సాక్షి, విశాఖపట్నం: విశాఖలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి మీడియా ప్రతినిధులకు అనుమతి నిరాకరించారు. ఇవాళ ఉదయం వరకు మీడియాకు అనుమతి ఉందంటూ ప్రకటించిన అధికారులు.. మీడియా ప్రతినిధులకు పాసులు కూడా జారీ చేశారు. కాసేపట్లో సమావేశం ప్రారంభమవుతుందనగా మీడియాకు అనుమతి లేదంటూ సమాచారం ఇచ్చారు.
కౌన్సిల్ సమావేశంలో గీతం భూదోపిడీని నిలదీస్తామని వైఎస్సార్‌సీపీ ప్రకటించిన సంగతి తెలిసిసందే. గీతంకు భూ కేటాయింపులు రద్దు చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోంది. కౌన్సిల్ సమావేశానికి శాసన మండల ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కుంభ రవిబాబు, పండుల రవీంద్రబాబు, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు హాజరుకానున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా కాసేపట్లో కౌన్సిల్ సమావేశానికి వైఎస్సార్‌సీపీ నేతలు బయలుదేరనున్నారు.


