్ల బియ్యాన్ని ఉపయోగిస్తారు. అదనంగా కొఠొ భోగం కోసం ప్రతి రోజూ 100 కిలోల బియ్యాన్ని ఉపయోగిస్తారు. అన్న మహా ప్రసాదానికి అధిక నాణ్యత గల బియ్యం వినియోగానికి ప్రాధాన్యం కల్పిస్తున్నారు. పిండి వంటల ప్రసాదాల తయారీలో మసూరి బియ్యం కొనసాగుతుంది. క్రమంగా వీటి స్థానంలో అమృత్ అన్నం బియ్యం వినియోగించే యోచన ఉన్నట్లు పేర్కొన్నారు. పథకం ప్రకారం మందిరం అన్న ప్రసాదాల తయారీలో కొరత లేకుండా అమృత అన్నం బియ్యం సరఫరా చేసేందుకు కనీసం నాలుగు వందల నుంచి ఐదు వందల ఎకరాల భూమిలో సేంద్రియ వరి సాగు అవసరం అని అనుభవజ్ఞుల వర్గం పేర్కొంది. మందిరం పాలక వర్గం ఈ మేరకు సన్నాహాలు చురుగ్గా కొనసాగిస్తుంది.ఇదీ చదవండి: Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత -
మూలికా వైద్యం, కోలుకుంటున్న జగన్నాథుడు
భువనేశ్వర్: జ్యేష్ట పూర్ఠణిమ నుంచి అస్వస్థతకు గురైన శ్రీ జగన్నాథుడు తెర చాటున గోప్యంగా వైద్య సేవలు పొందుతున్నాడు. స్వామి ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. మరో వైపు యాత్ర దగ్గర పడుతుంది. స్వామి ఆగమనం కోసం భక్త జనం నిరీక్షిస్తోంది. రాజ వైద్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో రాత్రింబవళ్లు ఉపచారాలు చేస్తున్నారు. శుక్రవారం పవిత్ర అనవసర దశమి సందర్భంగా శ్రీ మందిరంలో చక్కా విజే సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాటుల్ని రాతి పీఠంపైకి తరలించారు. ఇది స్వామి ఆరోగ్యం కోలుకుంటున్నట్లు సంకేతం. భోగ మండప సేవ పూర్తి అయిన తరువాత జయ, విజయ ద్వారం మూసివేసి బెహరణ్ ద్వారం తెరిచారు. ధుకుడి ద్వారం సమీపంలో ఉన్న మూడు స్తంభాకార పీఠాలను గోప్య సేవల ప్రాంగణానికి తరలించి వాటిపై మూల విరాట్లను పూజించడం చక్కా విజే సేవగా పేర్కొంటారు. దశ మూల మోదకాల వైద్యం ఆయుర్వేద పద్ధతులు, గ్రంథాల ప్రకారం జగతి నాథునికి వైద్యం కొనసాగుతుంది. ఆరోగ్య స్థితిగతులకు అనుగుణంగా వైద్య శైలిని సమయోచితంగా సవరించుకుని ఔషదీయ పదార్థాల్ని నివేదిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం స్వామి కోసం దశ మూలికల మోదకం తయారు చేశారు. శ్రీ మందిరం రాజ వైద్య సేవకులు తరతరాలుగా మహా ప్రభువుని సేవిస్తున్నారు. ఈ మహా ఔషధిని సిద్ధం చేయడంలో పది రకాల ఔషధీయ మూలికల్ని వినియోగించడం విశేషం. ఈ మిశ్రమంతో తయారు చేసిన ఔషధాన్ని వేర్వేరుగా 3 మట్టి పాత్రల్లో పేర్చి వాటిపై కర్పూరం చల్లి మూతబెట్టి శ్రీ మందిరంలో గోప్య సేవలు అందజేస్తున్న వర్గాలకు అందజేశారు. (Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత)ఆషాఢ కృష్ణ పక్ష దశమి రోజున మూడు రాతి పీఠాలపైకి చేర్చిన మర్నాడు సంప్రదాయం ప్రకారం దేవ దేవుళ్ల కోసం రాజ వైద్యుల కుటుంబీకులు తయారు చేసిన దశ మూలికల ఔషధాన్ని వైద్యంలో భాగంగా నివేదిస్తారు. ఆషాఢ కృష్ణ పక్ష ఏకాదశి నాడు మూల విరాటులకు పతి మహాపాత్రొ వర్గం సేవకులు వీటిని సమర్పిస్తారు. పవిత్ర ఏకాదశి తిథి నాడు రాత్రి పూట ఆలయ వైద్యుడి సలహా మేరకు పతి మహాపాత్రో సేవకులు వీటిని సమర్పిస్తారు.కోలుకుంటున్న జగన్నాథుడు -
అంగరంగ వైభవంగా పూరీ జగన్నాథుని రథయాత్ర (ఫోటోలు)
-
Jagannath Rath Yatra 2024: పూరీలో వైభవంగా రథయాత్ర
భువనేశ్వర్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరీలోని జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా మొదలైంది. సాయంత్రం లక్షలాది భక్తుల నినాదాల నడుమ జగన్నాథ ఆలయం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండీచా ఆలయం దిశగా భారీ రథాలు ముందుకు సాగాయి. 5.20 గంటలకు రథాలు కదిలాయి. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మూడు రథాలకు పూజలు చేశారు. ఆమె, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్, సీఎం మోహన్ చరణ్ మాఝి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జగన్నాథ రథం తాళ్లను లాగి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ముందున్న బలభద్రుని ప్రతిష్టించిన 45 అడుగుల ఎత్తైన రథాన్ని దేవీ సుభద్ర, జగన్నాథుని రథాలు అనుసరించాయి. రథయాత్రకు ముందు భక్తుల బృందాలు జగన్నాథుని కీర్తనలను ఆలపిస్తూ ముందుకు సాగారు. రెండు రోజులపాటు సాగే యాత్ర కోసం భారీగా బందోబస్తు చేపట్టారు.సాయంత్రం వేళ బలభద్రుని రథం లాగుతున్న చోట ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో ఊపిరాడక తొమ్మిది మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోగా ఒడిశాలోని బాలాంగిర్ జిల్లాకు చెందిన లలిత్ బాగార్తి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. భక్తుని మృతి పట్ల సీఎం చరన్ మాఝీ సంతాపం వ్యక్తంచేశారు. అయితే 300 మందిదాకా గాయపడినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. -
బంజారాహిల్స్‌లో జగన్నాథ రథయాత్ర దృశ్యాలు
-
పూరీ రథయాత్ర ప్రారంభం.. భారీగా భక్తుల రాక
భువనేశ్వర్: దేశంలో ప్రఖ్యాత జగన్నాథుని రథయాత్ర ప్రారంభమైంది. ఇక, రథయాత్ర సందర్భంగా పూరీ నగరం భక్తులతో నిండిపోయింది. రథయాత్రలో పాల్గొనేందుకు ఒడిశాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీక్షేత్రం పరిసరాలతో పాటు అక్కడి వీధులన్నీ కిక్కిరిపోతున్నాయి. ‘జై జగన్నాథ’ నినాదాలతో పూరీ నగరం మార్మోగుతోంది. ఇదిలా ఉండగా, మంగళవారం ఉదయం జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాలను రథాలపై ప్రతిష్ఠించి తరువాత మంగళహారతి చేపట్టారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్ రథాలపై చెరాపహర (బంగారు చీపురుతో ఊడ్చడం) చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు భక్తులు రథాలను లాగుతారు. సాయంత్రం రథాలు గుండిచా మందిరానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇక, పూరీ రథయాత్రకు పలువరు ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. #WATCH | A large number of devotees gather in Odisha's Puri for the #JagannathRathYatra_2023 pic.twitter.com/CzRrc3hZHI — ANI (@ANI) June 20, 2023 Puri Ratha Yatra,Odisha 🌅🌺🌺🌺🌺👏👏👏🐚🐚🐚🐚🐚🐚 pic.twitter.com/2K6tOzGmCp — SATYAJIT PRADHAN (@Satyaji56683529) June 20, 2023 ఇది కూడా చదవండి: వీడియో: కేదార్నాథ్ ఆలయ గర్భగుడిలో అపచారం.. మహిళ ఓవరాక్షన్.. శివలింగంపై కరెన్సీ నోట్లు.. -
జగమంతా జగన్నాథుడు
-
వైభవంగా జగన్నాథుడి రథయాత్ర
పూరి : జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా గురువారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం తొమ్మిది గంటలకు ప్రాతఃకాల ధూపదీపాదులు, మంగళ హారతి ముగించి మూల విరాట్ల తరలింపు (పొహొండి) కార్యక్రమం చేపట్టారు. శ్రీ మందిరం నుంచి స్వామి యాత్ర కోసం ఉవ్విళ్లూరుతున్న రథాలు ఉరకలేసుకుని ముందస్తుగా శ్రీ మందిరం సింహద్వారం ఆవరణకు చేరాయి. రథ నిర్మాణ ప్రాంగణంలో తయారీ ముగించుకుని వస్త్రాలంకరణ, కలశ స్థాపన, చిత్ర లేఖనం వగైరా ఆర్భాటాలతో మూడు రథాలు ఒక దాని వెంబడి మరొకటిగా క్రమంలో స్వామికి స్వాగతం పలికేందుకు ముందస్తుగా సింహదార్వం దగ్గర