
సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్‌ని తిరస్కరించిన కోర్టు
41 నోటీసులు ఇస్తే సరిపోతుందని స్పష్టీకరణ
పోలీసుల తీరును తప్పుపడుతున్న ప్రజలు
రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపణలు
సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్‌లో ఎట్టకేలకు న్యాయమే గెలిచింది. కూటమి ప్రభుత్వానికి కోర్టు తీర్పు చెంపపెట్టులా మారింది. పోలీసులను అడ్డుపెట్టుకుని సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలను యావత్ ప్రజానీకం తప్పుపడుతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడం ప్రజాస్వామ్యంలో సరికాదని సూచిస్తోంది. సంక్షేమం విస్మరించి వేధింపులకు దిగడం పద్ధతి కాదని స్పష్టం చేస్తోంది. సర్కారు విధానాలను ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్క పౌరుడికీ ఉంటుందని వెల్లడిస్తోంది.
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టును తిరుపతి మూడో అదనపు జూనియర్ జడ్జి తిరస్కరించారు. 41 నోటీసులు సరిపోతాయని వెల్లడించారు. న్యాయస్థానం తీర్పుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ వైఖరిపై తిరుపతి వాసులు మండిపడుతున్నారు. అధికారాన్ని ఉపయోగించి సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 41 నోటీసులు ఇచ్చి విడిచి పెట్టాల్సిన కేసులో సోషల్ మీడియా కార్యకర్తలు నవీన్, చంద్రశేఖర వెంకటేష్‌ని టెర్రరిస్ట్‌లను అరెస్ట్ చేసినట్టు ముసుగులేసి, రోడ్లపై నడిపిస్తూ కోర్టులో హాజరుపరచంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వారిద్దరి రిమాండ్‌ను న్యాయస్థానం మంగళవారం రాత్రి తిరస్కరించింది.
అణగదొక్కడం సరికాదు
ప్రభుత్వ విధానాలు సక్రమంగా లేకుంటే ప్రతిపక్ష పార్టీ ఎండగడితేనే ప్రజలకు మేలు జరుగుతుందని పలువురు స్పష్టం చేస్తున్నారు. విమర్శలను పాలకులు సానుకూలంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలా కాకుండా తప్పులను ఎత్తి చూపిన వారిని కేసులతో వేధించడం, ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కేందుకు యతి్నంచడం సరికాదని వెల్లడిస్తున్నారు. బెల్ట్ షాపులను అరికట్టడం వదలేసి ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యక్తిగత పూచీ కత్తుపై విడుదల
తిరుపతి లీగల్: తిరుపతి వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా నాయకుడు బృంగి నవీన్ అలియాస్ నాని, తిరుపతి, ఎంఆర్ పల్లి, శాంతినగర్కు చెందిన సి.వెంకటేష్ పై ఈస్ట్ పోలీసులు నమోదు చేసిన కేసులో వ్యక్తిగత పూచీ కత్తుపై ఇద్దరినీ విడుదల చేస్తూ తిరుపతి మూడవ అదనపు జూనియర్ జడ్జి సంధ్యారాణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు యుగంధర్ రెడ్డి, కొత్తపల్లి విజయ్కుమార్, ఐ.చంద్రశేఖర్ రెడ్డిలు వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వు ప్రకారం ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో 41 ఏ నోటీసు ఇవ్వాలని తీర్పు ఉండగా పోలీసులు రిమాండ్‌కు తీసుకురావడం చట్టవిరుద్ధమన్నారు. వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అసలేం జరిగిందంటే!
తిరుపతిలో మద్యం ఏరులై పారుతోంది. మద్యం సేవించిన కొందరు రోడ్డుపై పడి ఉండడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలు వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి చెందిన నవీన్, చంద్రశేఖర్ వెంకటేష్ వైరల్ చేశారని కూటమి నేతలు ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి చేశారు. కూటమి నేతల ఒత్తిడితో సోమవారం వారిద్దరిపై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం రాత్రి రిమాండ్‌కు తరలించారు. రిమాండ్ను సవాల్ చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. దీంతో రిమాండ్‌ను తిరస్కరిస్తూ మూడో అదనపు జూనియర్ జడ్జి తీర్పు ఇచ్చారు.
రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు
పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిరంకుశంగా రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే తిరుపతిలో ప్రతిపక్ష పార్టీ నేతలను వేధిస్తున్నారని, అక్రమంగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారని వెల్లడిస్తున్నారు. పోలీసులు సైతం కూటమి నేతల కళ్లలో ఆనందం చూసేందుకు ౖవైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా సభ్యులు బృంగి నవీన్, చంద్రశేఖర్ వెంకటే‹Ùను అదుపులోకి అవమానించారని వివరిస్తున్నారు. ఐటీ కేసులో అరెస్ట్ చేసిన వ్యక్తిని టెర్రరిస్టు మాదిరిగా ముసుగు వేసి మీడియా ముందు హాజరుపరిచారని విమర్శిస్తున్నారు.