తొలగించిన 65 లక్షల ఓటర్ల జాబితాను బహిర్గతం చేయండి: సుప్రీంకోర్టు | Supreme Court Asks EC To Make Reason Public Of 65 Lakh Names Excluded In Bihar Voter List Row | Sakshi
Sakshi News home page

Bihar Voter List Row: తొలగించిన 65 లక్షల ఓటర్ల జాబితాను బహిర్గతం చేయండి: సుప్రీంకోర్టు

Aug 14 2025 4:06 PM | Updated on Aug 14 2025 4:38 PM

Make Public 65 Lakh Names Top Court To Poll Body

న్యూఢిల్లీ:  బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై మరోసారి సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం ఏదైతే ఓటర్లను తొలగించామని చెప్పిందో.. ఆ 65లక్షలకు పైగా ఓటర్ల జాబితాను  ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

అదే సమయంలో వారిని ఎందుకు తొలగించారో పేర్కొంటూ వివరణతో కూడిన ఆ లిస్టును పబ్లిక్‌లోకి తీసుకురావాలని పేర్కొంది ధర్మాసనం. ఈ అంశానికి సంబంధించి గురువారం(ఆగస్టు 14వ తేదీ) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. 22 లక్షల మందిని చనిపోయారన్న కారణంతో తొలగించడాన్ని సైతం​ ప్రశ్నించింది. బూత్‌ లెవెల్‌ స్థాయిలో దీనిని ఎందుకు బహిర్గతం చేయలేదని నిలదీసింది. పౌరుల హక్కు రాజకీయ పార్టీలపై ఆధారపడటం మాకు ఇష్టం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

‘భారత ఎన్నికల కమిషన్ వాదనలను మేము పూర్తిగా విన్నాం. విచారణ సమయంలో, ఈ క్రింది దశలను అంగీకరించారు. 2025 జాబితాలో పేర్లు కనిపించినప్పటికీ, తాజాగా జాబితాలో చేర్చబడని 65 లక్షల మంది ఓటర్ల జాబితాను జిల్లా స్థాయి వెబ్‌సైట్‌లలో ప్రదర్శించాలి’ అని  సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.

కాగా, బీహార్లో ఎన్నికల సంఘం హడావుడిగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. మరోవైపు ఈ జాబితా సవరణలోని లోపాలు ప్రతీ రోజూ బయటపెడుతూనే ఉన్నాయి. వీటిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు  దాఖలయ్యాయ.

మరొకవైపు ఈసీ తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ, అనర్హులైన ఓటర్లను తొలగిస్తూ, ఓటర్ల జాబితాను శుద్ధి చేసేందుకే ఈ ప్రక్రియ చేపట్టినట్లు వివరణ  ఇస్తూ వస్తోంది.. అయితే ప్రతిపక్షాలు ఈ ఓటర్లు జాబితా సవరణ ప్రక్రియపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఇంతలో లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర, కర్నాటకలలో ఓటర్ల జాబితాలో ఓట్ల చోరీని ఆధారాలతో సహా బయటపెట్టడంతో పాటు బీహార్ లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపైనా పలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇదీ కూడా చదవండి

'దేశ'మంత మందికి ఓటుండదా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement