breaking news
Jerusalem Mattaiah
-
ఓటుకు నోటు కేసు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాజకీయ ప్రకంపలు సృష్టించిన ఓటుకు నోటు కేసు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో జెరూసలెం మత్తయ్య(Jerusalem Mattaiah) పాత్రపై దర్యాప్తు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌పై నేడు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్(Justice BR Gavai) ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది. 2015 ఓటుకు నోటు కేసులో మత్తయ్య ఏ4గా ఉన్నారు. అయితే ఈ కేసు నుంచి ఆయన పేరును క్వాష్ చేస్తూ ఉమ్మడి హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో మత్తయ్యను దర్యాప్తు చేయాల్సి ఉందని పేర్కొంటూ తెలంగాణ సర్కార్ ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కానీ, ఈ కేసులో(Vote For Cash Case) అసలు సూత్రధారి చంద్రబాబు అని, ఆయన పైనే దర్యాప్తు జరపాలని మత్తయ్య అంటున్నారు. ఈ మేరకు ఆయన సుప్రీం కోర్టుకు ఓ లేఖ కూడా రాశారు.2015లో ఓటుకు నోటు కేసులో అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి అరెస్ట్ కావడం సంచలనం సృష్టించింది. ఆనాడు ఆంగ్లో ఇండియన్ కోటాలో ఎమ్మెల్యేగా ఉన్నఎల్విస్ స్టీఫెన్సన్కు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు కోసం డబ్బు ఆఫర్ చేసినట్లు వీడియో ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. చంద్రబాబు ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందన్న ప్రచారమూ ఒకటి ఉంది. ఈ కేసులో నేరానికి ప్రరేపితుడిగా(abettor)గా జెరూసలెం మత్తయ్య పేరును చేర్చారు. అయితే అప్పటి ఉమ్మడి హైకోర్టులో ఆయన పిటిషన్ వేయగా.. ఊరట దక్కింది. 2017లో తెలంగాణ ప్రభుత్వం, స్టీఫెన్సన్లు ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగానే.. తీర్పు వెలువడే వేళ ‘అంతా చంద్రబాబే చేశాడు’ అంటూ మత్తయ్య సంచలన ప్రకటన చేశారు. ఏసీబీ, తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులో తనను బలిపశువును చేస్తున్నారంటూ అందులో తన ఆవేదన వ్యక్తం చేశారాయన. ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసులో లోకేష్ పాత్ర.. సంచలన వ్యాఖ్యలు -
చంద్రబాబు, రేవంత్ నుంచి ప్రాణహాని
సాక్షి, నాంపల్లి (హైదరాబాద్): ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి వర్గం నుంచి ప్రాణహాని ఉందంటూ ఓటుకు కోట్లుకేసులో ఏ4 నిందితుడు జెరూసలేం మత్తయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)ను ఆశ్రయించారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారినందున తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తన కు ఈడీ నుంచి నోటీసులు వచ్చినట్లు వివరించారు. ఈ కేసులో ముఖ్య సూత్రధారులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డిలేనని చెప్పారు. కేసు పూర్తయ్యే వరకు తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరారు. అదేవిధంగా ఎంపీ రేవంత్‌రెడ్డి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: (అక్క చెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగు) -
'ఓటుకు కోట్లు కేసులో టీ-సర్కార్ వేధిస్తోంది'
ఢిల్లీ : ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోందని నిందితుడు జెరూసలెం మత్తయ్య ఆరోపించారు. ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో రక్షించాల్సిన ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రెండు ప్రభుత్వాలు రాజీకొచ్చినా తనను బలిపశువును చేస్తున్నారని మండిపడ్డారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ పిటిషన్ వేయడంలో ఆంతర్యమేంటని మత్తయ్య ప్రశ్నించారు. ఈ కేసులో స్టీఫెన్సన్ దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీంలో సోమవారం విచారణ జరిగింది. మత్తయ్యను రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. -
ఓటుకు నోటులో ఎవరినీ వదిలిపెట్టద్దు
హిమాయత్‌నగర్: ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో చర్యలు తీసుకుంటే అందరిపైనా తీసుకోవాలని ఈ కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య అన్నారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో దళిత క్రైస్తవుడైన తనపై రాజకీయ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఏసీబీ దాడులకు ముందు కానీ, తర్వాత కానీ తాను సంబంధిత వ్యక్తులెవరితోనూ ఫోన్లో మాట్లాడలేదన్నారు. ఎవరో ఒకరిని బలి చేయాలనే తనను వేధిస్తున్నారని ఆయన అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆ ఫోన్ మాట్లాడింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే అని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలితే అతడిపైనా... ఆ ఫోన్‌ను ట్యాపింగ్ చేయించిన కేసీఆర్‌లపై కూడా చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబు నుంచి నాకు ప్రాణహాని
-
చంద్రబాబు నుంచి నాకు ప్రాణహాని: మత్తయ్య
ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన జెరూసలెం మత్తయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. నీకేం కాదు.. నేనున్నానంటూ చంద్రబాబు గతంలో జోల పాడారని, ఇప్పుడు తనను అగమ్య గోచర పరిస్థితిలోకి నెట్టారని మత్తయ్య అన్నారు. చంద్రబాబు అసలు కథేంటో ఈ కేసులో తేలిపోతుందని చెప్పారు. తన కుటుంబానికి చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ తనతో ఆడుకుంటున్నారని వాపోయారు. తాను భయభ్రాంతులతో ఢిల్లీకి వచ్చానని.. తనకు ఏం జరిగినా కేసీఆర్, చంద్రబాబులదే బాధ్యత అని మత్తయ్య చెప్పారు. ఆయన సోమవారం తనకు ప్రాణహాని ఉందంటూ ఎన్హెచ్ఆర్సీ లో ఫిర్యాదు చేశారు.