లండన్‌లో గాంధీ విగ్రహం ధ్వంసం.. తీవ్రంగా స్పందించిన భారత్‌ | India Reaction On Iconic Gandhi Statue Near London University Vandalised | Sakshi
Sakshi News home page

లండన్‌లో గాంధీ విగ్రహం ధ్వంసం.. తీవ్రంగా స్పందించిన భారత్‌

Sep 30 2025 10:37 AM | Updated on Sep 30 2025 10:55 AM

India Reaction On Iconic Gandhi Statue Near London University Vandalised

లండన్‌: లండన్‌లో మహాత్మాగాంధీ (Mahatma Gandhi) విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. లండన్‌లోని టావిస్టాక్‌ స్వ్కేర్‌లో ఉన్న గాంధీ విగ్రహంపై నల్ల రంగుతో విద్వేష పూరిత వ్యాఖ్యలు రాశారు. మహాత్ముని జయంతికి మూడు రోజుల ముందు జరిగిన ఈ ఘటనపై అక్కడి భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఈ పిచ్చి రాతలను సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది. అహింస వారసత్వంపై జరిగిన దాడిగా పేర్కొంది.

మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం పాటు తీవ్రంగా ఖడిస్తున్నామని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. మహాత్ముని జయంతి (అక్టోబర్‌ 2)ని ప్రతి ఏడాది అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

కాగా, ప్రముఖ కళాకారిణి ఫ్రెడ్డా బ్రిలియంట్‌ రూపొందించిన గాంధీజీ కాంస్య విగ్రహాన్ని లండన్‌లోని టావిస్టాక్‌ స్క్వేర్‌లోని యూనివర్సిటీ కాలేజ్‌ సమీపంలో 1968లో ప్రతిష్ఠించారు. విగ్రహ ధ్వంసం గురించి స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. విగ్రహాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement