Live Updates

'అన్నదాత పోరు'పై చంద్రబాబు సర్కార్ కుట్రలు
రైతు కన్నీరు కారిస్తే రాష్ట్రానికి అరిష్టం: పేర్ని నాని
- కృష్ణా జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగం పడుతున్న అవస్థలు వర్ణనాతీతం
- రైతుల కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అన్నట్లుగా ఉన్నాయి
- రైతుకు విత్తనం, ఎరువులు, గిట్టుబాటు ధరలు దక్కడం లేదు
- కూటమి ప్రభుత్వంలో రైతు కంట కన్నీరు ఆగటం లేదు
- వీళ్ల పాపం ఎప్పుడు పండుతుందో
- మోదీ త్వరగా జమిలీ ఎన్నికలు పెడితే కానీ ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోయేలా లేదు
- చంద్రబాబు నాది నలభై ఏళ్ళ అనుభవం.. నాకన్నా పోటుగాడు లేడంటాడు
- జగన్ నిరసనలకు పిలుపు ఇచ్చే వరకు చంద్రబాబు స్పందించలేదు
- వ్యవసాయ శాఖ మంత్రి అన్నీ బాగానే ఉన్నాయంటారు
- రైతులు యూరియా దాచుకున్నారని మొన్న అన్నాడు
- రైతులు మూడుసార్లకు కలిపి ఒకేసారి 75 కేజీలు యూరియా తీసుకుని దాచుకున్నారు అని నిన్న అంటాడు
- వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి బాధ్యత ఏమైంది?
- కనీసం రైతులకు ఎంత యూరియా అవసరమో తెలుసుకోండి
- మా లెక్క ప్రకారం 100 నుంచి 125 కేజీల యూరియా అవసరం ఉంటుంది
- మీ లెక్క ప్రకారమైనా 75 కేజీలు ముందే తెచ్చుకోవటం తెలియదా?
- యూరియా విషయంలో డ్రామాలు ఆడుతున్నారు
- నడ్డాతో మాట్లాడేశారు.. యూరియా పార్సిల్ చేస్తున్నారు.. వచ్చేస్తుంది అన్నారు మోతమోగిస్తున్నారు
- జగన్ ధర్నా అనేంత వరకు నడ్డా నెంబర్ మీకు గుర్తుకు రాలేదా?
- ఎరువులు తెప్పించుకోవాల్సింది మే, జూన్‌లో కదా..
ఏపీలో కదంతొక్కిన రైతులు
- యూరియా కొరత, రైతు సమస్యలపై వైఎస్సార్‌సీపీ ‘అన్నదాత పోరు’
- రైతులతో కలిసి ఆర్డీవో ఆఫీస్‌ల వద్ద వైఎస్సార్‌సీ శ్రేణుల నిరసన
- ఆంక్షలను ఛేదించి ఆర్డీవోల వద్ద రైతుల నిరసనలు
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు నిరసనలు
- పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక రైతుల కన్నీరు
- ఉల్లి, టమాటాలకు గిట్టుబాటు ధరలేక అల్లాడుతున్న రైతులు
- రైతుల గోడు పట్టించుకోని కూటమి ప్రభుత్వం
రైతుల పక్షాన పోరాటం.. కేసులకు భయపడేది లేదు: ఆర్కే రోజా
ఎరువుల బ్లాక్ మార్కెట్ నియంత్రించాలి
రైతుల పంటలకు గిట్టు బాటు ధర కల్పించాలని డిమాండ్
రైతన్నకు బాసటగా నగరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన
యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
యూరియా బస్తాల కోసం రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు
యూరియాను బ్లాక్ మార్కెట్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు
నగరి ఆర్డీవో అనుపమకు రైతులు యూరియా కష్టాలపై వినతి పత్రం అందించిన ఆర్కే రోజా
రైతు సమస్యలను వదిలేశారు.. కూటమి సర్కార్‌పై కాకాణి గోవర్థన్‌రెడ్డి ఫైర్
- నెల్లూరు: రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా అన్నదాత పోరుబాట
- రైతులకు మద్దతుగా ర్యాలీ నిర్వహణ అనుమతి కోరితే ఆంక్షలు విధించారు
- వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష ర్యాలీలను మేము అడ్డుకోలేదు
- మా ప్రభుత్వంలో ఏనాడూ రైతు ఎరువుల కోసం రోడ్డు ఎక్కలేదు
- నేడు యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
- రైతులకు యూరియా అందడం లేదు.. అదే బహిరంగ మార్కెట్‌లో రూ.600కు అమ్ముతున్నారు
- 50 శాతం యూరియా ప్రైవేటు వ్యాపారులకు తరలించారు
- యూరియా తరలింపులో 200 కోట్లు లబ్ధి పొందారు
- వైఎస్ జగన్ హయాంలో ధరల స్థిరీకరణ చేపట్టారు
- రైతులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు.
