విజయవాడ: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తుంది. జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్‌కు ఎక్సైజ్ అధికారులు నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలంటూ భవానీపురం ఎక్సైజ్ అధికారులు నోటీసులిచ్చారు. డిసెంబర్ 3వ తేదీన విచారణకు రావాలంటూ నోటీసులిచ్చారు. గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయానికి డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 1:30 లోపు హాజరుకావాలని నోటీసులు అందజేశారు.


