
వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలపై రెడ్‌బుక్ కుట్ర
దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని పరామర్శించడమే నేరం
అబ్బయ్యచౌదరి నివాసంపై బీరు సీసాలు, కర్రలు, రాడ్లతో దాడికి యతి్నంచిన పచ్చమూకలు
దాడి చేసిన వారిని వదిలేసిన పోలీసులు
అన్యాయాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు
ఏలూరు సిటీ: కూటమి నేతల రెడ్‌బుక్ రాజ్యాంగంలో పోలీసుల విధి ‘సత్యం వధ.. ధర్మం చెర’గానే మారింది. మొదట్లో సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులపై బుసలు కొట్టిన రెడ్‌బుక్ రాజ్యాంగం.. ఆ తరువాత మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులపైనా కోరలు చాస్తోంది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై టీడీపీ మూకలు దాడికి తెగబడగా.. అసలు నిందితులను వదిలేసి అబ్బయ్య చౌదరి, మాజీ మంత్రి పేర్ని నాని, పార్టీ శ్రేణులపైనా తప్పుడు కేసులు నమోదు చేసి రెడ్‌బుక్ రాజ్యాంగం అంటే ఏమిటో పోలీసులు మరోసారి రుజువు చేశారు.
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు, టీడీపీ కార్యకర్తలు ఈ నెల 21న వైఎస్సార్‌సీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరికి చెందిన వ్యవసాయ క్షేత్రంలోకి చొరబడి పామాయిల్ గెలలను కోస్తున్న వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. అదే క్షేత్రంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటిపై టీడీపీ మూకలు బీరు సీసాలు, కర్రలు, రాడ్లతో దాడి చేసి వీరంగం చేశారు.
ఈ ఘటనపై బాధితుడైన అబ్బయ్య చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దాడికి యతి్నంచిన టీడీపీ మూకలను వదిలేసి ఆయనపైనే ఎదురు కేసు నమోదు చేశారు. అక్కడితో ఆగకుండా వైఎస్సార్‌సీపీకి చెందిన జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్‌బాబు, మాజీ ఎమ్మెల్యే సోదరులు చల్లగోళ్ల ప్రదీప్, తేజ, ఉప్పలపాటి ప్రసాద్‌తో పాటు మొత్తం 15 మందిపై కేసులు నమోదయ్యాయి. మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులనూ పోలీసులు వదల్లేదు.
తాజాగా పేర్ని నానిపై కేసు నమోదు
ఇదే అంశంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నానిపైనా పోలీసులు మంగళవారం అక్రమ కేసు నమోదు చేశారు. అబ్బయ్యచౌదరి నివాసంపై బీరు సీసాలు, కర్రలు, రాడ్లతో టీడీపీ మూకలు దాడికి యతి్నంచిన విషయం తెలిసి మాజీమంత్రి పేర్ని నాని తదితరులు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అబ్బయ్య చౌదరి పొలంలో టీడీపీ శ్రేణులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతుండటంతో వైఎస్సార్‌సీపీ నేతలు, మాజీ మంత్రులు పేర్ని నాని, సాకే శైలజానాథ్, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలతో కూడిన బృందం ఈ నెల 22న కొండలరావుపాలెంలో అబ్బయ్యచౌదరి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి.. ఆయనకు సంఘీభావం ప్రకటించింది. అనంతరం పేర్ని నాని, సాకే శైలజానాథ్ ఏలూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయానికి చేరుకుని అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావుకు వినతిపత్రం సమరి్పంచారు.
అబ్బయ్య చౌదరి నివాసం, ఆయన వ్యవసాయ క్షేత్రంలో దాడికి యతి్నంచిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వినతిప్రంలో కోరారు. అనంతరం పోలీస్ జిల్లా కార్యాలయం వెలుపల మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ఏదైనా ఉంటే రాజకీయపరంగా చూసుకుందామని, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడటం సరైన విధానం కాదని దెందులూరు నియోజకవర్గ టీడీపీ నాయకులకు హితవు పలికారు.
టీడీపీ నేతలు, కార్యకర్తల దాషీ్టకాలపై రాజకీయ విమర్శలు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, రెండు వర్గాల్లో వైషమ్యాలు రెచ్చగొట్టేలే వ్యాఖ్యలు చేశారని ఏలూరు మండలం పాలగూడెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నేతల రవి ఈ నెల 25న పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఏలూరు త్రీటౌన్ పోలీసులు పేర్ని నానిపై తప్పుడు కేసు నమోదు చేశారు.