
భువనేశ్వర్: శ్రీ గుండిచా ఆలయంలో భక్తులు శ్రీ జగన్నాథుని సంధ్యా దర్శనం కోసం తండోపతండాలుగా తరలి వచ్చారు. సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు పరిమితం చేశారు. అడప మండపంపై ఇది చివరి దర్శనం. ఈ సందర్భంగా శారదా బాలి జనసముద్రంగా మారింది. మహా ప్రభువు దర్శనం కోసం బొడొశొంఖొ వరకు బారులు తీరారు. రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ వైబీ ఖురానియా శుక్రవారం శ్రీ గుండిచా ఆలయం ప్రత్యక్షంగా సందర్శించారు. ఈ సందర్భంగా శారదా బాలి ప్రాంగణంలో భక్తుల రద్దీ నియంత్రణ, మారు రథ యాత్ర భద్రతా సన్నాహాల్ని ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
ఇదీ చదవండి: Antidepressants మహిళల మెదడు సేఫే, బట్ పురుషులకే!
బహుడా యాత్ర పురస్కరించుకుని పోలీసులు వాహనాల రవాణా వ్యవస్థ కట్టుదిట్టం చేశారు. అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ దయాళ్ గంగ్వార్ ప్రత్యక్షంగా ఈ బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి ప్రజలకు బల్క్ సందేశాలు పంపిస్తారు. జన సందోహం ఉన్న చోట డ్రోన్, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అన్ని ఫోన్లకు సందేశాలు పంపిస్తారు. అదనంగా జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీల ద్వారా కూడా వాహన చోదకులకు సమాచారం ప్రసారం చేస్తారు. నవమి సంధ్యా దర్శనం, మారు రథ యాత్ర బహుడా భద్రత, రక్షణల సమగ్ర వ్యవస్థని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ వైబీ ఖురానియా పర్యవేక్షించారు. జన్మ వేదికపై శ్రీ జగన్నాథుని చివరి దర్శనం క్రమబదీ్ధకరణ కార్యాచరణని పరిశీలించారు. శాంతిభద్రతల ఏర్పాట్లపై ఆయన దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఇతర సీనియర్ అధికారులతో పోలీస్ డైరెక్టర్ జనరల్ సమావేశమయ్యారు.
కల్కి అవతారంలో జగన్నాథుడు
పర్లాకిమిడి: స్థానిక గుండిచా మందిరంలో జగన్నాథ స్వామి శుక్రవారం కల్కి అవతారంలో భక్తులకు దర్శనం కల్పించారు ఈ రోజుతో దశవతారాలు పూర్తయ్యాయి. శనివారం బహుడా యాత్ర సందర్భంగా శ్రీజగన్నాథరథాలు తిరుగుముఖం పెట్టారు. గుండిచా మందిరం వెలుపల ఆనందబజార్‌లో శుక్రవారం భక్తులకు ఉచితంగా ఓబ్బడా (అన్న ప్రసాదం) రథాయాత్ర కమిటీ అందజేసింది