తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే.. | Pilgrims Registration vaikunta ekadasi for tirumala | Sakshi
Sakshi News home page

తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే..

Dec 1 2025 10:36 PM | Updated on Dec 1 2025 10:37 PM

Pilgrims Registration vaikunta ekadasi for tirumala

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు భారీగా ఈ-డిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశితో పాటు డిసెంబర్‌ 31, జనవరి 1 దర్శనం టికెట్ల కోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగింది. ఈ  మూడు రోజులలో దాదాపు 1.80 లక్షల టోకెన్ల కోసం  24 లక్షల మంది భక్తులు ఈ-డిప్‌లో పేర్లు నమోదు చేసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది. 9.6 లక్షల ఖాతాల నుంచి  24,05,237 లక్షల మంది భక్తులు తమ  పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపింది. 

డిసెంబరు 2న మధ్యాహ్నం 2 తర్వాత నిర్వహించే ఈ-డిప్ లాటరీలో ఎంపికైన భక్తులకు మెసేజ్‌ అందుతుంది.  జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు వైకుంఠ ‍ద్వారా దర్శనం ఉంటుంది. ఈ ఏడు రోజులకు సంబంధించి రోజుకు 15వేల చొప్పున రూ.300 దర్శనం టోకెన్లు డిసెంబరు 5వ తేదీన ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement