ఓ అరవై ఏళ్లు రాగానే..మనలో శక్తి సన్నిగిల్లుతుంది, ఆటోమెటిగ్గా చేసే వ్యాయామాల జోరు తగ్గుతుంది. వయసులో ఉన్నంత సులభంగా వృధాప్యంలో వ్యాయమాలు చేయలేం. ఫిట్‌నెస్ నిపుణులు పర్యవేక్షణలో ఈజీగా చేయగలిగే వర్కౌట్లనే ఆశ్రయిస్తాం. అలాంటిది 92 ఏళ్ల తాత 20 ఏళ్ల యువకుడిలా ఎన్నిపుష్ అప్‌లు చేస్తాడో తెలిస్తే కంగుతింటారు. చెప్పాలంటే అతడు ముసలి తాతలా కనిపించే యువకుడిలా ఉంటుంది.. వ్యాయమాలు చేసే తీరు. అతనెవరు, ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటి వంటి వాటి గురించి తెలుసుకుందామా..!.
బ్రిస్టల్‌లోని స్పైక్ ద్వీపంలో నివసించే కెన్ అనే తాతకు 92 ఏళ్లు. కానీ అతడు 20 ఏళ్ల యుకుడి మాదిరిగా ఎలాంటి ఆయాసం లేకుండా అలవోకగా పుష్ అప్‌లు చేస్తుంటాడు. మాజీ కాంకోర్డ్ ఇంజనీర్ అయిన ఈ తాత ఫిట్‌నెస్ పరంగా అందరికీ స్ఫూర్తి అని చెప్పొచ్చు. అతడు రోజుకి దగ్గర దగ్గర 400 నుంచి 600దాక పుష్ అప్‌లు చేయగలడట. అక్కడితో వర్కౌట్లు ఆపేయడు.
దీని తర్వాత కోర్ వ్యాయామాలు చేస్తాడు, బరువుల ఎత్తుతాడు కూడా. దాంతోపాటు సుమారు 5 నుంచి 10 కి.మీ నడక కూడా తప్పనిసరిగా ఉంటుందట. చాలామంది ఇన్ని ఎందుకు చాలా తేలిగ్గా చేసే వాటిపై దృష్టిసారించమని హితబోధ చేసిన పట్టించుకోడట. ఎందుకిలా అంటే.. తాను చాలా ఏళ్ల నుంచి దినచర్యను ఇంట్రస్టింగ్ ఉండేలా చేసుకుంటానని చెబుతుంటాడు ఈ కెన్ తాత.
ఎందుకంటే రొటీన్‌గా ఎప్పుడూ చేసే వ్యాయామాలు చేయడం అనేది చాలా బోరింగ్‌గా మారిపోతుందట. అందుకే..పుష్ అప్‌లు తర్వాత కడుపుని సాగదీసేలా హామ్ స్ట్రింగ్‌లు, పరుగు, తదితరాలు చేస్తూ..ఆసక్తికరంగా మార్చుకుంటాడట. కేవలం తాను క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలనే డెడీకేషన్, యాక్టివ్‌గా ఉండటంపై నిరంతర ఫోకసే ఇంతలా ఈ వయసులో ఫిట్‌నెస్‌గా ఉండటానికి కారణమని అంటాడు కెన్. మరి అతడు ఎలాంటి ఆహారం తీసుకుంటాడంటే..
డైట్..
కెన్ తన రోజుని జంబో ఓట్స్, గోధుమలు, చియా గింజలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌తో ప్రారంభిస్తాడట. వాటితోపాటు అరటిపండు, ఎండుద్రాక్ష, పాలు తదితరాలు కూడా తీసుకుంటానని చెబుతున్నాడు.
కెన్‌లా సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే..
పెద్దయ్యే కొద్ది సిక్స్‌ప్యాకలు, మంచి శరీరాకృతి వంటి వాటిపై ఫోకస్ తగ్గి..ఆరోగ్యంగా జీవించాలనే కాంక్ష పెరుగుతుందట. అలా అనుకునేవాళ్లు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, సమతుల్య ఆహారానికి పెద్ద పీటవేయడం వంటివి చేయాలట. ముఖ్యంగా గుండె, మెదడు ఆరోగ్యం బాగుండాలంటే..నడక, ఈత, సైక్లింగ్ తప్పనిసరి అట. ఇవి శరీరానికి తేలికపాటి శక్తి శక్షణ నిచ్చి..రక్తపోటు, చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయట.
అంతేగాదు మానసిక ఆరోగ్యం మెరుగగ్గా ఉండి.. ఒంటరితనం, ఆందోళన, నిరాశతో పోరాడగలిగేలా ఆరోగ్యకరమైన రసాయనాలు శరీరంలో విడుదలవుతాయట.ఇ క్కడ కెన్‌లా అంతలా వ్యాయామాలు చేయలేకపోయినా..కనీసం నడక, చిన్నపాటి కండరాల కదలికల కోసం కాస్త తేలికపాటి వర్కౌట్లు చేసినా.. సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు నిపుణులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: స్నేహితుడి కూతురు కోసం వెల కట్టలేని గిఫ్ట్..! నెటిజన్లు ఫిదా)