నిరీక్షించాయి. సుదర్శనుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర, జగన్నాథుని మూల విరాట్లు వరుస క్రమంలో రథాలపైకి చేరిన తర్వాత రథయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర సూర్యాస్తమయం వరకు నిరవధికంగా కొనసాగుతుంది. మరోవైపు జగన్నాథుని రథయాత్రను పురస్కరించుకుని ప్రధాన దేవస్థానం శ్రీ మందిరం పుష్పాలంకరణతో శోభిల్లుతోంది. ఆలయ చరిత్రలో రథయాత్రను పురస్కరించుకుని దేవస్థానం పుష్పాలంకరణతో శోభిల్లడం ఇదే తొలిసారి. యాత్ర నేపథ్యంలో శ్రీ మందిరం, గుండిచా మందిరాలు, ఉప ఆలయాల్ని పూలతో అలంకరిస్తారు. సీసీ టీవీ నిఘా స్వామి రథయాత్రను పురస్కరించుకుని అశేష జన వాహిని తరలి వస్తుంది. రోడ్డు, రైలు రవాణా సంస్థలు యాత్రికుల తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. యాత్రికుల రద్దీ దృష్ట్యా శాంతిభద్రతల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. పూరీ పట్టణం అంతటా పకడ్బందీగా సీసీటీవీ కెమెరా నిఘా కార్యాచరణలో ఉంటుందని రాష్ట్ర డైరెక్టరు జనరల్ ఆఫ్ పోలీసు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శర్మ తెలిపారు. రైలు, బస్సులు ఇతరేతర వాహనాలు, సముద్ర మార్గం గుండా చొరబాటుదారుల నివారణకు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై జాగిలాల స్క్వాడ్‌తో బాంబు నిర్వీర్య దళాల్ని రంగంలోకి దింపారు. నలు వైపుల నుంచి తరలి వచ్చే వాహనాలతో అవాంఛనీయ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక నియంత్రణ ఏర్పాటుచేశారు. సాగర తీరం గుండా సంఘ విద్రోహ శక్తులు చొరబడకుండా మెరైన్ పోలీసు దళాల సమన్వయంతో సాగర తీరంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. -
గజేంద్రుడి రైలు యాత్ర!
కష్టం మనది కాకపోతే ముంబైదాకా దేక్కుంటూ వెళ్లమని సలహా ఇచ్చాడట వెనుకటికి ఎవరో! అహ్మదాబాద్‌లోని ఓ గుడి నిర్వాహకుల నిర్వాకం ఇదే తీరును తలపిస్తోంది. గుడిలో ఊరేగింపు కోసం వీళ్లు 4 ఏనుగులను తెప్పిస్తున్నారు! ఏనుగు అంబారీపై దేవుడి ఊరేగింపు! బాగానే ఉంది కదా అంటున్నారా? ఎక్కడి నుంచో తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకుంటారు! దేశానికి తూర్పు కొసన ఉండే అస్సాం నుంచి!! జూలై 4న అహ్మదాబాద్‌లో జగన్నాథ రథయాత్ర జరగనుంది. కానీ.. ఈ గుడికి చెందిన 3 ఏనుగులు వయసు మీదపడటంతో గత ఏడాదే మరణించాయి. ఈ ఏడాదికి అంబారీల్లేకుండానే యాత్ర నిర్వహించినా బాగుండేదది.. కానీ.. గుడి ధర్మకర్తలకు ఏం బుద్ధి పుట్టిందో ఏమో 4 ఏనుగులను అరువుకు తెచ్చుకుందామని నిర్ణయించారు. ఇంకేముంది అసోంలోని తీన్‌సుఖియా నుంచి గజరాజులను తెప్పించండని ఆర్డర్ వేసేశారు. అసోం ప్రభుత్వమూ అందుకు ఓకే చెప్పింది. ఇంకేముంది.. అంతా హ్యాపీ అనుకుంటున్నారా? అక్కడే ఉంది తిరకాసు. రెండు ప్రాంతాల మధ్య దూరం దాదాపు 3100 కిలోమీటర్లు! ఇంతదూరం ఏనుగులను రవాణా చేయడం ఎలా? ఆ.. ఏముంది. రైల్వే కోచ్‌లపై పంపేస్తే సరి అని అసోం ప్రభుత్వం చెప్పడంతో జంతు ప్రేమికులు మండిపోతున్నారు. కనీసం మూడు నాలుగు రోజుల సమయం పట్టే ఈ ప్రయాణాన్ని గజరాజులు తట్టుకోలేవని.. ఉత్తర భారతమంతా 40 డిగ్రీలకు పైబడ్డ వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతూంటే.. నోరు లేని జీవాలను ఇంత కష్టపెడతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. వేడికి, వడగాడ్పులకు తట్టుకోలేక మనుషులే చచ్చిపోతూంటే ఏనుగులు ఎలా తట్టుకోగలవు? అని జంతు సంరక్షణ ఉద్యమకారుడు కౌషిక్ బారువా నిలదీస్తున్నారు. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైల్వే కోచ్‌పై రవాణా చేస్తే.. ఏనుగులు ఎంత ఆందోళన, ఒత్తిడికి గురవుతాయో అధికారులు కొంచెం కూడా ఆలోచించకపోవడం అమానవీయమని దుమ్మెత్తి పోస్తున్నారు కౌషిక్! ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఏనుగులకు వడదెబ్బ తగలొచ్చునని.. షాక్‌తో మరణించవచ్చు కూడా అని ఆయన హెచ్చరించారు. మన చట్టాల ప్రకారం సంరక్షిత జంతువుగా గుర్తింపబడ్డ ఏనుగులను ఎక్కడికైనా తరలించాలంటే ప్రత్యేకమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఆరుగంటల కంటే ఎక్కువ కాలం వాహనాలపై రవాణా చేయకూడదు. ఏకబిగిన ముప్పై కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడిపించ కూడదు కూడా. ఈ చట్టాలన్నింటినీ ఉల్లంఘిస్తూ వాటిని తరలించడం ఏమాత్రం సబబు కాదని జంతుశాస్త్రవేత్త బిభూతీ ప్రసాద్ లహకార్ స్పష్టం చేశారు. ఇంకోవైపు కాంగ్రెస్ ఎంపీ తరుణ్ గొగోయ్... ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఏనుగుల కష్టాన్ని నివారించాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌కు ఓ లేఖ రాశారు. ‘‘అయినా... గణపతిని పూజించే మనవాళ్లు.. ఆ దేవుడికి ప్రతిరూపంగా భావించే ఏనుగును ఒక్క ఊరేగింపు కోసం ఇంత హింసపెట్టాలా?’’ అని కౌషిక్ ప్రశ్నిస్తున్నారు. -
వైభవంగా రథయాత్ర
భువనేశ్వర్/పూరీ: శ్రీ జగన్నాథుని రథ యాత్ర శనివారం పూరీలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన లక్షలాది భక్తజన సందోహం నడుమ జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర విగ్రహాలతో కూడిన రథాలు శ్రీ మందిరం నుంచి అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి బయలుదేరాయి. పూరీ గజపతి మహారాజా దివ్య సింఘ్ దేవ్ రథాల్ని బంగారు చీపురుతో శుభ్రం చేసి దేవతలకు మంగళ హారతి సమర్పించడంతో యాత్ర ప్రారంభమయింది. జగన్నాథుని నందిఘోష్ రథం సకాలంలో శనివారం సాయంత్రానికి గమ్యం చేరలేక పోయింది. గుండిచా మందిరానికి సమీపంలో ఆగిపోయింది. దీంతో ఇక్కడే రథంపై ఉన్న జగన్నాథునికి సేవాదులు నిర్వహిస్తారు. కాగా, రథయాత్ర సజావుగా సాగేందుకు కీలక ప్రాంతాల్లో భారీగా సీసీ టీవీలను అమర్చారు. సుమారు 5,200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఒడిశా స్విఫ్ట్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు. -
పూరీ: కదిలిన జగన్నాథ రథ చక్రాలు
-
పూరీ జగన్నాథ రథయాత్రకు ఉగ్రముప్పు!
పూరీ(ఒడిశా): విశ్వవిఖ్యాత శ్రీ జగన్నాథుని రథయాత్రను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నారా? పూరీలో దాడులు చేయాలని ప్లాన్ వేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీంతో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో పూరీ జగన్నాథ రథయాత్రకు భారీ భద్రత కల్పిస్తున్నారు. జల మార్గంలోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సముద్ర మార్గంలో ఉగ్రవాదులు చొరబడకుండా నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. ఇందులో భాగంగానే‘సౌనక్’ పహరా నౌకను పారాదీప్ ఓడరేవులో నిలిపారు. ‘సౌనక్’కు తోడుగా మరో 2 వేగవంతమైన పెట్రోలింగ్ ఓడలు కూడా చేరాయి. పారాదీప్ నుంచి పూరీ వరకు సువిశాల సముద్ర మార్గంలో ఈ ఓడలు భద్రతా వ్యవహారాల్ని పర్యవేక్షిస్తాయి. ఇవీ సౌనక్ ప్రత్యేకతలు.. సౌనక్ పూర్తిగా స్వదేశీ తయారీ ఓడ కావడం విశేషం. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల 21వ తేదీన కోస్ట్‌గార్డ్ వాహినిలో సౌనక్ను చేర్చారు. దీని పొడవు 105 మీటర్లు. 