పని చేయటం, విశ్రాంతి తీసుకోవటం అనేవి జీవితంలో రెండు అత్యంత ప్రధాన విషయాలు. ఈ రెండింటిలో సమతుల్యత కలిగి ఉండటం అనేది నైపుణ్యతకు సంబంధించినది. ఈ రెండింటిపై సరైన పట్టు తెలిసి ఉండటమే జ్ఞానం. పనిచేయడంలో విశ్రాంతి, విశ్రాంతిలో కార్యచరణతను చూడటం అనేది అంతులేని స్వేచ్ఛని అందిస్తుంది.
బ్రేక్ ప్రాముఖ్యత...
కాలం అనేది ప్రవహించే నది లాంటిది. ఆనందంగా ఉన్న సమయాన్ని సైతం తన ప్రవాహంలో తీసుకుపోతుంది. కొన్నిసార్లు ఆ ప్రవాహంలో ముక్కుపుటాలవరకు మునిగిపోతాం. ఆ తర్వాత నది ఒరవడి తగ్గాక లేదా వరద ఉద్ధృతి తగ్గాక ఒడ్డుకి చేరుకుంటారు. అలేగా జీవితంలో కూడా ఒక్కోసారి సంపూర్ణంగా కాలంతో ఉండాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఒడ్డుకు చేరి కూర్చొని గమనించాలి కూడా. అలాగే జీవితంలో కూడా ఇలాంటి సమతుల్యతను పాటించాల్సిన అవసరం తప్పక ఉంది.
సరైన కార్యాచరణే విశ్రాంతికి పునాది..!
ఎంత ఎత్తైన భవనాన్ని నిర్మించాలన్నా దానికి సరైన పునాది లోతుగా ఉండాల్సిందే. వింటినారిని ఎంత భాగా వెనక్కు లాగితే అంతవరకు బాణం దూరంగా వెళ్తుంది. అలాగే మన పనులు ఫలవంతమై, విజయం సాధించాలంటే. మనకు సరైన సమయంలో తగిన విశ్రాంతి అంత అవసరం.
ధ్యానం అంటే..
ధ్యానం అంటే ఏం చేయకుండా ఉండే ఓ అద్భుత కళ. ఇది గాఢ నిద్రలో పొందే విశ్రాంతి కంటే విలువైనది. శ్వాస మీద ధ్యాస పెట్టే ఈ సుదర్శన క్రియ. మెదడులోని ఆల్ఫా, బీటా తరంగాలు రెండింటిని పెంచి, ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్‌ను నియంత్రిస్తుంది. ఫలితం విశ్రాంతిగా ఉంటూనే అప్రమత్తంగా(ఎరుకగా) ఉంటాం. ఫలితంగా ఒత్తిడికి గురికాకుండా పనిచేయగలుగుతాం.
బ్యాలెన్సింగ్ లైఫ్ కోసం..
ధ్యానం వెనుకకు లాగిపట్టి లోలోపలకు తీసుకువెళ్లి..పరిస్థితుల నుంచి పారిపోనివ్వకుండా చేస్తుంది. ఇది సమతత్వాన్నిసాధించేందుకు చేసే అభ్యాసం. అంతరంగంలో ప్రశాంతత, బాహ్యంగా చైతన్యంగా ఉండేలా చేస్తుంది.ఇది అందరికి తప్పక అవసరమైనది. మనలో కలిగే సంఘర్షణలకు పరిష్కారం తోపాటు అంతరంగ శాంతికి ఇది ఎంతో సహాయపడుతుంది. ఎప్పుడైతే అంతరంగంలో ప్రశాంతత ఏర్పడుతుందో..సానూకూలంగా స్పందించగలుగుతాం.
సున్నితంగా ఉంటూ సానకూలంగా వ్యవహరించడం అత్యంత అవసరం. ఎందుకంటే సున్నిత మనస్కులు చిన్న విషయాలకే ఆవేశ పడిపోతారు. అతిగా స్పందించేవారు ఇతరులు ఏమనుకుంటారనేది అనవసరం, తమ వైఖరే సరైనదనేది వారి నమ్మకం. అందువల్ల సున్నతత్తం స్పందించే మనసు రెండూ అవసరమే మనిషికి. ఈ నాగరిక సమాజంలో మనగలగాలంటే..సంబంధాలు, సమతుల్యత రెండూ అవసరం. ముఖ్యంగా మన భావ ప్రకటన సవ్యంగా ఉంటే ఎలాంటి ఘర్షణలకు తావుండదు.
విరామపు శక్తని ఎలా పెంపొందించుకోవాలంటే..
మొదటగా విరామం అవసరం అన్న ఆలోచనే మిమ్మల్ని విశ్రాంతిగా ఉండనివ్వదు. బాగా కష్టపడి పనిచేయాలన్న ఆలోచన అలసట తెప్పిస్తుంది.తక్కువ సమయమైనా విశ్రాంతి పునరుత్తేజాన్ని అందిస్తుంది. ధ్యానం చేసేందుకు నాకు ఏం అక్కర్లేదు, నేను ఏం కాను, ఏమి చేయడం లేదు అనే వాటిని వదిలేయండి. మూడు కాలం మిమ్మల్ని నియంత్రించేలా చేయకండి, సమయం సరిపోవటం లేదన్న ఆలోచనే వద్దు. చివరగా చేసే పనిలో తీసుకునే ఆహారంలో సమతుల్యత పాటించండి. ఇక్కవ విశ్రాంతి తీసుకున్నప్పుడు శక్తిపొందుతారు, పనిచేసినప్పుడూ శక్తిని వ్యక్తపరుస్తారు. ఈ రెండిటి కలయికే జీవితం.
సృజనాత్మకత, చైతన్యానికి మూలం ధ్యానం..
చివరగా ధ్యానం చేయండి, అది మిమ్మల్ని, మీ మనసుని శుభ్రపరిచి, పనిభారాన్ని స్వీకరించేందుకు సిద్ధం చేస్తుంది. మనసు విశ్రాంతి పొందినప్పుడే బుద్ధి పదునెక్కుతుంది.ప్రశాంతమైన, స్థిరమైన మనసు మందకోడిగా ఉంటుంది. అది ఉత్సాహానికి, సృజనాత్మకతకు నెలవుగా మారి, ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటన్నింటిని పొందగలిగేలా చేస్తుంది.


