
చెన్నై: లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సెక్యూరిటీ గార్డును నేలపైకి తోసి చంపారనే ఆరోపణలతో ఓ ట్రాన్స్‌జెండర్ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చెన్నైలోని మైలాపూర్‌లోని విశాలాక్షి తొట్టం ప్రాంతానికి చెందిన శేఖర్(57) సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతడు ఈనెల 7వ తేదీన సెక్యూరిటీ డ్యూటీలో ఉన్నాడు. ఆ సమయంలో జెస్సికా(19) అనే యువతి ఆ దారిలో నడుచుకుంటూ వెళుతోందని తెలుస్తోంది.
రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆ దారిలో వెళుతున్న జెస్సికాను సెక్యూరిటీ గార్డు శేఖర్ లైంగికంగా వేధించాడని తెలుస్తోంది. దీంతో ఆమె శేఖర్‌ను పట్టుకుని కింద పడేసినట్లు తెలుస్తోంది. ఇందులో శేఖర్ తల వెనుక భాగంలో దెబ్బ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మరుసటి రోజు ఉదయం పొరుగువారు ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్న అతన్ని చూసి చికిత్స కోసం కీల్పాక్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి్పంచారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. అభిరామపురం పోలీసులు ట్రాన్స్‌జెండర్ జెస్సికాను అరెస్టు చేశారు.