9,100 కిలో వాట్ల శక్తివంతమైన 2 డీజీలు ఇంజిన్లతో సౌనక్ గంటకు 26 నాట్ల వేగంతో దూసుకుపోతుంది. 2 తేలికపాటి హెలికాప్టర్లు, 30 ఎం.ఎం. క్లోజ్ రేంజ్ నావికా తుపాకులు, 5 అత్యాధునిక హై–స్పీడ్ పడవలు అనుక్షణం అందుబాటులో ఉంటాయి. సముద్రంలో తైల కాలుష్యం లేకుండా సౌనక్ పని చేయడం మరో విశేషం. విపత్కర పరిస్థితుల్లో తక్షణ సేవలు అందజేసేందుకు దీనిలో 14 మంది కోస్టు గార్డు అధికారులు, 98 మంది జవాన్లను నియమించారు. సముద్ర ఠాణా పోలీసుల సమన్వయంతో సౌనక్ ఓడ రేవు అనుక్షణం అప్రమత్తంగా సముద్ర మార్గం గుండా ఉగ్రవాదుల చొరబాటుపై నిఘా వేస్తుంది. -
కన్నుల పండువగా జగన్నాథ రథోత్సవం
సంప్రదాయ దుస్తులు ధరించిన యువత మేళ తాళాల మధ్య నృత్యాలు చేస్తుండగా జగన్నాథ రథయాత్ర వైభవంగా ముందుకు సాగింది. బుధవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లోని జగన్నాథ మందిరం వద్ద రథయాత్ర కోలాహలం ఆకట్టుకుంది. గవర్నర్ దంపతులు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసి పూజలు నిర్వహించారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవి ఉత్సవమూర్తుల విగ్రహాలను రథాలపైకి చేర్చే ఘట్టం అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన రథయాత్ర పూజలు మధ్యాహ్నం 1 గంటకు రథాలను లాగే ఘట్టంతో కన్నుల పండువగా జరిగాయి. సరిగ్గా 3.30 గంటలకు ముగ్గురూ దేవతామూర్తుల విగ్రహాలను సమీపంలోని కనకదుర్గా దేవాలయానికి చేర్చారు. దారి పొడవునా భక్తులు రథయాత్రను తిలకించారు. -
జగన్నాథుడు అందరివాడు
జూలై 6 జగన్నాథ రథయాత్ర పూరీ శ్రీక్షేత్రంలో వెలసిన శ్రీ జగన్నాథుడు అందరివాడు. ఎక్కడో అల్లంత దూరాన కొండలపై కాకుండా, భక్తులకు చేరువగా సముద్ర తీరానికి కూతవేటు దూరంలో వెలసిన దేవదేవుడు జగన్నాథుడు. ఆలయానికి రాలేని భక్తులకు కన్నుల పండుగ చేసేందుకు ఏడాదికి ఒకసారి సోదరీ సోదర సమేతంగా రథమెక్కి పూరీ పురవీధుల్లో ఊరేగుతాడు. జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథాలు పూరీ బొడొదండొలో (పెద్దవీధి) ముందుకు సాగుతూ ఉంటే, ఆలయాలే కదలి వస్తున్నాయా అనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే ఈ రథాల పైభాగం ఆలయ గోపురాల్లానే గోచరిస్తాయి. స్నానపూర్ణిమతో ప్రారంభం పూరీ శ్రీక్షేత్రంలో నిత్యం వేడుకలు, తరచు పండుగలు, పర్వదినాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడ ‘బారొ మాసొ తేరొ పొర్బొ’ (పన్నెండు నెలలు... పదమూడు పండుగలు) అనే నానుడి స్థిరపడింది. జ్యేష్ఠపూర్ణిమ రోజున జగన్నాథుడికి స్నానం చేయిస్తారు. దీనినే స్నానపూర్ణిమ అంటారు. స్నానపూర్ణిమ రోజు నుంచే రథయాత్ర వేడుకలకు సన్నాహాలు మొదలవుతాయి. స్నానపూర్ణిమ రోజున గర్భగుడిలోని మూలవిరాట్టులైన దారువిగ్రహాలను బయటకు తెచ్చి, ఆలయం తూర్పువైపు ప్రహారీగోడ వద్ద స్నానం చేయిస్తారు. ఈ స్నానానికి ఆలయంలోని ‘సునా కువా’ (బంగారుబావి) నుంచి తోడితెచ్చిన 108 కుండల నీటిని వినియోగిస్తారు. ఈ స్నానం తర్వాత జగన్నాథుడు జలుబు, జ్వరంతో బాధపడతాడంటారు. అందుకే రెండు వారాల పాటు చీకటి గదిలో ఉంచేసి, దైతాపతులు పసర్లు, మూలికలతో చికిత్స చేస్తారు. ఈ తతంగం జరిగే రెండు వారాల్లో ఆలయ గర్భగుడిలో మూలవిరాట్టుల దర్శనం లభించదు. మూలవిరాట్టుల పీఠంపై జగన్నాథ, బలభద్ర, సుభద్రల పటచిత్రాన్ని ఉంచి పూజలు చేస్తారు. రెండు వారాల చికిత్స తర్వాత తేరుకున్న జగన్నాథుడు రథారూఢుడై గుండిచా మందిరానికి బయలుదేరుతాడు. నయనానందకరం రథయాత్ర వేడుక పూరీలో అంగరంగ వైభవంగా జరిగే రథయాత్ర వేడుక నయనానందకరంగా సాగుతుంది. ఆషాఢ శుద్ధి విదియ నాడు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు రథాలపై తమ పిన్నిగారి ఇల్లయిన గుండిచా మందిరానికి బయలుదేరుతారు. జగన్నాథుడి రథం పేరు ‘నందిఘోష్’ కాగా, బలభద్రుడి రథం ‘తాళధ్వజ’, సుభద్ర రథం ‘దర్పదళన్’. నందిఘోష్ అన్నిటి కంటే ఎత్తుగా ఉంటుంది. దీని ఎత్తు 44.2 అడుగులు. ‘తాళధ్వజ’ ఎత్తు 43.3 అడుగులు, ‘దర్పదళన్’ ఎత్తు 42.3 అడుగులు. రథయాత్ర రోజున జగన్నాథ, బలభద్ర, సుభద్రల విగ్రహాలను సంప్రదాయబద్ధంగా అలంకరిస్తారు. ముందే సిద్ధం చేసిన రథాలను పూరీ రాజు స్వయంగా చీపురుపట్టి శుభ్రపరుస్తారు. రథాలను శుభ్రపరచడం పూర్తయ్యాక భారీ దారువిగ్రహాలను మోసుకుంటూ రథాలపైకి తరలిస్తారు. విగ్రహాలను రథాలపైకి తరలించే కార్యక్రమాన్ని ‘పొహాండి’ (పాండోజనం) అంటారు. రథాలపైకి చేరిన విగ్రహాలకు పూజారులు శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు. రథాలకు కట్టిన పొడవాటి మోకులను భక్తులు లాగుతారు. భక్తులు రథాలు లాగుతుండగా రథాలపై పూజారులతో పాటే ఉండే ‘డకువా’లు జేగంటలు మోగిస్తూ జగన్నాథుడిపై నిందాస్తుతులతో కీర్తనలు అందుకుంటారు. రథయాత్ర సాగుతున్నంత సేపు పూరీ బొడొదండొ (పెద్దవీధి) లక్షలాది మంది భక్తజనసందోహంతో కిటకిటలాడుతుంది. దేశం నలుమూలల నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. రథయాత్ర మరునాటికి మూడు రథాలూ గుండిచా మందిరానికి చేరుకుంటాయి. గుండిచా మందిరంలో సుభద్రా బలభద్రుల సమేతంగా జగన్నాథుడు ఆషాఢ శుద్ధ దశమి వరకు కొలువు దీరుతాడు. గుండిచా మందిరంలో ఉన్నన్నాళ్లూ జగన్నాథుడు దశావతారాల వేషాల్లో భక్తులకు దర్శనమిస్తాడు. ఆషాఢ శుద్ధ దశమి రోజున జగన్నాథుడు శ్రీక్షేత్రం వైపు తిరుగు ప్రయాణం ప్రారంభిస్తాడు. ఈ తిరుగు ప్రయాణాన్ని ‘బాహుడా’ (మారు రథయాత్ర) అంటారు. ఆషాఢ పూర్ణిమ నాటికి శ్రీక్షేత్రానికి చేరుకుంటాడు. ఆ రోజున జగన్నాథుడు స్వర్ణాలంకార వేషంతో (సునా బెసొ) భక్తులకు దర్శనమిస్తాడు. జగన్నాథుడి స్వర్ణాలంకార దర్శనంతో రథయాత్ర వేడుకలు పరిసమాప్తమవుతాయి. ఊరూవాడా రథాల వేడుక పూరీలోనే కాదు, ఒడిశా రాష్ట్రంలో ఊరూరా రథయాత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆలయాల పరిధిలో జరిగే రథయాత్ర వేడుకలు సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. అయితే, ఊళ్లల్లో చిన్నారులు సైతం చిన్న చిన్న రథాలపై జగన్నాథుడిని వీధుల్లో ఊరేగిస్తూ సంబరాలు చేసుకుంటారు. జేగంటలు, తప్పెట్లు మోగిస్తూ తమకు తోచిన రీతిలో పూజలు చేసేస్తూ ఉంటారు. నచ్చిన చిరుతిళ్లను నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఇతర దేవతలను ఇలా ఇష్టమొచ్చిన రీతిలో పూజించడానికి పిల్లలకు అనుమతి ఉండదు. అయితే, అందరివాడైన జగన్నాథుడి విషయంలో ఎలాంటి ఆంక్షలు, నియమ నిబంధనలు ఉండవు. జగన్నాథుడిని ఎవరైనా పూజించవచ్చు, ఎలాగైనా పూజించవచ్చు. అందుకే ‘సర్వం శ్రీజగన్నాథం’ అనే నానుడి వ్యాప్తిలోకి వచ్చింది. ఛప్పన్న భోగాల నైవేద్యం జగన్నాథుడు నైవేద్య ప్రియుడు. అనుదినం స్వామికి ఛప్పన్న (యాభయ్యారు) భోగాలను నివేదిస్తారు. ఈ నైవేద్యాల కోసం పూరీ శ్రీమందిరంలో అనునిత్యం వంటలు సాగుతూనే ఉంటాయి. కట్టెల పొయ్యలపై కుండలలో వంటకాలు వండుతారు. దివ్యధామమైన పూరీలో నివేదించే ప్రసాదాన్ని ‘ఒభొడా’ అంటారు. వడ్డించడాన్ని ఒరియాలో ‘భొడా’ అంటారు. మహాప్రసాదాన్ని వడ్డించరు. అందుకే దీనికి ‘ఒభొడా’ అనే పేరు వచ్చింది. పూరీ ఆలయంలో ఈ నైవేద్యాల తయారీ కోసం 752 కట్టెపొయ్యలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. నాలుగు