మేజిస్ట్రేట్‌ ముందుకు కాకాణి.. 144 సెక్షన్‌ అమలు.. | Former Minister YSRCP Kakani Govardhan Reddy Arrested In Illegal Mining Case Updates In Telugu | Sakshi
Sakshi News home page

మేజిస్ట్రేట్‌ ముందుకు కాకాణి.. 144 సెక్షన్‌ అమలు..

May 26 2025 7:51 AM | Updated on May 26 2025 3:40 PM

YSRCP Kakani Govardhan Reddy Arrest Updates

కాకాణి అరెస్ట్‌ అప్‌డేట్స్‌..

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి రిమాండ్‌

  • 14 రోజుల రిమాండ్‌ విధించిన వెంకటగిరి కోర్టు

  • కాసేపట్లో నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తరలింపు
     

  • తిరుపతి..
    వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జి మేజిస్ట్రేట్ కోర్టులో కాకాణిని హాజరు పరిచిన నెల్లూరు పోలీసులు 
     

కాసేపట్లో మేజిస్ట్రేట్‌ ముందుకు కాకాణి..

  • కాసేపట్లో నెల్లూరు డీటీసీ నుంచి వెంకటగిరి మేజిస్ట్రేట్‌ ముందు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
  • కాకాణిని హాజరుపరుచనున్న పోలీసులు.
  • వెంకటగిరి మేజిస్ట్రేట్‌ ఆవరణలో 144 సెక్షన్ విధింపు. 

కాకాణికి వైద్య పరీక్షలు పూర్తి..

  • వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తి.

  • చెముడు గుంటలోని డీటీసీ నుంచి నేరుగా వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి కాకాణిని తీసుకెళ్లిన పోలీసులు

  • వైద్య పరీక్షల అనంతరం అక్కడి నుంచి వెంకటగిరి మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచే అవకాశం ఉంది.

👉 రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్‌ పాలన పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా సర్కారు పెద్దల బరితెగింపు హద్దులు మీరాయి. ప్రశ్నించే వారే ఉండకూడదని టార్గెట్‌ చేస్తూ అరెస్ట్‌లు చేస్తున్నారు.  ఈ క్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్‌ చేశారు. కేరళ రాష్ట్రంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని ఆదివారం రాత్రి నగరానికి తీసుకువచ్చారు.

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి రిమాండ్

👉పొదలకూరు మండలం తాటిపర్తి రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్‌ జరిగిందని ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనింగ్‌ శాఖ ఇన్‌చార్జ్‌ డీడీ బాలాజీ నాయక్‌ పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్‌లో కాకాణి అనుచరుల ప్రమేయం ఉందని, ఆయన వారికి సహకరించారంటూ 120(బి), 447, 427, 379, 290, 506, 109 ఆర్‌/డబ్ల్యూ 34 ఐపీసీ, సెక్షన్‌ 3 పీడీపీపీఎ, సెక్షన్‌ 3 అండ్‌ 5 ఆఫ్‌ ఈఎస్‌ యాక్ట్‌ అండ్‌ సెక్షన్‌ 21(1), 21(4) ఆఫ్‌ ఎంఎండీఆర్‌ యాక్ట్‌ కింద పోలీసులు నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు.

👉ఈ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సంబంధం లేకపోయినా.. పట్టుబట్టి, టార్గెట్‌ చేసి ఏ4గా చేర్చారు. తొలుత ఈ కేసులో బలం లేదని ఏ1తో పాటు మరో ఇద్దరికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో కేసును మరింత పటిష్టం చేసి కాకాణిని జైలుకు పంపే కుట్రలో భాగంగా అట్రాసిటీ సెక్షన్‌లు జత చేశారు.

👉కాకాణి ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఉండగా నెల్లూరు పోలీసులు ఆదివారం మధ్యాహ్నం ఆయన్ను అదుపులోకి తీసుకుని నెల్లూరు డీటీసీకి తరలించారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ యాదవ్, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు డైకస్‌ రోడ్డులోని కాకాణి గృహానికి చేరుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement