హర్ముజ్ యుద్ధ క్షేత్రంగా మారింది.. మోదీ | PM Modi Launches India’s First Hydrogen Train, Check Out Its Key Features And Specialities | Sakshi
Sakshi News home page

హర్ముజ్ యుద్ధ క్షేత్రంగా మారింది.. మోదీ

Jul 17 2026 12:04 PM | Updated on Jul 17 2026 12:50 PM

PM Modi launches hydrogen train

చండీగఢ్: హర్ముజ్‌ జలసంధి ప్రస్తుతం యుద్ధ క్షేత్రంగా మారిందని ప్రధాని మోదీ అ‍న్నారు. హర్ముజ్‌ వద్ద  ఉద్రిక్త పరిస్థితులున్నాయన్నారు. ఈ రోజు శుక్రవారం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన హైడ్రోజన్‌ రైలును ప్రధాని మోదీ  హర్యానా లోని జింద్ రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు.  ఈ రైలు జింద్‌, సోనిపట్ స్టేషన్ల మధ్య 89 కిలోమీటర్లు ఈ రైలు ప్రయాణించనుంది.

2014కంటే ముందు ఇంధన కొరతతో రైళ్లు ఆగిపోయేవి.. భవిష్యత్తులో ఇంధనం లేకుంటే రైళ్లు ఎలా నడుస్తాయని ప్రశ్నించారు. ప్రపంచంలో ఏ సంక్షోభం ఎదురైనా దానికి సమాధానం భారత్‌ వద్ద ఉంటుందని మోదీ ఈ సందర్భంగా భారత సత్తాని కొనియాడారు.  రైలు ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ "ఇలాంటి అధునాతన రైళ్లు కలిగిన ప్రపంచంలోని కొన్ని ఎంపిక చేసిన దేశాల జాబితాలో భారతదేశం కూడా చేరింది. రైల్వే రంగంలో స్వచ్ఛమైన సాంకేతికతను అవలంబించడంలో ఇది భారతదేశానికి ఎంతగానో దోహదపడుతుంది" అని పేర్కొన్నారు.

భారతదేశంలో ఇలాంటి పర్యావరణ అనుకూల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతను ఉపయోగించడం ఇదే తొలిసారి. ఈ రైళ్లు హైడ్రోజన్ ఇంధన కణాల ద్వారా సొంతంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని నడుస్తాయి. ఇది డీజిల్ రైళ్లకు అత్యంత స్వచ్ఛమైన, పర్యావరణ రహిత ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా హైడ్రోజన్ నిల్వ , రీఫ్యూయలింగ్  సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. 

     హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు

  •  హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారంగా నడిచే 10 కోచ్‌ల రైలు

  • ఈ రైలు గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల ఆపరేషనల్ స్పీడ్‌తో నడపడానికి అనుమతి లభించింది. కాగా దీని డిజైన్ స్పీడ్ గంటకు 110 కిలోమీటర్లు.

  • ప్రయాణికుల సామర్థ్యం: ఈ రైలులో దాదాపు 2,600 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించవచ్చు.

  • డిజైన్ దశ నుండి ప్రోటోటైప్ తయారీ వరకు ఈ రైలును పూర్తిగా భారతదేశంలోనే (Make in India) రూపొందించారు.

    హైడ్రోజన్‌ రైలు భారత్‌లో రావడంతో జర్మనీ,జపాన్, చైనా,అమెరికా దేశాల సరసన భారత్‌ చేరింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement