ఓటుకు నోటు కేసు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ | Vote For Note Case Verdict Today, Supreme Court To Decide On Jerusalem Mattaiah’s Role In This Case | Sakshi
Sakshi News home page

ఓటుకు నోటు కేసు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

Sep 26 2025 8:27 AM | Updated on Sep 26 2025 9:27 AM

All Eyes on Supreme Court 2015 Vote For Cash Judgment

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాజకీయ ప్రకంపలు సృష్టించిన ఓటుకు నోటు కేసు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో జెరూసలెం మత్తయ్య(Jerusalem Mattaiah) పాత్రపై దర్యాప్తు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌పై నేడు చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌(Justice BR Gavai) ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది. 

2015 ఓటుకు నోటు కేసులో మత్తయ్య ఏ4గా ఉన్నారు. అయితే ఈ కేసు నుంచి ఆయన పేరును  క్వాష్  చేస్తూ ఉమ్మడి  హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో మత్తయ్యను దర్యాప్తు చేయాల్సి ఉందని పేర్కొంటూ తెలంగాణ సర్కార్‌ ఆ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కానీ, ఈ కేసులో(Vote For Cash Case) అసలు  సూత్రధారి చంద్రబాబు అని, ఆయన పైనే దర్యాప్తు జరపాలని మత్తయ్య అంటున్నారు. ఈ మేరకు ఆయన సుప్రీం కోర్టుకు ఓ లేఖ కూడా రాశారు.

2015లో ఓటుకు నోటు కేసులో అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి అరెస్ట్‌ కావడం సంచలనం సృష్టించింది.  ఆనాడు ఆంగ్లో ఇండియన్‌ కోటాలో ఎమ్మెల్యేగా ఉన్నఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు కోసం డబ్బు ఆఫర్ చేసినట్లు వీడియో ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. చంద్రబాబు ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందన్న ప్రచారమూ ఒకటి ఉంది. 

ఈ కేసులో నేరానికి ప్రరేపితుడిగా(abettor)గా జెరూసలెం మత్తయ్య పేరును చేర్చారు. అయితే అప్పటి ఉమ్మడి హైకోర్టులో ఆయన పిటిషన్‌ వేయగా.. ఊరట దక్కింది. 2017లో తెలంగాణ ప్రభుత్వం, స్టీఫెన్‌సన్‌లు ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదిలా ఉండగానే.. 

తీర్పు వెలువడే వేళ ‘అంతా చంద్రబాబే చేశాడు’ అంటూ మత్తయ్య సంచలన ప్రకటన చేశారు. ఏసీబీ, తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులో తనను బలిపశువును చేస్తున్నారంటూ అందులో తన ఆవేదన వ్యక్తం చేశారాయన. 

ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసులో లోకేష్‌ పాత్ర.. సంచలన వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement