కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ వ్యాన్‌ను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. వారిలో ఇద్దరు విద్యార్థులే ఉన్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేగింది.
శుక్రవారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్న వ్యాన్ రైల్వే పట్టాలు దాటుతున్న సమయంలో అదే మార్గంలో వస్తున్న నిమ్తితా–కట్వా ప్యాసింజర్ రైలు ఒక్కసారిగా స్కూల్ వ్యాన్ ఢీకొట్టింది. రైలు వేగంగా ఢీకొనడంతో వ్యాన్ నుజ్జునుజ్జయింది. ప్రమాద తీవ్రతకు వాహనం పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయింది. అయితే, ప్రమాద సమయంలో రైల్వే క్రాసింగ్ తెరిచి ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వ్యాన్ పట్టాలు దాటుతున్న సమయంలోనే రైలు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని వారు చెప్పారు. కొంతమంది స్థానికుల కథనం ప్రకారం.. ఒక రైలు వెళ్లే వరకు గేట్ మూసి ఉందని, ఆ తర్వాత తెరిచారని, కానీ పక్క లైన్‌లో మరో రైలు వస్తున్నప్పటికీ గేట్ మళ్లీ మూయలేదని ఆరోపించారు. గేట్‌మన్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

#BREAKING | A train collided with a school van in West Bengal's Murshidabad, leaving several students injured.
(This is a developing story)
More details 🔗 https://t.co/YRtQzoPOna#WestBengal #Murshidabad #train #Trainaccident pic.twitter.com/9XH6eqLMsu— The Times Of India (@timesofindia) July 17, 2026
రైల్వే క్రాసింగ్ వద్దే ప్రమాదమా?
ఇక, విద్యార్థులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైందన్న వార్త తెలియడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తమ పిల్లల పరిస్థితి తెలుసుకునేందుకు ఆసుపత్రులకు పరుగులు తీశారు. ఈ ప్రమాదానికి గల అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా... గేట్‌మన్ నిర్లక్ష్యం ఉందా? అనే కోణాల్లో పరిశీలిస్తున్నారు. ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణాలు, బాధ్యులపై చర్యల విషయంలో దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


