
సాక్షి, ఢిల్లీ: అక్రమ మద్యం కేసులో వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం తరఫున వాదించిన లాయర్లకు జస్టిస్ విక్రమ్‌నాథ్ సరదాగా ఓ చురక అంటించారు.
ఏపీలో మద్యం కుంభకోణం జరిగిందని ప్రముఖ బ్రాండ్లను తొలగించి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారని ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి (Mukul Rohatgi) వాదించారు. అయితే.. ఎంఎస్ఎంఈ తరహాలో వాటిని ప్రోత్సహించారామో? అని ఈ సందర్భంగా ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. అక్కడితో ఆగకుండా..
‘‘మీరు బెయిల్‌కు వ్యతిరేకంగా వాదిస్తున్నారా? మీరు దేశంలోని మోసగాళ్లు అందరి తరఫున వాదనలు వినిపించే న్యాయవాదులు... పెద్ద పెద్ద స్కాంలలో నిందితుల తరఫున వాదనలు వినిపించారు... ఇప్పుడు మీరు బెయిల్‌కు వ్యతిరేకంగా?" అని జస్టిస్ విక్రమ్‌నాథ్ ఫ్రెండ్లీగా అనడంతో కోర్టు హాల్‌లో నవ్వులు పూశాయి.
#SupremeCourt bench's funny banter with Sr Advs Mukul Rohatgi & Siddharth Luthra on their opposing a politician's bail plea
J Vikram Nath: You're opposing bail? You are counsels for all fraudsters of the country...all of you are fraudsters' counsels, in the biggest scams...And… pic.twitter.com/3o6Jw62yPS— Live Law (@LiveLawIndia) October 10, 2025
ఇదిలా ఉంటే ఈ కేసులో ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూత్రా, సిద్దార్థ్ అగర్వాల్‌లు వాదనలు వినిపించారు. ఈ ముగ్గురిలో ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూథ్రాలు గతంలో ఎన్నో హైప్రొఫైల్ కేసుల్లో బెయిల్ కోసం వాదనలు వినిపించారు. ఇందులో గుజరాత్ అల్లర్ల కేసు, జస్టిస్ లోయా కేసు(అమిత్ షా తరఫున), ఆశారాం బాపు కేసు, కోల్‌స్కాం, 2జీ కుంభకోణం కేసులు, అలాగే.. నోట్ల కట్టల జస్టిస్ వర్మ కేసులు ఉన్నాయి. వీటితో పాటు చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు కూడా ఉంది.
ఇదీ చదవండి: విశాఖ సీపీపై వైఎస్సార్‌సీపీ ఫైర్