
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎత్తున క్లౌడ్ బరస్ట్ జరిగింది. ఆకస్మికంగా ముంచెత్తిన వరదల కారణంగా 22 మంది భక్తులు మరణించారు.
గురువారం మధ్యాహ్నం కిష్త్వార్ జిల్లాలోని చషోటీ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. అప్రమత్తమైన రెస్క్యూబృందాలు వరదల్లో చిక్కుకున్న బాధితుల్ని రక్షించే దిశగా చర్యల్ని ముమ్మరం చేశారు. గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించాయి.
చషోటీ ప్రాంతంలో ప్రతీ ఏడాది జూలై 25 నుండి సెప్టెంబర్ 5 వరకు మచైల్ మాతా యాత్ర (Machail Mata Yatra) ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ ఏడాది చండీ మాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. అయితే క్లౌడ్ బరస్ట్ కారణంగా మచైల్ మాతా ఉత్సవాల్లో పాల్గొన్న భక్తుల మరణాలు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వరద సంభవించిన చషోటీ ప్రాంతం మచైల్ మాతా యాత్రకు ప్రారంభ ప్రాంతంతో పాటు కిష్త్వార్‌లోని హిమాలయ మాతా చండి మందిరానికి వెళ్లే మార్గంలో వాహన సదుపాయం ఉన్న చివరి గ్రామం కూడా. దీంతో క్లౌడ్ బరస్ట్ కారణంగా చషోటీ ప్రాంతంలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే ముంచెత్తిన వరద నుంచి గ్రామస్తులతో పాటు భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు కిష్త్‌వార్ జిల్లా డిప్యూటీ కమిషనర్ పంకజ్ శర్మ తెలిపారు. వరదలపై జమ్మూకశ్మీర్ ఉదంపూర్ ఎంపీ,కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అప్రమత్తమయ్యారు. క్లౌడ్ బరస్ట్ జరిగిన ప్రాంతంలోని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. సహాయకచర్యల్ని వేగవంతం చేయాలని అదేశాలు జారీ చేశారు.
Massive cloudburst struck Chishoti area in the Jammu and Kashmir’s Kishtwar district, along the route to the Machail Matta Yatra.
Casualties are feared, though further details and official confirmation are awaited. https://t.co/d5AQMPAbfU pic.twitter.com/xJgI5WrpwP— Rakesh Kumar (@RiCkY_847) August 14, 2025
