
బారాముల్లా : జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోగల ఉరి సెక్టార్ లో భారత సైన్యం పెద్ద ఎత్తున కార్డన్, సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి, పాక్ ముష్కరుల చొరబాటు యత్నాన్ని భగ్నం చేసింది. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన ఒక సైనికుడు మృతిచెందాడు.
బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్‌లో గల టిక్కా పోస్ట్ సమీపంలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ఉగ్రవాదులు జరిపిన దాడి, చొరబాటు యత్నాన్ని బోర్డర్ యాక్షన్ టీం (బీఏటీ)తిప్పికొట్టింది. ఆగస్టు 12- 13 తేదీల మధ్య రాత్రివేళ అప్రమత్తమైన భారత ఆర్మీ దళాలు పాక్ దాడిని తిప్పికొట్టాయి. అధికార వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు ఒక ఫార్వర్డ్ పోస్ట్ పై దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే అప్రమత్తమైన దళాలు వారిని ప్రతిఘటించి, వారి చొరబాటు యత్నాన్ని విఫలం చేశాయి. తదనంతరం చొరబాటుదారులను గుర్తించేందుకు, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్డన్, సెర్చ్ ఆపరేషన్‌లు జరుగుతున్నాయి.
The Indian Army launched a large-scale cordon and search operation in the Uri sector of Baramulla district, foiling a major infiltration attempt. | Ashraf Wani
Read more: https://t.co/fqZp5RcT8I#JammuandKashmir #Baramulla #Uri pic.twitter.com/gn7SIrk8wl— IndiaToday (@IndiaToday) August 13, 2025
పాక్ ముష్కరులను తరిమికొట్టే ప్రయత్నంలో పరస్పరం జరిగిన జరిగిన కాల్పుల్లో హవల్దార్ అంకిత్, సైనికుడు బానోత్ అనిల్ కుమార్ గాయాల పాలయ్యారు. వీరిలో బానోత్ అనిల్ కుమార్ ప్రాణాలు విడిచారని ఆర్మీ అధికారులు ‘ఎక్స్’ పోస్టులో తెలిపారు. ‘జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన సిపాయి బానోత్ అనిల్ కుమార్‌కు భారత సైన్యం వందనాలు అర్పిస్తున్నది. ఈ దుఃఖ సమయంలో భారత సైన్యం ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నది.మృతుల కుటుంబానికి సంఘీభావం తెలుపుతోందని’ ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.