
ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే ముందు స్థానికంగా ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముంది అంటూ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఇటీవల పహల్గాంలో జరిగిన దాడిని ప్రస్తావించింది.
జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం.. రాష్ట్ర హోదా కల్పించే ముందు స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముంది. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని నొక్కి చెప్పింది. ఇటీవల పహల్గాంలో జరిగి దుర్ఘటనను విస్మరించలేమని వ్యాఖ్యానించింది. అనంతరం, రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలన్న పిటిషన్‌పై ఎనిమిది వారాల్లోగా సమాధానం దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
Supreme Court, while hearing pleas seeking direction to restore the statehood of the Union Territory of Jammu and Kashmir, observes that in granting statehood, the ground situation has to be taken into consideration.
“You cannot ignore what happened in Pahalgam," says CJI BR… pic.twitter.com/qIYliZOsVU— ANI (@ANI) August 14, 2025
ఇదిలా ఉండగా.. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ గతేడాది విద్యావేత్త జహూర్ అహ్మద్ భట్, సామాజిక-రాజకీయ కార్యకర్త ఖుర్షాయిద్ అహ్మద్ మాలిక్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో.. రాష్ట్ర హోదాను పునరుద్ధరించడంలో మరింత ఆలస్యం జరిగితే జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతింటుంది. ఇది భారత రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో భాగమైన సమాఖ్య సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది. జమ్ముకశ్మీర్‌లో ఎటువంటి హింసాత్మక ఘటనలు, భద్రతాపరమైన సమస్యలు లేకుండా ఎన్నికల జరిగాయి. రాష్ట్ర హోదా కల్పించకపోవడంతో అభివృద్ధికి అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పౌరుల ప్రజాస్వామ్య హక్కులను ప్రభావితం చేసింది అని పేర్కొన్నారు.