
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత.. అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ ‘అన్నదాత పోరు’ పేరుతో వైఎస్సార్ సీపీ మంగళవారం(సెప్టెంబర్ 9వ తేదీ) రణభేరి మోగించింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున శాంతియుత నిరసన చేపట్టాయి. వైఎస్సార్‌సీపీ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి రాష్ట్రంలోని రైతులు కదం తొక్కారు.






































