
సాక్షి, విజయవాడ: అధికారులపై మంత్రి అచ్చెన్నాయుడు రెడ్‌బుక్ ప్రయోగించారు. అచ్చెన్నాయుడు వేధింపులకు తట్టుకోలేక ఆగ్రోస్ జీఎం రాజమోహన్ సెలవుపై వెళ్లిపోయారు. సీఎస్‌కు లేఖ రాసి ఆయన సెలవుపై వెళ్లిపోయారు. అవినీతి వ్యవహారాల కోసం జీఎంపై మంత్రి అచ్చెన్నాయుడు ఓఎస్‌డి ఒత్తిడి చేశారు. వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తిత్వం చేయాలని జీఎంపై మంత్రి అచ్చెన్నాయుడు పేషీ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.
దీంతో చెప్పిన మాట విననందుకు మంత్రి అచ్చెన్నాయుడు ఆయనను నెల్లూరుకి బదిలీ చేశారు. సెలవుపై వెళ్లడం తప్ప వేరే మార్గం లేదని సీస్‌కు ఆగ్రోస్ జీఎం లేఖ రాశారు. జీఎం రాజమోహన్‌ని వేధించేందుకే బదిలీ చేశారని సమాచారం. రాజమోహన్ స్థానంలో అర్హత లేని జూనియర్‌కి జీఎంగా మంత్రి అచ్చెన్నాయుడు బాధ్యతలను అప్పగించారు.
