
నేలకు పూల సింగిడి దిగి వచ్చింది. ప్రకృతి శోభతో ట్యాంక్‌బండ్ పులకించింది. మంగళవారం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ ముగింపు ఉత్సవాలు వైభవంగా జరిగాయి.

మహిళలు రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. తెలంగాణ టూరిజం, జీహెచ్‌ఎంసీ సంయుక్తాధ్వర్యంలో బోనాలు, ఒగ్గుడోలు, డప్పు వాద్యాలు, చిందు, యక్షగానం కళాకారులు, దింసా నృత్యాలతో ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మలకు స్వాగతం పలికారు.

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్, కలెక్టర్ హరిచందన, నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్‌పర్సన్‌లు వెన్నెల గద్దర్, నిర్మలా రెడ్డి, అలేఖ్య పుంజాల, నేరెళ్ల శారద, సుజాత తదితరులు పాల్గొన్నారు.






















