మరి మీరు అమ్మేది కల్తీనా?.. లోకేష్‌కు బొత్స కౌంటర్‌ | Botsa Satyanarayana Challenges Nara Lokesh Comments On Ghee Quality, Raises Questions On Heritage Products | Sakshi
Sakshi News home page

మరి మీరు అమ్మేది కల్తీనా?.. లోకేష్‌కు బొత్స కౌంటర్‌

Feb 24 2026 12:44 PM | Updated on Feb 24 2026 3:22 PM

Botsa Satyanarayana Counter To Nara Lokesh

సాక్షి, అమరావతి: నారా లోకేష్‌ వ్యాఖ్యలపై శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కౌంటర్‌ ఇచ్చారు. వెయ్యిలోపు కిలో నెయ్యి దొరికితే కల్తీ అని లోకేష్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ‘‘హెరిటేజ్‌ 750 ఎంఎల్‌ నెయ్యి రిలయన్స్‌లో 456కి దొరుకుతుంది. హెరిటేజ్‌లో లీటర్‌ ఆవు నెయ్యి 608 రూపాయలకు దొరుకుతుంది. మరి మీరు అమ్మేది కల్తీనా?’’ అంటూ బొత్స ప్రశ్నించారు.

‘‘హెరిటేజ్‌ వెబ్‌సైట్‌ని ఎందుకు మర్చారో​ లోకేష్‌ చెప్పాలి. మొదట ఇందాపూర్‌ని మ్యాన్‌ఫాక్చర్‌ అని చెప్పారు. తర్వాత కో మ్యాన్‌ఫ్యాక్చర్‌ అని ఎందుకు మర్చారు? అంటూ బొత్స నిలదీశారు.

కాగా, శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్సీకి బొత్స స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు. మండలిలో శాంతి భద్రతల అంశం చర్చలో సంబంధం లేని అంశాలను టీడీపీ ప్రస్తావించింది. ‘‘వైఎస్సార్ తండ్రిని ఎవరు చంపారు?. తన తండ్రిని చంపిన వారిపై వైఎస్సార్ కక్ష తీర్చుకుని ఉంటే ఈ రోజు ఇలా మాట్లాడి ఉండేవారా?. సభకు సంబంధం లేని అంశాలను ప్రస్తావించడం సరికాదు’’ అని బొత్స మండిపడ్డారు.

హెరిటేజ్ నెయ్యి కల్తీనా? నిజం ఒప్పుకున్న లోకేష్

Advertisement
 
Advertisement
Advertisement