
కృష్ణాజిల్లా: కల్తీ మద్యంపై టీడీపీ నేతల విమర్శలకు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఏపీలో తయారవుతున్న కల్తీ మద్యాన్ని చూసి ఎక్సైజ్‌శాఖే నివ్వెరపోతుందన్నారు. లైసెన్స్ ఉన్న డిస్టరీలకు పోటీగా ములకలచెరువులో కల్తీ మద్యం తయారవుతోందని పేర్ని నాని పేర్కొన్నారు.
ఈ రోజు(శుక్రవారం, అక్టోబర్ 10వ తేదీ) ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన పేర్ని నాని.. ‘ ధనదాహంతో తండ్రీ కొడుకులు ఎన్నో పాపాలు చేస్తున్నారు. మీ రాజకీయాల కోసం ఎంతటి విషమైనా చల్లడమేనా?, ఆంధ్రజ్యోతి,ఈనాడులో చాలా దారుణంగా రాస్తున్నారు. ఆఫ్రికాలో లిక్కర్ ఫ్యాక్టరీ నడిపేవాళ్లంతా రెడ్లే అని రాస్తున్నారు. రెడ్లయితే దొంగలు...కమ్మవారైతే మంచోళ్లా? అని ప్రశ్నించారు పేర్ని నాని.
లోకేష్ ఎందుకు ట్వీట్లు పెట్టడం లేదు?
‘ములకలచెరువుకు ముందు అమలాపురంలో కల్తీ మద్యం పట్టుబడింది. అనకాపల్లి జిల్లా పరవాడ , నెల్లూరు జిల్లాలోనూ కల్తీ మద్యం పట్టుబడింది. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న బ్రాండ్‌ల సీసాల్లో కల్తీ మద్యం నింపుతున్నారు.ఏలూరు,రేపల్లె,అమలాపురంలో పట్టుబడినవన్నీ ఫ్రాంచైజీలే. ఈ ప్రాంఛైజీల తీగలాగితే ములకలచెరువులో డొంక కదిలింది.

ములకలచెరువు నుంచి ఇబ్రహీంపట్నానికి కల్తీ మద్యం పాకింది. వాటాల కోసం వచ్చిన తేడాలతో టిడిపి నేతల కుమ్ములాటలో నకిలీమద్యం పట్టుబడింది. నకిలీ మద్యం పట్టుబడిన చోట ఆ జిల్లాల మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదు?, కల్తీ మద్యం పట్టుబడితే సారా మంత్రి కిక్కురుమనడం లేదు. మాట్లాడితే ట్విట్టర్‌లో పోస్టులు పెట్టే లోకేష్ ఎందుకు ట్వీట్లు పెట్టడం లేదు? అని నిలదీశారు.
చంద్రబాబు కూడా కుయ్ కుయ్ అనడం లేదు ఎందుకో?
పదే పదే మైకుల ముందువు వచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కుయ్ కుయ్ అనడం లేదు. అందరూ తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. పట్టుబడిన కల్తీ మద్యం కేసులను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారుసోషల్ మీడియా కేసులో అరెస్టైన వైసిపి వాళ్ల ఫోన్లను లాక్కుంటారు. విచారణ చేయాలని ఫోన్లు స్వాధీనం చేసుకుంటారు. కల్తీమద్యం కేసులో ఎవరి వద్దైనా ఫోన్లు తీసుకున్నారా?, రేపల్లె,అమలాపురంలో కల్తీ మద్యంతో పట్టుబడిన వాళ్ల ఫోన్లు తీసుకున్నారా?, ఈ కల్తీ మద్యం వెనుక ఉన్న బాస్ ఎవరో తెలుసుకున్నారా?, లోతైన విచారణ చేయరా?, ఆఫ్రికాలో పెద్దిరెడ్డికి ఫ్యాక్టరీలున్నాయని మన సారా మంత్రి మట్లాడుతున్నాడు.
మీ రాజకీయాల కోసం ఎంతటి విషమైనా చల్లడమేనా?, ఆఫ్రికాలో లిక్కర్ ఫ్యాక్టరీ నడిపేవాళ్లంతా రెడ్లే అని రాస్తున్నారు. రెడ్లయితే దొంగలు...కమ్మవారైతే మంచోళ్లా?, తప్పుచేసే వారైతే మీ పార్టీలో రెడ్లను ఎందుకు ఉంచుకున్నారు. రెడ్లందరినీ జగన్ వద్దకు ఎందుకు పంపించేయలేదు. టిడిపి నేతలు చాలా నీచంగా మాట్లాడుతున్నారు. అసలు టిడిపి ఒక పార్టీయేనా?, ఆఫ్రికాలో సారా వ్యావారం చేయిస్తున్న జగన్ రెడ్డి అని రాస్తున్నారు...అసలు సిగ్గుందా మీకు?, జయహో బిసి సభలో జయచంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు
దొంగ లిక్కర్ కంపెనీలు నడిపే వారంతా చంద్రబాబు చుట్టూనే..
పేరుకి బిసి సభ...చేర్చుకున్నది మాత్రం రెడ్డిని. ఆఫ్రికాలో తనకు లిక్కర్ ఫ్యాక్టరీలున్నాయని ఎన్నికల అఫిడవిట్ లో జయచంద్రారెడ్డి పేర్కొన్నాడు. ఆఫ్రికాలో నాలుగు లిక్కర్ ఫ్యాక్టరీలున్నాయని చెప్పాడు. ఎన్నికల్లో బిఫారం ఇచ్చినపుడు చంద్రబాబుకి తెలియదా?, చంద్రబాబుతో కాపురం చేసి జగన్‌కు డబ్బులు పంపించారని మాట్లాడుతున్నారు.. సిగ్గనిపించడం లేదా?, దొంగ లిక్కర్ కంపెనీలు నడిపే దొంగలంతా చంద్రబాబు చుట్టూనే ఉన్నారు. కట్టా సురేంద్ర నాయుడుకి 2002లో ఓ మర్డర్ కేసులో యావజ్జీవ శిక్ష పడింది. కట్టా సురేంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో హైకోర్టుకు వెళ్లాడు. హైకోర్టు కూడా కట్టా సురేంద్రనాయుడిని నేరం చేశావని చెప్పింది
కట్టా సురేంద్ర నాయుడికి క్షమాభిక్ష పెట్టి బయటికి తెచ్చింది చంద్రబాబు కాదా?, కట్టా సురేంద్రనాయుడికి క్లీన్ చిట్ ఇచ్చింది చంద్రబాబు కాదా?, మీకు పార్టనర్ కాకపోతే ఓ మర్డర్ కేసులో నిందితుడు క్షమాభిక్షతో ఎలా బయటికి వచ్చాడు. ఇది కూడా చంద్రబాబుతో జగనే చేయించారా?, చంద్రబాబు మీకు శంకర్ యాదవ్ గుర్తున్నాడా?, మీకు గుర్తులేకపోయినా చిత్తూరు జిల్లా టిడిపి నాయకులకు గుర్తుంటాడు. శంకర్ యాదవ్ ను కాదని మా కోవర్ట్ అని చెప్పే జయచంద్రారెడ్డికి టిక్కెట్ ఎలా ఇచ్చారు?, ఎంత తీసుకుని జయచంద్రారెడ్డికి టిక్కెట్ ఇచ్చారు
ఈరోజు మీరు దొరికిపోయారు కాబట్టి మా పై నిందలు వేస్తారా?
మా కోవర్టులను చేర్చుకుని ఎందుకు మీరు టిక్కెట్లిచ్చారు. మా కోవర్ట్ ను చేర్చుకుని నూజివీడు టిక్కెట్ ఎందుకిచ్చారు?, మా కోవర్ట్ ను ఎందుకు మంత్రిని చేశారు. మా కోవర్ట్‌ను చేర్చుకుని ఎందుకు మచిలీపట్నం ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. మా కోవర్టులను బయటికి పంపించరా...మీ దగ్గరే ఉంచుకుంటారా?, బయటపడేవరకూ మా కోవర్టులను మీ వద్దే ఉంచుకుంటారా?, చంద్రబాబు పాపాలను ప్రజలు లెక్కబెడుతున్నారు. కచ్చితంగా ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెబుతారు’ అని హెచ్చరించారు.
ఇదీ కూడా చదవండి:
మీరు మోసగాళ్ల తరఫు లాయర్లు కదా?