Rath Yatra Tragedy: ‘ఏ ఒక్కరూ పట్టించుకోలేదు’: మృతురాలి భర్త | Puri Jagannath Rath Yatra Victims Husband Says no one Responded | Sakshi
Sakshi News home page

Rath Yatra Tragedy: ‘ఏ ఒక్కరూ పట్టించుకోలేదు’: మృతురాలి భర్త

Jun 29 2025 11:42 AM | Updated on Jun 29 2025 1:02 PM

Puri Jagannath Rath Yatra Victims Husband Says no one Responded

పూరి: ఒడిశాలోని పూరిలో జరుగుతున్న రథయాత్రలో తొక్కిసలాట చోటుచేసుకుని ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటనలో భార్యను కోల్పోయిన ఒక యువకుడు ఆవేదన వ్యక్తం  చేస్తూ, జరిగిన ఘటన వివరాలను మీడియా ముందు వెళ్లగక్కాడు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులెవరూ స్పందించలేదని ఆయన ఆరోపించారు.

తొక్కిసలాట ఘటనపై పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ ఎస్ స్వైన్ మాట్లాడుతూ ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జరిగిందని. జగన్నాథుడు, అతని తోబుట్టువుల వార్షిక రథోత్సవాన్ని వీక్షించడానికి వందలాది మంది భక్తులు  ఆలయం వద్దకు చేరుకున్నారని తెలిపారు. ఆచారాల నిర్వహణకు సంబంధించిన సామగ్రిని తీసుకెళ్తున్న రెండు ట్రక్కులు.. రథాల సమీపంలోని రద్దీగా ఉండే ప్రాంతంలోకి ప్రవేశించడంతో, గందరగోళం నెలకొంది. ఈ నేపధ్యంలోనే తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు.
 

ఈ తొక్కిసలాటలో మరణించిన ముగ్గురిని బోలాఘర్‌కు చెందిన బసంతి సాహు, బలిపట్నానికి చెందిన ప్రేమకాంత్ మొహంతి,  ప్రవతి దాస్‌గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాగా మృతి చెందిన ఒక మహిళ భర్త మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన జరిగినప్పుడు అధికారులెవరూ స్పందించలేదని, అగ్నిమాపక అధికారులు, రెస్క్యూ బృందం, వైద్య సిబ్బంది సమయానికి చేరుకోలేదని ఆరోపించారు.

పురి నివాసి స్వాధిన్ కుమార్ పాండా మాట్లాడుతూ జనసమూహ నియంత్రణలో అనేక లోపాలు ఉన్నాయని  ఆరోపించారు. ట్రాఫిక్ ఏర్పాట్లు సరిగా లేవన్నారు.  ఈ ఘటనకు ఒడిశా ప్రభుత్వమే బాధ్యత వహించాలని పాండా డిమాండ్‌ చేశారు. ఈ ఘటన దరిమిలా ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యిందని ఒడిశా న్యాయ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్  తెలిపారు. ఘటనా స్థలంలో డీజీపీ ఉండి, పరిస్థితులను చక్కదిద్దుతున్నారని పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: Jagannath Rath Yatra: తొక్కిసలాటలో ముగ్గురు మృతి.. 50 మందికి గాయాలు

Advertisement
 
Advertisement
Advertisement