వందల మంది పాకప్రవీణలు అలుపెరగకుండా గరిటెలు తిప్పుతూనే ఉంటారు. పూరీ ఆలయ ప్రాంగణంలోని ఆనంద్‌బజార్‌లో ఈ ప్రసాదాలను కుండల్లో పెట్టి భక్తులకు విక్రయిస్తారు. ఛప్పన్న భోగాలను ఎందుకు నివేదిస్తారనే దానిపై ఆసక్తికరమైన గాథ ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణుడు రోజుకు ఎనిమిదిసార్లు తినేవాడట. ఇంద్రుడు రాళ్లవాన కురిపించినప్పుడు గోవులు, యాదవుల రక్షణ కోసం గోవర్ధనగిరి ఎత్తిన కృష్ణుడు ఏడురోజులు భోజనం చేయకుండా ఉండిపోయాడట. ఇంద్రుడికి బుద్ధి చెప్పి గోవర్ధనగిరిని కిందకు దించిన కృష్ణుడికి యాదవులందరూ 56 పదార్థాలను సమర్పించారట. అందుకే కృష్ణుడి రూపమే అయిన జగన్నాథుడికి పూరీలో 56 పదార్థాలను నివేదించడం ఆచారంగా వస్తోందని చెబుతారు. -
బంజారాహిల్స్ లో జగన్నాథుడి రథయాత్ర
బంజారాహిల్స్ (హైదరాబాద్) : బంజారాహిల్స్ రోడ్ నెం.12లో జగన్నాథుడి రథయాత్ర శనివారం వైభవోపేతంగా సాగింది. ఉదయం ఉత్సవమూర్తులకు మంగళహారతి, రథాల ప్రతిష్ట, విగ్రహాలను రథాలపైకి తరలించే పొహండి కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. జగన్నాథ, బలభద్ర, సుభద్ర ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి మేళతాళాల మధ్య రథాలపై ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆలయ అర్చకులు రథాలపై చెరా పొహరా(బంగారు చీపురుతో ఊడవడం) నిర్వహించారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వానాల మధ్య మూడు రథాలు బంజారాహిల్స్‌రోడ్ నెం.12లో ఊరేగింపుగా బయల్దేరాయి. ఎనిమిది రోజుల అనంతరం ఈ నెల 26వ తేదీన తిరుగు రథయాత్ర(బహుద) ఉంటుంది. యాత్ర సందర్భంగా బంజారాహిల్స్ రహదారులు జనసంద్రంగా మారాయి. నగర నలుమూలల నుంచి భక్తులు ఈ ఘట్టాన్ని తిలకించేందుకు రోడ్లకిరువైపులా బారులు తీరారు. నగరంలో నివసించే ఒడిస్సా వాసులంతా ఈ రథయాత్రలో పాల్గొన్నారు. సుమారు 50 వేల మంది భక్తులు ఈ ఊరేగింపులో పాల్గొన్నట్లు ఆలయ అర్చకులు వెల్లడించారు. సుమారు నాలుగు గంటల పాటు రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తులను సమీపంలోని కనకదుర్గ దేవాలయంలో ప్రతిష్టించారు. -
అవతార పురుషుడు జగన్నాథుడు
రేపు తొలి రథయాత్ర నేడు స్వామి కల్యాణం 8న తిరుగు రథయాత్ర అనకాపల్లి : జగన్నాథ రథయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాలకు అనకాపల్లి పట్టణం ముస్తాబయింది. గవరపాలెంలోని అగ్గిమర్రిచెట్టు వద్ద ఉన్న శ్రీ సుభద్ర బలభద్రా సమేత జగన్నాథ స్వామి దేవస్థానం రథయాత్ర మహోత్సవాలకు వేదిక కానుంది. ఈ నెల 29 నుంచి జూలై 8వ తేదీ వరకూ నిర్వహించనున్న మహోత్సవాలలో భాగంగా స్వావి దశావతారాలలో దర్శనం ఇవ్వ నున్నారు. గూడ్స్‌షెడ్ వద్ద ఉన్న ఇంద్రద్యుమ్నహాల్‌లో స్వామి రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమి స్తారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి జగన్నాథస్వామి దేవాలయంలో శ్రీ రుక్మీణి, సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి కల్యాణాన్ని నిర్వహించనున్నారు. 29న తొలి రథయాత్ర... ఈ నెల 29న తొలి రథయాత్రను నిర్వహించనున్నారు. ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు,ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణలు తొలి రథాయాత్రాను లాంఛనంగా ప్రారంభించనున్నారని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పి. వెంకటరావు తెలిపారు. ఈ యాత్ర పట్టణంలోని జగన్నాథస్వామి ఆలయం నుంచి గంగిరేవిచెట్టు,సతకంపట్టు, చినరామస్వామి కోవెల, పెదరామస్వామి కోవెల, సంతబయలు, సంతోషిమాత ఆలయం, పార్కు సెంటర్ మీదుగా రైల్యే స్టేషన్ వద్ద ఉన్న ఇంద్రద్యుమ్నహల్ వద్దకు చేరుకుంటుందని ఆలయ కార్యనిర్వాహణాధికారి బండారు ప్రసాద్ తెలిపారు. ఇంద్రద్యుమ్నహాల్‌లో రోజూ సాయంత్రం ధార్మిక ప్రవచనాలు, భక్తి సంగీతం వంటి కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. తిరుగు రథయాత్ర... రథయాత్ర ఉత్సవాల ముగింపులో భాగంగా జూలై 8న ఉదయం 09-15 గంటలకు రథారోహణ, 09-45 గంటలకు తిరుగు రథాయాత్ర నిర్వహించనున్నారు.ఈమేరకు ఆరోజు మధ్యాహ్నం ఇంద్రద్యుమ్నహాల్ వద్ద అన్నసమారాధన ఏర్పాటు చేశారు. -
28న జగన్నాథ రథయాత్ర
యాత్రకు భారీ ఏర్పాట్లు విదేశీ బృందాల ప్రదర్శనలు లక్షమందికి ప్రసాదం వితరణ సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లోని ఇస్కాన్ ఆలయం 24వ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 28న జగన్నాథ రథయాత్రను నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అత్యంత వైభవంగా నిర్వహించే ఈ యాత్రకు నగరంతోపాటు ఆయా ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలిరానున్నారు. అత్యంత శోభాయమానంగా నిర్వహించే యాత్ర కోసం ఆలయ నిర్వాహకులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆలయం నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర ఎస్పీరోడ్, ఆర్పీరోడ్, మోండా మార్కెట్, క్లాక్‌టవర్, ఎస్డీరోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకోనుంది. ఈ సందర్భంగా సుమారు లక్షమంది భక్తులకు ప్రసాదం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 500 మంది వలంటీర్లను నియమించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రదర్శన: శోభాయాత్రలో చైనా, రష్యా, ఆఫ్రికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన ఇస్కాన్ భక్తులు హాజరై ఆధ్యాత్మిక,సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రపంచశాంతి, ఐక్యతకోసం ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. యాత్ర ముగిసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి భజనలతోపాటు, కృష్ణకథ, శృంగార దర్శనం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం పదివేల మంది భక్తులచే జగన్నాథుడికి మహాహారతి ఇచ్చి కార్యక్రమాన్ని ముగించనున్నారు. -
‘జగన్నాథుడికి’ కలప కొరత!
పూరి: ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్రకు అవసరమైన కలపకు కొరత ఏర్పడినట్టు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మూడు రథాలతో కూడిన యాత్రకు దేశం సహా విదేశాల నుంచి యాత్రికులు హాజరవుతున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జూన్ 29న ఈ రథాల తయారీ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ క్రమంలో రథాలను రూపొందించేందుకు ఆలయ వర్గాలు సమాయత్తమయ్యాయి. అయితే, వీటి కోసం వాడే ప్రధాన దుంగలకు కొరత ఏర్పడింది. ఈ అంశంపై చర్చించేందుకు రెవెన్యూ డివిజనల్ కమిషనర్ ఎస్.కె. వశిస్ట్ అధ్యక్షతన అధికారులు గురువారం భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. రథ చక్రాలను రూపొందించేందుకు కనీసం 42 భారీస్థాయి దుంగలు అవసరం కాగా, ఒడిశా ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 28 దుంగలనే సరఫరా చేసిందన్నారు. ఏటా రూపొందించే రథాల కోసం వెయ్యి పైగా భారీ వృక్షాలను నరికివేయడంపై పర్యావరణ ప్రేమికులు సహా ఉద్యమ కారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.