
సాక్షి, కృష్ణా: మంత్రి కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) సెటైరికల్ కామెంట్స్ చేశారు. మంత్రి రవీంద్ర(Kollu Ravindra) ఇంటి పేరు కొల్లు కాకుండా సొల్లు అని పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. టీడీపీ(TDP) కార్యకర్తలు తాళ్లతో కట్టేశాడని ఆయన అనుకుంటున్నాడు.. గన్‌మెన్లు లేకపోతే కార్యకర్తలే తిరగబడి దాడి చేస్తారని అన్నారు. కల్తీ మద్యం కారణంగా కుటుంబాలు రగిలిపోతున్నాయని చెప్పుకొచ్చారు.
కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో కల్తీ మద్యం కారణంగా అమాయక ప్రజలు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు అని ఎక్సైజ్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో మాజీ మంత్రి పేర్ని నాని, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..‘సారా మంత్రి అంటాడు.. మేము నాణ్యమైన మందు అమ్ముతున్నాం. దాని కోసం ఒక యాప్ కూడా తీసుకొచ్చామని చెబుతాడు. కొన్న వెంటనే స్కాన్ చేసి పరిశీలించుకోండి అని అంటున్నాడు. ఆ సమయంలో పేదవారు, టచ్ ఫోన్ లేని వారి పరిస్థితి ఏంటి?. కల్తీ మద్యం తాగే వారికి కూడా కుటుంబం ఉంటుంది. మద్యం తాగకూడదు అని చెప్పాలి. ఒక వేళ మద్యం తాగకుండా ఉండలేకపోతే నాణ్యమైన మద్యం అయినా ఇవ్వాలి.
రాష్ట్రంలో మంచి నీటికైనా కరువు వచ్చిందోమో కానీ మద్యానికి మాత్రం కరువు రాలేదు. ప్రతి గల్లీలో ఎటుచూసినా, ఎక్కడ చూసినా మద్యం అమ్మకాలే కనిపిస్తున్నాయి. దయచేసి కల్తీ మందు జోలికి వెళ్లొద్దు. మద్యాన్ని నిమంత్రించకుండా విచ్చలవిడిగా మద్యాన్ని అందిస్తున్న ఈ సారా మంత్రిని బర్తరఫ్ చేయాలి. మంత్రి రవీంద్ర ఇంటి పేరు కొల్లు కాకుండా సొల్లు అని మార్చుకోవాలి. టీడీపీ కార్యకర్తలను తాళ్లతో కట్టేశావు కాబట్టి ఆగారు అని నువ్వు అనుకుంటున్నావు. టీడీపీ కార్యకర్తలను తాళ్లతో కట్టేసి ఒక కత్తి ఇచ్చి చూడు.. నువ్వు కట్టిన తాళ్లను పరాపరా తెంపేసి వాళ్ళు నిన్ను తిరగబడి తన్నకపోతే చూడు. నీ గన్‌మెన్లు ఉన్నా నిన్ను టీడీపీ కార్యకర్తలు నిన్ను కొట్టకపోతే నన్ను అడుగు. కడుపు రగిలిపోయి సచ్చిపోతున్నారు.. అల్లాడి ఏడుస్తున్నారు’ అని వ్యాఖ్యలు చేశారు.
