
అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తోడు ఉప నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది.

ప్రకాశం బ్యారేజీలోకి బుధవారం రాత్రి 9 గంటలకు వరద 3,97,250 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. అంతే పరిమాణంలో 70 గేట్ల ద్వారా అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు.

ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి గురువారం ఉదయానికి ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద ప్రవాహం 4 నుంచి 4.50 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అంచనా.









