Puri Rath Yatra 2025 ప్రత్యేక రైళ్లు | Puri Rath Yatra 2025: Special Train Services check here | Sakshi
Sakshi News home page

పూరీ-గుణుపురానికి ప్రత్యేక రైళ్లు

Jun 24 2025 2:40 PM | Updated on Jun 24 2025 3:45 PM

Puri Rath Yatra 2025: Special Train Services check here

పర్లాకిమిడి: పూరీ రథయాత్ర సందర్భంగా ఈస్టు కోస్టు రైల్వే గుణుపురం–పూరీ–గుణుపురానికి ఈనెల 26, జూలై 4, జూలై 5న ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఈనెల 26న ట్రైన్‌ నంబర్‌ 08443 సాయంత్రం 6.30కు గుణుపురం నుంచి బయల్దేరి మరుసటి రోజు వేకువన 2.15కు పూరీ చేరుకుంటుంది. అన్ని స్టేషన్లలో ఈ ట్రైన్‌ ఆగుతుంది. అలాగే తిరుగు ప్రయాణం ట్రైన్‌ నంబరు 08428 పూరీ నుంచి 2.45లకు వేకువజామున బయలుదేరి గుణుపురానికి మధ్యాహ్నం 12.30లకు చేరుకుంటుందని ఈస్టుకోస్టు రైల్వే సీనియర్‌ డివిజనల్‌ మేనేజరు కె.సందీప్‌ తెలియజేశారు. 

రిటర్న్‌ ట్రైను పూరీ నుంచి జూన్‌ 27 నుంచి జూలై 6, జూలై 7 వరకూ నడుస్తుంది. అలాగే పలాస, పూరీ, పలాసకు అన్‌రిజర్వుడ్‌ స్పెషల్‌ ట్రైన్సు కూడా జూన్‌ 26 నుంచి జూలై 7 వరకూ రాత్రి 9.30కు పలాసలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కు పూరీ చేరుకుంటుంది. రిటర్న్‌ ట్రైన్లు కూడా పూరీ నుంచి పలాసకు జూన్‌ 27 నుంచి జూలై 8 వరకూ నడుస్తాయి. మధ్యాహ్నం 2.30కు బయల్దేరి అదే రోజు రాత్రి 9.15కు పలాస చేరుకుంటుంది. అన్ని స్టేషన్లలో ఈ ప్యాసింజరు ట్రైను నిలుపుదల చేస్తారని ఒక ప్రకటనలో తెలియజేశారు. 

చదవండి: శ్రీ జగన్నాథునికి ఖొల్లి లగ్గి సేవ .. ఎలా చేస్తారు?

Advertisement
 
Advertisement
Advertisement