- నేటి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా ఎత్తేశారు
- రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పట్టించుకునే పరిస్థితి లేదు
- రైతు సమస్యలను వదిలేసి.. కమిషన్స్ కోసం బనకచర్ల ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చారు
- బ్లాక్ మార్కెట్‌ను నిరోధించే పరిస్థితి లేదు
- గిట్టుబాటు ధర, పంట నష్ట బీమా, యూరియా కొరతపై వెంటనే చర్యలు చేపట్టాలి
మాజీ మంత్రి జోగి రమేష్‌ని అడ్డుకున్న పోలీసులు
- ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద జోగి రమేష్‌ని అడ్డుకున్న పోలీసులు
- పోలీసులు, నాయకులు మధ్య వాగ్విదం
- బారిగేట్లును పక్కకు తొలగించి రైతు పోరు బాటకు బయల్దేరిన వైఎస్సార్‌సీపీ నాయకులు
- రైతులు, వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించిన జోగి రమేష్
- కూటమిపాలనలో రైతన్న రోడ్డునపడ్డారు: జోగి రమేష్
- రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులను మహిళలను క్యూ లైన్ లో నిలబెడుతున్న చంద్రబాబు
- రాష్ట్రంలో మందు డోర్ డెలివరీ తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు
- రైతు అభివృద్ధిని కోరుకున్న ఒకే ఒక వ్యక్తి వైఎస్ జగన్
తిరుపతిలో రైతుపోరు బాట
- భారీ సంఖ్యలో తరలి వచ్చిన రైతులు
- రైతుపోరు పాల్గొన్న తిరుపతి వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి
- రైతు సమస్యలపై అర్డీఓ కు వినతి సమర్పించిన అభినయ్ రెడ్డి
- రైతు సమస్యలపై వినూత్న రీతిలో ప్రదర్శన
- యురియా కొరత, రైతుకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్లెక్సీలతో ప్రదర్శన
నందిగామలో ‘అన్నదాత పోరు’ను అడ్డుకున్న పోలీసులు
రైతులతో కలిసి ఆర్డీవో కార్యాలయానికి బయల్దేరిన వైఎస్సార్‌సీపీ నేతలు
వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
రైతులు, వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసుల దౌర్జన్యం
రైతులంటే చంద్రబాబుకు చులకన: ఎస్వీ సతీష్‌రెడ్డి
కూటమి పాలనలో రైతులు అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నారు: ఎస్వీ సతీష్‌రెడ్డి
చంద్రబాబు పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు
వైఎస్‌జగన్ హయాంలో రైతుల ఇంటి వద్దకే ఎరువులు వచ్చేవి
రైతుల పట్ల చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు
కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధరల లేదు
వైఎస్సార్‌సీపీ హయాంలో చీని లక్ష రూపాయల ధర పెరిగింది
కూటమి పాలనలో చీని ధర రూ.10 వేలు కూడా లేదు
ఆంక్షలకు బెదరం.. గళం వినిపిస్తాం: ఎస్వీ మోహన్‌రెడ్డి
- కర్నూలు: వైఎస్సార్‌సీపీ తలపెట్టిన అన్నదాత పోరుపై పోలీసులు ఆంక్షలు
- తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఇంటికెళ్లిన పోలీసులు
- 30 యాక్ట్ అమలులో ఉందంటూ పోలీసులు నోటీసులు..
- నిరసన ర్యాలీలు చేపట్టకుడదని.. కేవలం పది మందితో ఆర్డీవోకి వినతిపత్రం అందించాలంటూ పోలీసుల ఆదేశం
- నిరసన, ర్యాలీలు చేస్తే.. అరెస్టు చేస్తామంటూ పోలీసుల బెదిరింపులు
ఎన్ని అడ్డంకులు సృష్టించినా ’నిరసన’ ఆపేది లేదు: అనంత వెంకటరామిరెడ్డి
- అనంతపురం: వైఎస్సార్‌సీపీ నిరసనపై పోలీసుల ఆంక్షలు
- ర్యాలీ చేపట్టవద్దని పోలీసుల హెచ్చరికలు
- వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి నోటీసులు జారీ చేసిన పోలీసులు
- 20 మంది కంటే ఎక్కువ మంది వెళ్లొద్దని ఆంక్షలు
- పోలీసుల తీరును తీవ్రంగా ఖండించిన అనంత వెంకటరామిరెడ్డి
- రైతుల కోసం ఉద్యమం చేస్తే సీఎం చంద్రబాబు సహించలేకపోతున్నారు
వైఎస్సార్‌సీపీ నేతల హౌస్ అరెస్ట్‌లు
- అన్నదాత పోరుకు అనుమతి లేదంటు పోలీసులు నిబంధనలు
- అనకాపల్లి జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతల హౌస్ అరెస్ట్‌లు
- యూరియా కొరతపై నేడు వైఎస్ఆర్సిపి అన్నదాత పోరు కార్యక్రమం.
- అన్నదాత పోరుకు హాజరు కాకుండా హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు
- తెల్లవారుజామున నాలుగు గంటలకు వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లకు వెళ్లిన పోలీసులు
- వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు హౌస్ అరెస్టులు
- పోలీసులు అడ్డుకున్న సరే అన్నదాత పోరును విజయవంతం చేసి తీరుతామంటున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
ఆర్డీవో కార్యాలయాల సమీప ప్రాంతాలకు చేరుకున్న రైతులు
- వైఎస్సార్‌సీపీ 'అన్నదాత పోరు'పై చంద్రబాబు సర్కార్ కుట్రలు
- ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా నిరసనలు ఆపేది లేదంటున్న రైతులు
- రైతులు, పార్టీ నేతలను కట్టడి చేసేందుకు పోలీసులతో బెదిరింపులు
- నోటీసులు ఇస్తూ అరెస్టు చేస్తామంటూ హెచ్చరికలు
- కొన్ని చోట్ల పదిమంది, 15 మందితోనే నిరసనలు చేయాలని ఆంక్షలు
- ఆంక్షలతో ఉద్యమాలను కట్టడి చేయలేరంటున్న రైతులు, రైతు నేతలు
- వివిధ మార్గాల్లో ఆర్డీవో కార్యాలయాలకు చేరుకునేలా ప్లాన్
- యూరియా కొరత, ఇతర సమస్యలపై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం
- ఇప్పటికే ఆర్డీవో కార్యాలయాల సమీప ప్రాంతాలకు చేరుకున్న రైతులు
నేడు ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘అన్నదాత పోరు’
యూరియా కొరత సహా అనేక రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ నిరసనలు
అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు తెలపనున్న వైఎస్సార్ సీపీ నేతలు
నిరసనలను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు
అనుమతి లేకుండా నిరసనలు చేస్తే అరెస్టు చేస్తామంటూ బెదిరింపులు
ఇప్పటికే అనేక మందికి నోటీసులు ఇచ్చిన పోలీసులు
నోటీసులు, అరెస్టులపై చూపుతున్న శ్రద్ద యూరియా కొరతపై చూపని చంద్రబాబు
ఉల్లి, టమోటాలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం
ఎంతమందిని అరెస్టు చేసినా రైతుల పక్షాన పోరాటం చేస్తామంటున్న వైఎస్సార్‌సీపీ
రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీవో కార్యాలయాల ఎదుట నిరసనలకు సిద్ధం
వైఎస్సార్‌సీపీ అన్నదాత పోరు
రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత.. అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ ‘అన్నదాత పోరు’ పేరుతో కూటమి సర్కారుపై వైఎస్సార్ సీపీ రణభేరి మోగించింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతు సంఘాలు మంగళవారం శాంతియుత ఆందోళనలు నిర్వహించనున్నాయి.