
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. నందిగామలో అన్నదాత పోరులో పాల్గొన్నందుకు అక్రమ కేసులు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ నేతల ర్యాలీపై నందిగామ ఏఎస్ఐ లంకపల్లి రవి ఫిర్యాదు చేశారు. సెక్షన్ 30 నిబంధనలు ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేశారు.
అనుమతి లేకుండా నిరసన, ర్యాలీ చేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, దేవినేని అవినాష్, తన్నీరు నాగేశ్వరరావులతో పాటు మొత్తం 20 మంది పై కేసులు చేశారు.