Jagannath Rath Yatra: తొక్కిసలాటలో ముగ్గురు మృతి.. 50 మందికి గాయాలు | Jagannath Rath Yatra Three Dead Several Injured | Sakshi
Sakshi News home page

Jagannath Rath Yatra: తొక్కిసలాటలో ముగ్గురు మృతి.. 50 మందికి గాయాలు

Jun 29 2025 9:22 AM | Updated on Jun 29 2025 12:22 PM

Jagannath Rath Yatra Three Dead Several Injured

పూరీ: ఒడిశాలోని పూరీలో అత్యంత వైభవంగా జరుగుతున్న రథయాత్రలో అపశృతి చోటచేసుకుంది. గుండిచా ఆలయం సమీపంలో ఈరోజు (ఆదివారం) ఉదయం జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందగా, 50 మందికిపైగా జనం గాయపడ్డారు. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో  గుండిచా ఆలయం ముందు భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది.
 

ఆలయం వెలుపల జనసమూహం ఒక్కసారిగా పెరగడంతో భయాందోళనలు నెలకొని, ఫలితంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. మృతులను, గాయపడిన వారిని వెంటనే పూరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.  గుండిచా ఆలయం ముందు శారదబాలి సమీపంలో  ఈ విషాదరక ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో రథంపై కూర్చున్న జగన్నాథుడిని చూసేందుకు భారీగా జనసమూహం  అక్కడికి చేరుకుంది. దీంతో భక్తులను నియంత్రించడం పోలీసులుకు కష్టతరంగా మారింది.

అదే సమయంలో తోపులాట జరగడంతో, కొందరు కింద పడిపోయారు. ఈ గందరగోళంలో ముగ్గురు ఇతరుల కాళ్లకింద నలిగిపోయి మృతిచెందారు. వారు ఖుర్దా జిల్లాకు చెందిన ప్రేమకాంత మొహంతి (80), బసంతి సాహూ (36), ప్రభాతి దాస్ (42)గా గుర్తించినట్లు పూరి జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రి అధికారులు ధృవీకరించారు. బాధితులను వెంటనే 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల బృందం వారికి చికిత్స అందిస్తోంది. బాధితులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement