న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల ‘సీఎం’ పంచాయతీ బ్రేక్‌ఫాస్ట్‌లపై నడుస్తుంది. అధిష్టానం ఆదేశాలనుకుణంగా మొన్న ఇద్దరు నేతలు కలిసి బ్రేక్‌ఫాస్ట్‌లో పాల్గొన్నారు. సీఎం సిద్ధరామయ్య ఇంటికి హాజరైన డీకే.. బ్రేక్‌ఫాస్ట్‌లో పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత ఇద్దరు ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌ను కలిశారు. వారిద్దరూ బ్రేక్‌ఫాస్ట్ కలిసి చేసినా ఏమీ స్పష్టత లేకపోవడంతో మళ్లీ బ్రేక్‌ఫాస్ట్ చేయాలని హైకమాండ్ ఆదేశించింది. ఈసారి ఆ బ్రేక్‌ఫాస్ట్‌ను డీకే నివాసంలో ఏర్పాటు చేశారు. డిసెంబర్ రెండో తేదీన అంటే రేపు(మంగళవారం) వారిద్దరు మరోసారి బ్రేక్‌ఫాస్ట్ విందులో పాల్గొననున్నారు.
ఢిల్లీకి వెళ్లిని వీరిద్దరి హైకమాండ్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం.. వీరిద్దరి ఎపిసోడ్‌పై సీరియస్‌గా ఉన్నారు. ఐదేళ్ల సీఎం పదవిలో బాగంగా మార్పు అంశానికి ముగింపు పెట్టాలని వారిని హెచ్చరించారనే వార్తలు వచ్చాయి. దానిలో భాగంగానే సిద్ధరామయ్య, డీకేలు మరోసారి భేటీ కావండం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారైనా సీఎం మార్పు అంశానికి వీరిద్దరూ ముగింపు పెడతారా లేదా అనే దానిని హైకమాండ్ నిశితంగా గమనిస్తోంది.
కాగా నవంబర్ 20న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడవడంతో సీఎం మార్పు జరగనుందని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అధికారంలోకి వచ్చినప్పుడే సీఎం మార్పు జరిగేలా అగ్రిమెంట్ జరిగిందని దానికనుంగానే నిర్ణయం తీసుకోనున్నారని ఊహాగానాలు చెలరేగాయి. దానికి ఆజ్యం పోస్తూన్నట్లుగానే ఇద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్‌లు చేయడం కూడా ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. వాట్ నెక్ట్స్ అనేది రేపటికి ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సీఎం పదవి తనకు కావాలని డీకే పట్టుబడతారా.. లేక సిద్ధరామయ్యకు పూర్తిగా ఐదేళ్లు వదిలేస్తారా? అనేది చూడాలి.


