అనంతపురం జిల్లా: ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటన మంగళవారం ఉరవకొండ ఆర్టీసీ డిపో నుంచి రాయదుర్గానికి వెళ్లే బస్సులో చోటు చేసుకుంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఉరవకొండ నుంచి కణేకల్లు మీదుగా రాయదుర్గం వెళుతున్న రాయదుర్గం డిపోకు చెందిన బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళ ప్రయాణికులు మధ్య గొడవ ప్రారంభమైంది.
నింబగల్లు సమీపంలో గొడవ తీవ్ర రూపం దాల్చి ఒకరినొకరు దుర్భాషలాడుకుంటూ పరస్పరం కొట్టుకున్నారు. బస్సు డ్రైవర్, కండక్టర్, తోటి ప్రయాణికులు ఎంతగా వారించినా వినిపించుకోలేదు. డ్రైవర్ బస్సును ఉరవకొండ పీఎస్‌కు తీసుకెళ్లి గొడవ పడుతున్న ఇద్దరు మహిళలను పోలీసులకు అప్పగించారు. మహిళలకు ఉరవకొండ సీఐ మహనంది కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.


